బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్, డైరెక్టర్ ఆదిత్య ధర్ జంట చూడముచ్చటగా ఉంటుంది. అయితే వీరిద్దరి ప్రేమ కథలో ఎలాంటి సినిమాటిక్ డ్రామాలు లేవట. 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. తమది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదని, స్నేహం నుంచే ప్రేమ పుట్టిందని యామీ ఆసక్తికర విషయాలు పంచుకుంది.
యామీ, ఆదిత్య ప్రేమ ఇలా పుట్టింది

నటి యామీ గౌతమ్, దర్శకుడు ఆదిత్య ధర్ ప్రేమ కథ చాలా సింపుల్ అండ్ స్వీట్. వీరిద్దరూ ఒకరినొకరు ఎలా ఇష్టపడ్డారు అనే విషయాన్ని యామీ తాజాగా బయటపెట్టింది.
2019లో వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమా 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' (Uri) టైంలో వీరిద్దరూ కలిశారు. ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో యామీ ఒక కీలక పాత్ర చేసింది. ఆ సమయంలోనే తాము ఎలా ప్రేమలో పడ్డామో యామీ వెల్లడించింది.
"మేం సినిమా ప్రమోషన్స్ టైంలో మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. ముందు ఫ్రెండ్స్ అయ్యాం. సినిమాల్లో చూపించినట్టు మోకాళ్ల మీద కూర్చుని ప్రపోజ్ చేసుకోవడాలు, డ్రామాలు మా మధ్య జరగలేదు. అలాంటివి మా ఇద్దరికీ సెట్ కావు కూడా. మేం పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం.. మా కుటుంబాలు కూడా వెంటనే ఓకే చెప్పేశాయి. అంతా చాలా సాఫీగా, సహజంగా జరిగిపోయింది" అని యామీ చెప్పింది.
భర్త ఆదిత్య ధర్ గురించి..
భర్తగా మాత్రమే కాదు.. దర్శకుడిగా కూడా ఆదిత్య అంటే తనకు చాలా గౌరవం అని యామీ తెలిపింది. "ఆయన చాలా మంచి దర్శకుడు. ఆదిత్య సెట్స్‌లో ఎప్పుడూ కూల్‌గా ఉంటారు. ఆయనకు కోపం రావడం నేనెప్పుడూ చూడలేదు. అది ఆయనలోని గొప్ప క్వాలిటీ" అని మెచ్చుకుంది. 2021 జూన్‌లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 2024లో వీరికి బాబు 'వేదవిద్' పుట్టాడు.
తాజాగా యామీ గౌతమ్ నటించిన 'హక్' (Haq) సినిమా నవంబర్ 7న విడుదలైంది. షా బానో బేగం కేసు ఆధారంగా సుపర్ణ్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అటు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన రణ్వీర్ సింగ్ సినిమా 'ధురంధర్' (Dhurandhar) డిసెంబర్ 5న విడుదలై రికార్డులు సృష్టిస్తోంది. ఈ మూవీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల మార్క్ అందుకోవడం విశేషం.
{{/usCountry}}తాజాగా యామీ గౌతమ్ నటించిన 'హక్' (Haq) సినిమా నవంబర్ 7న విడుదలైంది. షా బానో బేగం కేసు ఆధారంగా సుపర్ణ్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అటు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన రణ్వీర్ సింగ్ సినిమా 'ధురంధర్' (Dhurandhar) డిసెంబర్ 5న విడుదలై రికార్డులు సృష్టిస్తోంది. ఈ మూవీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల మార్క్ అందుకోవడం విశేషం.
{{/usCountry}}