...
...
Next Story

తమన్నా స్టార్‌డమ్ అలాంటిది.. అందుకే ఆ పాటకు వద్దనుకున్నాం..: ధురంధర్ కొరియోగ్రాఫర్ క్లారిటీ

ధురంధర్ మూవీలో ఓ పాటకు తమన్నాను తిరస్కరించారని వస్తున్న వార్తలను ఆ మూవీ కొరియోగ్రాఫర్ ఖండించాడు. ఆ పదం వాడొద్దని, ఆమె స్టార్‌డమ్ కు తగినట్లుగా లేకపోవడం వల్లే ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు.

Published on: Dec 23, 2025, 13:46:38 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

రణ్‌వీర్ సింగ్ బ్లాక్‌బస్టర్ మూవీ 'ధురంధర్'లోని 'షరారత్' పాట కోసం తమన్నా భాటియాను రిజెక్ట్ చేశారన్న వార్తలపై కొరియోగ్రాఫర్ విజయ్ గంగూలీ స్పందించాడు. ఆమెను రిజెక్ట్ చేయలేదని, ఆ సీన్‌లో ఉండాల్సిన టెన్షన్ కంటే తమన్నా స్టార్ ఇమేజ్ ఎక్కువ డామినేట్ చేస్తుందనే ఉద్దేశంతోనే ఆమెను సంప్రదించలేదని అతడు స్పష్టం చేశాడు.

తమన్నాను వద్దనుకున్నాం..

తమన్నా స్టార్‌డమ్ అలాంటిది.. అందుకే ఆ పాటకు వద్దనుకున్నాం..: ధురంధర్ కొరియోగ్రాఫర్ క్లారిటీ
తమన్నా స్టార్‌డమ్ అలాంటిది.. అందుకే ఆ పాటకు వద్దనుకున్నాం..: ధురంధర్ కొరియోగ్రాఫర్ క్లారిటీ

ఇండియాలో ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన మూవీ 'ధురంధర్' (Dhurandhar). రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ స్పై థ్రిల్లర్‌లో 'షరారత్' అనే సాంగ్ బాగా పాపులర్ అయ్యింది. ఆయేషా ఖాన్, క్రిస్టల్ డిసౌజా ఆడిపాడిన ఈ పాట కోసం మొదట మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాను అనుకున్నారట. అయితే దర్శకుడు ఆమెను రిజెక్ట్ చేశారంటూ వచ్చిన వార్తలను కొరియోగ్రాఫర్ విజయ్ గంగూలీ ఖండించాడు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కొరియోగ్రాఫర్ విజయ్ మాట్లాడుతూ.. ఈ పాట కోసం తాను తమన్నాను అనుకున్నానని, కానీ దర్శకుడు ఆదిత్య ధర్ మాత్రం ఇద్దరు డ్యాన్సర్లు ఉంటే బాగుంటుందని చెప్పారని అన్నాడు. దీన్ని మీడియాలో "తమన్నాను రిజెక్ట్ చేశారు" అని రాయడంతో విజయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించాడు.

"రిజెక్ట్ అనడం తప్పు.. ఆమె స్టార్ పవర్ అది"

ధురంధర్ మూవీ కొరియోగ్రాఫర్ విజయ్ గంగూలీ తన పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చాడు. "దయచేసి 'రిజెక్ట్' అనే పదాలు వాడకండి. తమన్నా స్టార్ డమ్ చాలా పెద్దది. ఈ పాట సినిమాలో ఒక సీరియస్ సిచువేషన్‌లో వస్తుంది. ఆ సీన్‌లో ఉండాల్సిన టెన్షన్ కంటే.. తమన్నా స్క్రీన్ మీద కనిపిస్తే ఆడియన్స్ ఫోకస్ మొత్తం ఆమె మీదకే వెళ్తుంది. అది కథకు మంచిది కాదు. అందుకే ఆమెను ఈ పాట కోసం పరిశీలించలేదు తప్ప.. ఆమెను రిజెక్ట్ చేయడం అనేది జరగలేదు" అని విజయ్ వివరణ ఇచ్చాడు.

అసలు సీన్ ఏంటంటే?

మరోవైపు రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ ధురంధర్ మూవీ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. రూ. 872 కోట్లు వసూలు చేసి.. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా నిలిచింది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe