రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన యాక్షన్ స్పై థ్రిల్లర్ 'ధురంధర్' (Dhurandhar) బాక్సాఫీస్ దగ్గర అడ్డూ అదుపూ లేకుండా దూసుకెళ్తూనే ఉంది. ఇప్పటికే రూ. 1100 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా.. ఇప్పుడు టికెట్ల అమ్మకాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. బుక్ మై షో (BookMyShow)లో అత్యధిక టికెట్లు అమ్ముడైన బాలీవుడ్ సినిమాగా నిలిచి.. షారుక్ ఖాన్ 'జవాన్', విక్కీ కౌశల్ 'ఛావా' రికార్డులను బద్దలు కొట్టింది.
బుక్ మై షోలో 'నంబర్ 1'.. కానీ పుష్ప రాజ్ రికార్డు సేఫ్

ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన 'ధురంధర్' కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. థియేటర్ల వద్దే కాదు, ఆన్‌లైన్ బుకింగ్స్‌లోనూ ఈ సినిమా జోరు మామూలుగా లేదు. ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ 'బుక్ మై షో'లో ఈ సినిమా అమ్మకాల లెక్కలు ఇలా ఉన్నాయి.
ధురంధర్ మూవీ ఇప్పటివరకు 1.3 కోట్ల టికెట్లు అమ్ముడయ్యాయి. దీంతో ఇది ఆల్ టైమ్ బెస్ట్ సెల్లింగ్ హిందీ సినిమాగా నిలిచింది. గతంలో విక్కీ కౌశల్ నటించిన 'ఛావా' (1.25 కోట్లు), షారుక్ ఖాన్ 'జవాన్' (1.24 కోట్లు), 'స్త్రీ 2' (1 కోటి+) రికార్డులను 'ధురంధర్' దాటేసింది.
అయితే ఓవరాల్‌గా ఇండియన్ సినిమా రికార్డు మాత్రం మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2: ది రూల్' పేరు మీదే ఉంది. పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు ఏకంగా 2 కోట్ల టికెట్లు అమ్ముడయ్యాయి. ఆ రికార్డును అందుకోవడానికి 'ధురంధర్' ఇంకా చాలా దూరంలో ఉంది.
ధురంధర్ 1100 కోట్ల సామ్రాజ్యం
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు ఇండియాలో మొత్తం 3.5 కోట్ల మంది (ఆన్‌లైన్ + ఆఫ్‌లైన్ కలిపి) ఈ సినిమాను చూశారు. ఇండియా గ్రాస్ రూ. 886 కోట్లు కాగా, ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ రూ. 1100 కోట్లు దాటాయి.
పాకిస్థాన్ గ్యాంగ్‌స్టర్ కథతో, రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ ఇండియన్ స్పైగా, అక్షయ్ ఖన్నా విలన్‌గా, మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ కథకు ముగింపునిచ్చే 'ధురంధర్ పార్ట్ 2' ఇదే ఏడాది మార్చిలో రిలీజ్ కానుంది.
{{/usCountry}}పాకిస్థాన్ గ్యాంగ్‌స్టర్ కథతో, రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ ఇండియన్ స్పైగా, అక్షయ్ ఖన్నా విలన్‌గా, మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ కథకు ముగింపునిచ్చే 'ధురంధర్ పార్ట్ 2' ఇదే ఏడాది మార్చిలో రిలీజ్ కానుంది.
{{/usCountry}}