...
...
Next Story

ఓటీటీలోకి మోహ‌న్‌లాల్ వార‌సుడి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ హార‌ర్ థ్రిల్ల‌ర్‌-హెయిర్ క్లిప్‌తో వ‌చ్చే ఆత్మ‌-స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ వారసుడి ప్రణవ్ కూడా తండ్రి బాటలో సాగుతూ యాక్టింగ్ కెరీర్ నిర్మించుకుంటున్నాడు. అతని లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

Published on: Nov 28, 2025, 20:09:45 IST
Advertisement

హారర్ థ్రిల్లర్ మూవీస్ అంటేనే భయపెడతాయి. ఇందులో కామెడీని మిక్స్ చేసిన సినిమాలు కొన్ని. కానీ కేవలం హారర్ ఎలిమెంట్స్ తోనే వణికించే చిత్రాలు కొన్ని వస్తాయి. అలాంటి ఫ్యూర్ హారర్ థ్రిల్లర్ ‘డీయస్ ఈరే’. మలయాళ దిగ్గజ నటుడు మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ ఈ సినిమాలో హీరో. అతను యాక్టింగ్ తో మెప్పించాడు.

డీయస్ ఈరే ఓటీటీ

ఓటీటీలోకి మలయాళ హారర్ థ్రిల్లర్ (x)
ఓటీటీలోకి మలయాళ హారర్ థ్రిల్లర్ (x)

మలయాళ హారర్ థ్రిల్లర్ డీయస్ ఈరే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను ఇవాళ (నవంబర్ 28) ఓటీటీ ప్లాట్ ఫామ్ అనౌన్స్ చేసింది. ఈ బ్లాక్ బస్టర్ సినిమా జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. డిసెంబర్ 5 న డీయస్ ఈరే సినిమా ఓటీటీ రిలీజ్ అవుతుంది. ఓటీటీ డేట్ ను అనౌన్స్ చేస్తూ జియోహాట్‌స్టార్‌ మలయాళం ఎక్స్ లో వీడియో పంచుకుంది.

తెలుగులోనూ

డీయస్ ఈరే సినిమా తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. ఈ హారర్ థ్రిల్లర్ మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా అక్టోబర్ 31, 2025న థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీకి రాహుల్ సదాశివన్ డైరెక్టర్. ఈ చిత్రాన్ని నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ బ్యానర్లపై చక్రవర్తి, రామచంద్ర, శశికాంత్ నిర్మించారు.

డీయస్ ఈరే స్టోరీ

ఆత్మ, ప్రతీకారం అనే అంశాల చూట్టూ సాగే సినిమానే డీయస్ ఈరే. ఇందులో రోహన్ (ప్రణవ్ మోహన్ లాల్) ఓ ఆర్కిటెక్ట్. అతనిది రిచ్ ఫ్యామిలీ. పేరేంట్స్ అమెరికాలో ఉంటారు. రోహన్ ఇక్కడ ఇండియాలో ఓ పెద్ద ఇంట్లో ఒంటరిగానే ఉంటాడు. ఒక రోజు అతని క్లాస్ మేట్ కని (నర్తకి) సూసైడ్ చేసుకుంటుంది. ఆ ఫ్యామిలీని పరామర్శించేందుకు రోహన్ వాళ్ల ఇంటికి వెళ్తాడు.

హెయిర్ క్లిప్ తో

మరి ఆ ఆత్మ ఎవరు? కనిని ప్రేమించిన ఫిలిప్ కు ఈ కథకు సంబంధం ఏంటీ? క్లైమాక్స్ లో వచ్చే సూపర్ ట్విస్ట్ ఏంటీ? అన్నది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks