ధురంధర్ సంచలనం- ఫస్ట్ బాలీవుడ్ సినిమాగా రికార్డు- ఇండియాలో రూ.700 కోట్లతో అదుర్స్

ధురంధర్ మరో సంచలనాన్ని ఖాతాలో వేసుకుంది. మరో బాలీవుడ్ సినిమాకు సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకుంది. కలెక్షన్ల మోత మోగిస్తున్న ఈ సినిమా మరో హిస్టరీ క్రియేట్ చేసింది. ఆ వివరాలు ఇక్కడ చూసేయండి. 

Published on: Dec 30, 2025, 09:41:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ధురంధర్ రికార్డుల వేట కొనసాగిస్తోంది. మరే బాలీవుడ్ సినిమాకు సాధ్యం కాని ఫీట్ ను అందుకుంది. ఇండియాలో రూ.700 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించిన తొలి బాలీవుడ్ సినిమాగా ధురంధర్ హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో ర‌ణ్‌వీర్ సింగ్‌ హీరో.

ధురంధర్ సినిమాలో ర‌ణ్‌వీర్ సింగ్‌
ధురంధర్ సినిమాలో ర‌ణ్‌వీర్ సింగ్‌

ధురంధర్ కలెక్షన్లు

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మూడు వారాలకు పైగా ప్రయాణించిన తరువాత ర‌ణ్‌వీర్ సింగ్‌ సినిమా ధురంధర్ మరో రికార్డు అందుకుంది. ర‌ణ్‌వీర్ సింగ్‌, సారా అర్జున్ జంటగా నటించిన ఈ చిత్రం వసూళ్లు సోమవారం కాస్త పడిపోయాయి. అయినా రికార్డుల మోత మాత్రం ఆగలేదు. సక్నిల్క్ ప్రకారం ధురంధర్ సోమవారం (డిసెంబర్ 29) రూ.10 కోట్లకు పైగా వసూలు చేసింది.

రూ.700 కోట్ల క్లబ్

ధురంధర్ సినిమా ఇండియా నెట్ కలెక్షన్లలో కొత్త రికార్డు అందుకుంది. ఈ మూవీ ఇండియాలోనే రూ.700 కోట్ల క్లబ్ లో ప్రవేశించింది. ఈ ఘనత సాధించిన తొలి బాలీవుడ్ సినిమాగా నిలిచింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం డిసెంబర్ 5న విడుదలైంది. ధురంధర్ మూడవ వారంలో రూ.172 కోట్లు వసూలు చేసింది. 22వ రోజు ఈ చిత్రం రూ.15 కోట్లు, 23వ రోజు రూ.20.50 కోట్లు, 24వ రోజు రూ.22.5 కోట్లు వసూలు చేసింది. 25వ రోజు రూ.10.75 నికర వసూళ్లను ఆర్జించింది.

పుష్ప 2 రికార్డు

ఇప్పటివరకు ధురంధర్ ఇండియాలో రూ.701.25 కోట్ల నెట్ కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. ధురంధర్ సినిమా సోమవారం మొత్తం 21.27 శాతం హిందీ ఆక్యుపెన్సీ కలిగి ఉంది. ఈ చిత్రం పుష్ప: ది రూల్ హిందీ నెట్ పై ఇప్పుడు దృష్టి సారించింది. సక్నిల్క్ ప్రకారం పుష్ప 2 హిందీలోనే రూ. 812.14 కోట్ల నెట్ వసూళ్లు సొంతం చేసుకుంది. ధురంధర్ 2025లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది.

టాప్ 10లో

2025లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగానే కాదు ధురంధర్.. టాప్ 10 ఇండియన్ మూవీస్ లో ఏడో స్థానంలో నిలిచింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. కాందహార్ విమాన హైజాక్, 2001 పార్లమెంట్ దాడి, 26/11 ముంబై దాడులు వంటి భౌగోళిక రాజకీయ, ఉగ్రవాద సంఘటనల నేపథ్యంలో ధురంధర్ తెరకెక్కింది.

ఈ సినిమాలో ర‌ణ్‌వీర్ సింగ్‌, సారా అర్జున్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, నవీన్ కౌశిక్, రాకేష్ బేడీ, డానిష్ పండోర్ తదితరులు నటించారు. జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ సంయుక్తంగా ధురంధర్ చిత్రాన్ని నిర్మించాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More