...
...
Next Story

తెలుగు సహా అన్ని సౌత్ ఇండియన్ భాషల్లో ధురంధర్ 2 మూవీ.. ఫ్యాన్స్ డిమాండ్‌తో కన్ఫమ్ చేసిన మేకర్స్

ధురంధర్ 2 మూవీ తెలుగు సహా అన్ని సౌత్ ఇండియన్ భాషల్లో రిలీజ్ కానున్నట్లు మేకర్స్ కన్ఫమ్ చేశారు. ఫ్యాన్స్ డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ధురంధర్ బ్లాక్‌బస్టర్ కావడంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

Published on: Dec 24, 2025, 16:40:06 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. కేవలం హిందీలోనే విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 900 కోట్ల మైలురాయిని దాటింది. సౌత్ ఇండియాలో ఈ సినిమాకు వచ్చిన ఆదరణ చూసి, దీని సీక్వెల్ ‘ధురంధర్ 2’ను తెలుగుతో సహా అన్ని దక్షిణాది భాషల్లో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

తెలుగులోనూ ధురంధర్ 2

తెలుగు సహా అన్ని సౌత్ ఇండియన్ భాషల్లో ధురంధర్ 2 మూవీ.. ఫ్యాన్స్ డిమాండ్‌తో కన్ఫమ్ చేసిన మేకర్స్
తెలుగు సహా అన్ని సౌత్ ఇండియన్ భాషల్లో ధురంధర్ 2 మూవీ.. ఫ్యాన్స్ డిమాండ్‌తో కన్ఫమ్ చేసిన మేకర్స్

డిసెంబర్ 5న విడుదలైన 'ధురంధర్' (Dhurandhar) సినిమాతో రణ్‌వీర్ సింగ్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. కేవలం హిందీ వెర్షన్ మాత్రమే రిలీజ్ అయినా ఇండియాలో రూ. 600 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 900 కోట్లు వసూలు చేసి సత్తా చాటింది. ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.

మొదటి పార్ట్ క్లైమాక్స్‌లో సీక్వెల్ గురించి అనౌన్స్ చేశారు. అంతేకాదు రంజాన్ సమయంలో అంటే వచ్చే ఏడాది మార్చి 19న రిలీజ్ చేయబోతున్నారు. అయితే మొదటి పార్ట్ కేవలం హిందీలోనే వచ్చినా, సౌత్ ఆడియన్స్ నుండి వచ్చిన భారీ డిమాండ్ మేరకు.. ‘ధురంధర్ 2’ను హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.

ముంబై కంటే మన దగ్గరే ఎక్కువ క్రేజ్

హిందీ సినిమా అయినా సరే హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో ఆక్యుపెన్సీ రేట్స్ ముంబై కంటే ఎక్కువగా ఉండటం విశేషం. 'సాక్నిల్క్' రిపోర్ట్ ప్రకారం మంగళవారం (డిసెంబర్ 23) నాడు ఆక్యుపెన్సీ చూస్తే హైదరాబాద్ లో 28.75%, చెన్నైలో 37.25%, బెంగళూరులో 49.25%గా ఉండటం విశేషం. అదే ముంబైలో మాత్రం 30 శాతంగానే ఉంది. దీంతో సౌత్ డిస్ట్రిబ్యూటర్లు సీక్వెల్‌ను కచ్చితంగా డబ్బింగ్ చేయాల్సిందేనని పట్టుబట్టారట.

రాకింగ్ స్టార్ యశ్‌తో పోటీ

ఇక ధురంధర్ మూవీ విషయానికి వస్తే.. పాకిస్థాన్‌లోని బలోచ్ గ్యాంగ్‌ను అంతమొందించడానికి వెళ్లే ఇండియన్ స్పై హంజా అలీ మజారీ (రణ్‌వీర్ సింగ్) కథ ఇది. సీక్వెల్‌లో హీరో బ్యాక్ స్టోరీని చూపించనున్నారు.

ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ కీలకపాత్రల్లో నటించారు. 'ఉరి' మూవీ ఫేమ్ ఆదిత్య ధర్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe