నెట్‌ఫ్లిక్స్ లోనూ ధురంధర్ జోరు కొనసాగుతోంది. ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కోసం చాలా రోజులుగా ఆసక్తిగా ఎదురు చూసిన అభిమానులు.. వచ్చీ రాగానే ఎగబడి చూస్తున్నారు. దీంతో మూడు రోజుల్లోనే 7.6 మిలియన్ వ్యూస్ తో నాన్ ఇంగ్లిష్ సినిమాల కేటగిరీలో గ్లోబల్ లెవెల్లో నంబర్ వన్ సినిమాగా నిలిచింది.
ధురంధర్ దూకుడు

ఆదిత్య ధర్ డైరెక్షన్ లో రణ్‌వీర్ సింగ్ లీడ్ రోల్లో నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ జనవరి 30న నెట్‌ఫ్లిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తొలి మూడు రోజుల్లో అంటే జనవరి 30 నుంచి ఫిబ్రవరి 1 మధ్య ఈ సినిమాకు ఏకంగా 7.6 మిలియన్ అంటే 76 లక్షల వ్యూస్ వచ్చాయి. గ్లోబల్ లెవెల్లో నాన్ ఇంగ్లిష్ కేటగిరీలో నంబర్ వన్ సినిమాగా ట్రెండింగ్ లో ఉంది.
ఏడు దేశాల్లో నంబర్ వన్
ధురంధర్ మూవీ ఇండియా సహా ఏడు దేశాల్లో నంబర్ వన్ స్థానంలో ఉండటం విశేషం. వీటిలో పాకిస్థాన్ కూడా ఒకటి. అంతేకాదు మరో 22 దేశాల్లో టాప్ 10లో చోటు దక్కించుకుంది. ఓ ఇండియన్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఈ స్థాయి ఆదరణ దక్కడం మామూలు విషయం కాదు. బాక్సాఫీస్ కంటే నెట్‌ఫ్లిక్స్ లో మరింత మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇండియాలో హిందీతోపాటు తెలుగు, తమిళంలోనూ స్ట్రీమింగ్ కు రావడం కలిసి వచ్చింది.
టికెట్ల అమ్మకాల్లోనూ సరికొత్త రికార్డు
ధురంధర్ అటు టికెట్ల అమ్మకాల్లోనూ రికార్డు క్రియేట్ చేసింది. సరిగ్గా సీక్వెల్ టీజర్ విడుదలైన రోజే 'ధురంధర్' మూవీ ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక అరుదైన మైలురాయిని దాటింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ సినిమాను 4 కోట్ల మంది (40 మిలియన్ల ఫుట్‌ఫాల్స్) థియేటర్లలో చూశారు. భారతీయ సినిమా చరిత్రలో ఈ ఘనత సాధించిన కేవలం 19 చిత్రాల జాబితాలో 'ధురంధర్' చోటు దక్కించుకుంది.
24 ఏళ్ల నిరీక్షణకు తెర.. 'గదర్' తర్వాత ఇదే
గతేడాది డిసెంబర్ 5న విడుదలైన ధురంధర్.. మొదటి రోజు రూ. 30 కోట్లతో పర్వాలేదనిపించే ఓపెనింగ్ సాధించింది. కానీ పాజిటివ్ మౌత్ టాక్ అద్భుతంగా ఉండటంతో క్రమంగా పుంజుకుంది. జనవరి నాటికి 7 వారాల్లోనే రూ. 800 కోట్ల నెట్ (రూ. 1000 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది.
{{/usCountry}}గతేడాది డిసెంబర్ 5న విడుదలైన ధురంధర్.. మొదటి రోజు రూ. 30 కోట్లతో పర్వాలేదనిపించే ఓపెనింగ్ సాధించింది. కానీ పాజిటివ్ మౌత్ టాక్ అద్భుతంగా ఉండటంతో క్రమంగా పుంజుకుంది. జనవరి నాటికి 7 వారాల్లోనే రూ. 800 కోట్ల నెట్ (రూ. 1000 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది.
{{/usCountry}}ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం సగటు టికెట్ ధర రూ. 250గా లెక్కించినా, ఈ వారానికి సినిమా టికెట్ల విక్రయాలు 4 కోట్లు దాటాయి. బాలీవుడ్‌లో ఈ మైలురాయిని అందుకోవడానికి 24 ఏళ్లు పట్టింది. చివరిసారిగా 2001లో వచ్చిన సన్నీ డియోల్ 'గదర్: ఏక్ ప్రేమ్ కథ' 5 కోట్ల ఫుట్‌ఫాల్స్ సాధించింది. ఆ తర్వాత మరే హిందీ సినిమా (బాహుబలి 2 డబ్బింగ్ కాకుండా) ఈ స్థాయి ఆదరణను దక్కించుకోలేదు.
దిగ్గజాలను దాటేసిన రణ్‌వీర్
4 కోట్ల టికెట్ల మైలురాయిని దాటడం ద్వారా 'ధురంధర్' ఎన్నో ఆల్-టైమ్ బ్లాక్‌బస్టర్లను వెనక్కి నెట్టింది. ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ (3.7 కోట్లు), పీకే (3.5 కోట్లు).. షారుఖ్ ఖాన్ నటించిన కుచ్ కుచ్ హోతా హై (3.5 కోట్లు), కభీ ఖుషీ కభీ ఘమ్ (3.1 కోట్లు) లాంటి సినిమాలను వెనక్కి నెట్టింది.
అయితే భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక జనాదరణ పొందిన టాప్-4 సినిమాలు షోలే, బాహుబలి 2, మొఘల్-ఏ-ఆజం, మదర్ ఇండియా (అన్ని 10 కోట్ల పైనే) రికార్డులను అందుకోవడం కష్టమే అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇదొక సంచలనమే.