దురంధర్ కలెక్షన్ల విధ్వంసం.. ఇండియాలో 15 రోజుల్లోనే రూ.500 కోట్లు.. ఫస్ట్ మూవీగా మరో చరిత్ర

బాక్సాఫీస్ దగ్గర దురంధర్ ఊచకోత కొనసాగుతోంది. కలెక్షన్ల విధ్వంసం కొత్త రికార్డులు నమోదు చేస్తోంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మరో చరిత్ర సృష్టించింది. 

Published on: Dec 20, 2025, 17:03:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాక్సాఫీస్ సంచలనంగా మారిన దురంధర్ సినిమా రికార్డుల వేట కొనసాగిస్తోంది. మరో కొత్త రికార్డును ఈ స్పై థ్రిల్లర్ ఖాతాలో వేసుకుంది. ఇండియాలో అత్యంత త్వరగా రూ.500 కోట్ల కలెక్షన్లు సాధించిన సినిమా దురంధర్ నిలిచింది. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన దురంధర్ చరిత్ర తిరగరాస్తూనే ఉంది.

దురంధర్ సినిమాలో రణ్‌వీర్ సింగ్
దురంధర్ సినిమాలో రణ్‌వీర్ సింగ్

దురంధర్ రికార్డు

కలెక్షన్ల పరంగా రణ్‌వీర్ సింగ్ లీడ్ రోల్ ప్లే చేసిన దురంధర్ మూవీ మరో రికార్డు నెలకొల్పింది. ఇండియాలో అతి తక్కువ రోజుల్లో రూ.500 కోట్ల వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ విషయాన్ని దురంధర్ సినిమా మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. 15 రోజుల్లో ఈ చిత్రం ఇండియాలో రూ.503.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు ఖాతాలో వేసుకుందని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఫాస్టెస్ట్ రూ.500 కోట్ల సినిమా ఇదేనని పేర్కొన్నారు.

15వ రోజు కలెక్షన్లు

డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైన దురంధర్ మూవీ కలెక్షన్ల విధ్వంసం కొనసాగుతోంది. 15వ రోజు (డిసెంబర్ 19) ఈ సినిమా ఇండియాలో రూ.23.70 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ తెలిపారు. తొలి వారం రూ.218 కోట్లు ఖాతాలో వేసుకున్న దురంధర్.. రెండో వారం రూ.261.5 కోట్లు సంపాదించిందని పేర్కొన్నారు.

మూడో ప్లేస్ లో

2025లో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో దురంధర్ మూడో ప్లేస్ కు చేరుకుంది. ఫస్ట్ ప్లేస్ లో కాంతార చాప్టర్ 1 (రూ.622 కోట్లు), ఛావా (రూ.601 కోట్లు) ఉన్నాయి. దురంధర్ జోరు చూస్తుంటే ఈ సినిమాలను త్వరలోనే వెనక్కి నెట్టి నంబర్ వన్ ప్లేస్ ఆక్రమించుకునే అవకాశముంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా దురంధర్ మూవీ గ్రాస్ కలెక్షన్లు రూ.700 కోట్లు దాటాయి.

దురంధర్ గురించి

దురంధర్ సినిమా అనేది పాకిస్తాన్‌లో సెట్ చేసిన ఒక స్పై థ్రిల్లర్. ఇందులో రణ్‌వీర్ సింగ్ ఒక భారతీయ గూఢచారిగా లియారీలో ఉన్న తీవ్రవాద నెట్‌వర్క్‌లలోకి చొరబడతాడు. ఆ తర్వాత అతను దేశం కోసం ఏం చేశాడన్నది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

దురంధర్ సినిమాలో సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు. జ్యోతి దేశ్‌పాండే నిర్మించిన ఈ చిత్రం రెండు భాగాల సిరీస్‌లో మొదటి భాగం. ఇది బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. రామ్ గోపాల్ వర్మ, సందీప్ రెడ్డి వంగా లాంటి సెలబ్రిటీ డైరెక్టర్ల ప్రశంసలు అందుకుంది ఈ సినిమా. దురంధర్ రెండవ భాగం మార్చి 19, 2026న విడుదల కానుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More