Digger Movie Review And Rating In Telugu: హాలీవుడ్‌లో కేవలం విమానాలకు వేలాడటం, కదిలే రైళ్ల నుంచి దూకడం లాంటి భారీ సాహసాలే కాకుండా, తనలోని అసలైన నటుడిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పారు దిగ్గజ హీరో టామ్ క్రూజ్. ఆస్కార్ అవార్డు గ్రహీత, దిగ్గజ దర్శకుడు అలెజాండ్రో ఇన్యారిటూ తెరకెక్కించిన 'డిగ్గర్' చిత్రంలో ఆయన ప్రదర్శించిన అభినయం ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.
కార్పొరేట్ దిగ్గజాల స్వార్థాన్ని ఎండగట్టిన సినిమా

పర్యావరణ మార్పులు, ప్రపంచాన్ని శాసిస్తున్న కార్పొరేట్ దిగ్గజాల స్వార్థాన్ని ఎండగడుతూ వచ్చిన ఈ డార్క్ కామెడీ సెటైర్ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందిస్తుంది. హాలీవుడ్‌లో తెరకెక్కిన పొలిటికల్ సెటైరికల్ డార్క్ కామెడీ సినిమా ఎలా ఉందో నేటి డిగ్గర్ రివ్యూలో తెలుసుకుందాం.
పర్యావరణ విపత్తు.. ఒక స్వార్థపరుడి కథ!
ఈ సినిమా కథంతా డిగ్గర్ రాక్‌వెల్ (టామ్ క్రూజ్) అనే బిలియనీర్ చమురు వ్యాపారి చుట్టూ తిరుగుతుంది. తన వ్యాపార స్వార్థం కోసం ప్రకృతిని నాశనం చేసి, భారీ పర్యావరణ విపత్తుకు కారణమైన డిగ్గర్.. ఆ సంక్షోభం నుంచి ప్రపంచాన్ని కాపాడేది కూడా తానేనని ప్రచారం చేసుకుంటాడు. మంచు కరిగి సునామీ రావడం లాంటి ఘట్టాలు ఇటీవల నేపాల్‌లో సంభవించిన ప్రకృతిక విపత్తులను గుర్తుచేస్తాయి.
కథ మధ్యలో పరిచయమయ్యే కర్టిస్ అనే వ్యక్తి జీవితం.. డిగ్గర్ వల్ల ఎలాంటి మలుపులు తిరిగింది అనే అంశం కథలో ఆసక్తికరంగా సాగుతుంది. పర్యావరణ పరిరక్షణ పట్ల అగ్రరాజ్యాల నిర్లక్ష్యాన్ని, కార్పొరేట్ శక్తుల దోపిడీని ఇన్యారిటూ అత్యంత పదునైన వ్యంగ్యంతో తెరపై ఆవిష్కరించారు.
టామ్ క్రూజ్ విశ్వరూపం.. మిగతా నటుల ప్రతిభ!
భారీ యాక్షన్ స్టంట్లకు దూరంగా ఉంటూ కేవలం హావభావాలు, సంభాషణలతో టామ్ క్రూజ్ జీవించారు. సినిమాలో దాదాపు 10 నిమిషాల పాటు సాగే ఆయన ఏకపాత్రాభినయం (మోనోలాగ్) హాలీవుడ్ చిత్రాల్లోనే ఒక ప్రత్యేక ఘట్టంగా నిలిచిపోతుంది. తన వద్ద ఉన్న అపారమైన సంపదతో ప్రపంచాన్ని శాసించవచ్చనే బిలియనీర్ అహంకారాన్ని ఆయన కళ్లకు కట్టినట్లు చూపించారు.
డోనాల్డ్ ట్రంప్, జో బైడెన్‌ల కలయికలా
{{/usCountry}}భారీ యాక్షన్ స్టంట్లకు దూరంగా ఉంటూ కేవలం హావభావాలు, సంభాషణలతో టామ్ క్రూజ్ జీవించారు. సినిమాలో దాదాపు 10 నిమిషాల పాటు సాగే ఆయన ఏకపాత్రాభినయం (మోనోలాగ్) హాలీవుడ్ చిత్రాల్లోనే ఒక ప్రత్యేక ఘట్టంగా నిలిచిపోతుంది. తన వద్ద ఉన్న అపారమైన సంపదతో ప్రపంచాన్ని శాసించవచ్చనే బిలియనీర్ అహంకారాన్ని ఆయన కళ్లకు కట్టినట్లు చూపించారు.
డోనాల్డ్ ట్రంప్, జో బైడెన్‌ల కలయికలా
{{/usCountry}}అమెరికా అధ్యక్షుడిగా నటించిన జాన్ గుడ్‌మ్యాన్ నటన నవ్వులు పూయిస్తుంది. రెడ్ టై ధరించడం, ఓవల్ ఆఫీసులో బర్గర్లు తింటూ జ్ఞాపకశక్తి లోపంతో ఇబ్బంది పడటం లాంటి సన్నివేశాలు డోనాల్డ్ ట్రంప్, జో బైడెన్‌ల కలయికలా కనిపిస్తాయి.
ఆలోచింపజేసేలా వినోదం
వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ గణేష్ పాత్రలో రిజ్ అహ్మద్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. టామ్ క్రూజ్, రిజ్ అహ్మద్ మధ్య వచ్చే సన్నివేశాలు వినోదంతో పాటు తీవ్రంగా ఆలోచింపజేస్తాయి.
సహనానికి పరీక్ష.. కానీ అద్భుతమైన ప్రయోగం!
'డిగ్గర్' సినిమా అందరినీ మెప్పించే సాధారణ చిత్రం కాదు. కథనంలో వచ్చే కొన్ని మలుపులు సగటు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడతాయి. అయితే జెస్సీ ప్లెమన్స్ అతిథి పాత్ర, ఇన్యారిటూ టేకింగ్, సుదీర్ఘమైన అన్‌కట్ షాట్లు ఈ చిత్రాన్ని ఒక వినూత్న ప్రయోగంగా మార్చాయి. పర్యావరణ స్పృహతో పాటు పదునైన రాజకీయ వ్యంగ్యాన్ని కోరుకునే సినీప్రియులకు 'డిగ్గర్' ఒక తప్పక చూడాల్సిన చిత్రం.