ఓటీటీలోకి 1000 కోట్ల సినిమా.. ధురంధర్ రిలీజ్ అప్పుడే.. ఆల్ టైమ్ రికార్డు రేట్.. తెలుగు సహా ఇతర భాషల్లోకి!
బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల దుమ్ము రేపుతున్న ధురంధర్ మూవీ ఓటీటీ రైట్స్ రేట్ లోనూ కొత్త హిస్టరీ క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం ఆల్ టైమ్ రికార్డు రేట్ దక్కిందని సమాచారం. మరి ఈ మూవీ ఏ ఓటీటీలోకి? ఎప్పడు? వస్తుందో చూసేయండి.
ఇప్పుడు ఇండియాలో అత్యంత హాట్ టాపిక్ గా మారిన సినిమా ధురంధర్. దీని గురించి రోజూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగిస్తున్న ఈ స్పై థ్రిల్లర్ మూవీ రికార్డులు తిరగరాస్తూనే ఉంది. తాజాగా ఓటీటీ రైట్స్ రేట్ విషయంలోనూ కొత్త హిస్టరీ క్రియేట్ చేసిందని తెలిసింది. ఈ సినిమా ఏ ఓటీటీలో వచ్చేది ఇక్కడ చూద్దాం.

ధురంధర్ ఓటీటీ
ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు అదరగొడుతూ మరోసారి ఇండియన్ సినిమా సత్తాను చాటుతోంది ధురంధర్. రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ స్పై థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ గురించి ఇప్పటి నుంచే ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా జనవరి 30న నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందన్నది లేటెస్ట్ బజ్.
రికార్డు రేట్
ధురంధర్ మూవీ ఓటీటీ రైట్స్ ను పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. దీని కోసం ఆల్ టైమ్ రికార్డు రేట్ ను నెట్‌ఫ్లిక్స్ చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పుష్ప 2 రికార్డును బ్రేక్ చేసిందని అంటున్నారు. గతంలో పుష్ప 2 మూవీ డిజిటల్ హక్కులు రూ.275 కోట్లకు అమ్ముడుపోయాయి. ఇప్పుడు ధురంధర్ సినిమా ఓటీటీ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.285 కోట్లు ఖర్చు పెట్టిందని తెలిసింది.
తెలుగులోనూ
రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ కేవలం హిందీలో మాత్రమే థియేటర్లలో రిలీజైంది. తెలుగులోనూ రిలీజ్ చేస్తారనే వార్తలు వచ్చాయి కానీ ఇప్పటివరకూ అలాంటిదేం జరగలేదు. ఈ నేపథ్యంలో ఓటీటీలో ఈ సినిమాను హిందీలోనే కాకుండా తెలుగుతో పాటు మిగతా సౌత్ ఇండియా భాషల్లోనే రిలీజ్ చేయనున్నారు. అంటే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఓటీటీ కోసం ధురంధర్ ను డబ్ చేయబోతున్నారని తెలిసింది.
అదిరే కలెక్షన్లు
డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ధురంధర్ మూవీ రిలీజైంది. ఈ సినిమా కలెక్షన్లలో దూసుకుపోతోంది. 21 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల వసూళ్లు దాటేసింది. అత్యధిక వేగంగా ఈ ఫీట్ సాధించిన ఇండియన్ మూవీగా నిలిచింది. మరోవైపు ఇండియాలోనే నెట్ కలెక్షన్లు రూ.700 కోట్లకు దగ్గరగా ఉన్నాయి. ఇండియాలో అత్యధిక నెట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా ధురంధర్ నిలిచింది.
అంతే కాకుండా 2025లో అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ సినిమా కూడా ధురంధర్. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు ఖాతాలో వేసుకున్న ‘ఎ’ రేటెడ్ ఇండియన్ మూవీ కూడా ఇదే. యానిమల్ రికార్డును బ్రేక్ చేసింది ధురంధర్.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


