...
...
Next Story

Rashmika Mandanna: విజయ్ కోసం ఇంట్లో పెద్ద ఫైట్ చేసిన రష్మిక.. ఆ సినిమా వద్దని వారించిన ఫ్యామిలీ.. అసలు కారణం అదేనా?

Rashmika Mandanna: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హ్యాపీగా పెళ్లి చేసేసుకున్నారు. అయితే ఓ సమయంలో విజయ్ దేవరకొండతో సినిమా కోసం ఇంట్లోవాళ్లతో రష్మిక మందన్న ఫైట్ చేయాల్సి వచ్చింది. ఈ విషయాన్ని రష్మికానే స్వయంగా చెప్పింది.

Published on: Mar 14, 2026, 18:03:55 IST
Advertisement

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ జోడీ గత కొన్ని వారాలుగా వార్తల్లో కొనసాగుతూనే ఉంది. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో వీళ్ల వివాహం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ లో మార్చి 4న రిసెప్షన్ నిర్వహించారు. ఈ పెళ్లి, రిసెప్షన్ ఫొటోలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడేమో డియర్ కామ్రేడ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రష్మిక మందన్న స్పీచ్ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది.

రష్మిక, విజయ్ కలిసి

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి రెండు సినిమాలు చేశారు. 2018లో గీత గోవిందం, 2019లో డియర్ కామ్రేడ్ సినిమాల్లో జోడీగా కలిసి కనిపించారు. అయితే గీత గోవిందం చేసిన తర్వాత విజయ్ తో మళ్లీ డియర్ కామ్రేడ్ లో కలిసి నటించేందుకు రష్మిక తన ఇంట్లో వాళ్లతో ఫైట్ చేసింది. ఈ విషయాన్ని డియర్ కామ్రేడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రష్మిక మందన్న స్వయంగా వెల్లడించింది.

సినిమా వద్దని

“నేను నా తల్లిదండ్రులు, కుటుంబం, స్నేహితులతో పోరాడిన తర్వాతే సినీ పరిశ్రమలోకి వచ్చా. అమ్మాయిలకు ఇది సురక్షితం కాదనే అభిప్రాయం ఉంది. సినీ నేపథ్యం లేకపోయినా నేను పట్టుదలతో పనిచేశా. భరత్ (కమ్మా) సర్ నాకు స్క్రిప్ట్ (డియర్ కామ్రేడ్ మూవీ) పంపినప్పుడు ఈ మూవీ చేయాలనుకున్నా.

కానీ నా కుటుంబాన్ని ఒప్పించడానికి చాలా సమయం పట్టింది. ఇంట్లో పెద్ద ఫైట్ జరిగింది. వాళ్లేమో 'వద్దు, విజయ్‌తో రెండో సినిమా చేయొద్దు' అన్నారు. నేనేమో 'నేను ఎవరితో చేస్తున్నాననేది ముఖ్యం కాదు' అని ఒప్పించా’’ అని రష్మిక చెప్పింది.

అదే కారణమా?

రష్మిక వార్నింగ్

విజయ్ దేవరకొండతో రష్మిక మందన్న పెళ్లి తర్వాత గతంలో తన లైఫ్ కు సంబంధించిన విషయాలపై ఓ ఆడియో క్లిప్ వైరల్ అయింది. 2017లో రక్షిత్ శెట్టితో రష్మిక ఎంగేజ్మెంట్ జరిగింది. 2018లో వీళ్లు ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వైరల్ గా మారిన ఆడియో క్లిప్ పై రష్మిక ఫైర్ అయింది. 24 గంటల్లో ఆ క్లిప్ తొలగించాలని వార్నింగ్ ఇచ్చింది.

మూడో సినిమా

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా చేస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘రణబాలి’లో కలిసి నటిస్తున్నారు. ఈ మూవీ 2026 సెప్టెంబర్ లో థియేటర్లకు రాబోతుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks