Oscar 2027: ఆస్కార్ 2027 బరిలో ఇండియన్ క్రైమ్ థ్రిల్లర్- హత్యకు దారితీసిన స్వేచ్ఛ- చేజార్చుకున్న రామ్ చరణ్ పెద్ది- ఎలా?

Oscar 2027 Indian Entry Movie Gondhal: 99వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి భారత్ తరఫున క్రైమ్ థ్రిల్లర్ 'గోంధాల్' ఎంపికైంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) శుక్రవారం ఈ నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించింది. కానీ, ఆస్కార్ 2027 పోటీని రామ్ చరణ్ పెద్ది చేజార్చుకుంది.

Published on: Sep 19, 2026, 11:52:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Oscar 2027 Indian Entry Movie Gondhal: ప్రతిష్టాత్మక ఆస్కార్ బరిలో నిలిచే భారత అధికారిక చిత్రాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) ప్రకటించింది. మహారాష్ట్ర సంస్కృతి, సంప్రదాయ నేపథ్యంతో రూపొందిన మరాఠీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం 'గోంధాల్' (Gondhal) 99వ అకాడమీ అవార్డుల్లో (ఆస్కార్ 2027) ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో భారత్ తరఫున పోటీపడనుంది.

ఆస్కార్ 2027 బరిలో ఇండియన్ క్రైమ్ థ్రిల్లర్- హత్యకు దారితీసిన స్వేచ్ఛ- చేజార్చుకున్న రామ్ చరణ్ పెద్ది- ఎలా?
ఆస్కార్ 2027 బరిలో ఇండియన్ క్రైమ్ థ్రిల్లర్- హత్యకు దారితీసిన స్వేచ్ఛ- చేజార్చుకున్న రామ్ చరణ్ పెద్ది- ఎలా?

33 చిత్రాలను వెనక్కి నెట్టి..

సంతోష్ దావఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మరాఠీ చిత్రసీమకు అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త గుర్తింపు తెచ్చిపెట్టింది. దేశవ్యాప్తంగా వివిధ భాషల నుంచి ఆస్కార్ పరిశీలనకు వచ్చిన 33 చిత్రాలను అధిగమించి 'గోంధాల్' ఈ గౌరవాన్ని దక్కించుకుంది.

ఈ విషయాన్ని ఎంపిక కమిటీ చైర్‌పర్సన్ పి. శేషాద్రి వెల్లడించారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రశంసలు అందుకున్న గోంధాల్ సినిమా, భారత్ 56వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో (IFFI) సంతోష్ దావఖర్‌కు ఉత్తమ దర్శకుడిగా 'సిల్వర్ పీకాక్' పురస్కారాన్ని తెచ్చిపెట్టింది.

'గోంధాల్' కథాంశం ఏమిటంటే?

మహారాష్ట్ర గ్రామీణ నేపథ్యంలో ఒకే ఒక్క రాత్రి జరిగే ఉత్కంఠభరిత సంఘటనల సమాహారంగా ఈ 117 నిమిషాల చిత్రం సాగుతుంది. 'గోంధాల్' అనే సంప్రదాయ అర్థరాత్రి పూజా క్రతువు ప్రధాన నేపథ్యంగా సినిమా కథ ఉంటుంది.

సుమన్ (ఇషితా దేశ్‌ముఖ్) అనే యువతి, ధనవంతుడైన ఆనంద్ (యోగేష్ సోహోని)తో పెళ్లయినా జీవితంలో అసంతృప్తిగా ఉంటుంది. ఈ క్రమంలో సంప్రదాయ గోంధాల్ కళాకారుడైన సాహెబాతో సుమన్ ప్రేమలో పడుతుంది.

హత్యకు దారి తీసిన స్వేచ్ఛ కోసం వేసిన అడుగు

తన పెళ్లి బంధం నుంచి బయటపడాలనే ఆలోచనతో సుమన్ ఒక ప్రమాదకరమైన ప్లాన్ వేసి, ఆనంద్ బావమరిది సర్జేరావ్ (నిషాద్ భోయిర్)ను అందులోకి లాగుతుంది. స్వేచ్ఛ కోసం వేసిన ఈ అడుగు చివరకు ఓ హత్యకు దారితీస్తుంది. ప్రేమ, నమ్మకద్రోహం, స్వార్థం, ప్రాణభయం కలబోతగా ఈ కథ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.

ఆస్కార్ రేసులో మరాఠీ చిత్రాల ఘనత

ఆస్కార్ పోటీకి భారత్ అధికారికంగా పంపిన మరాఠీ చిత్రాల్లో 'గోంధాల్' నాల్గవది. గతంలో 'శ్వాస్' (2004), 'హరిశ్చంద్రాచి ఫ్యాక్టరీ' (2009), 'కోర్ట్' (2015) సినిమాలు భారత్ తరఫున ఆస్కార్ బరిలో నిలిచాయి.

ఇప్పటివరకు భారత చలనచిత్ర చరిత్రలో 'మదర్ ఇండియా', 'సలామ్ బాంబే', 'లాగాన్' చిత్రాలు మాత్రమే ఆస్కార్ చివరి నామినేషన్ల (టాప్-5) వరకు వెళ్లాయి. గతేడాది నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో వచ్చిన జాన్వీ కపూర్ 'హోమ్‌బౌండ్' ఎంపికైనప్పటికీ తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది.

చేజార్చుకున్న రామ్ చరణ్ పెద్ది

ఇదిలా ఉంటే, ఆస్కార్ 2027 కోసం తెలుగు నుంచి రామ్ చరణ్ పెద్ది సినిమాను పంపారు ఎఫ్‌ఎఫ్‌ఐ సభ్యులు. పెద్దితోపాటు ఇండియా వైడ్‌గా 33 సినిమాలు పోటీ పడ్డాయి. అందులో సన్నీ డియోల్ ‘బోర్డర్ 2’, రణ్‌వీర్ సింగ్ ‘ధురందర్’, ‘ధురందర్: ది రివెంజ్’, యామీ గౌతమ్ ‘హక్’, ఫర్హాన్ అక్తర్ ‘120 బహదూర్’, ఇంతియాజ్ అలీ ‘మై వాపస్ ఆవుంగా’, ‘హనుమాన్ అంశ్’ వంటి గొప్ప సినిమాలు ఉన్నాయి.

ఈ 33 సినిమాలన్నింటిని గత 10 రోజులుగా వీక్షించిన కమిటీ ‘గోంధాల్’, ‘అంఘ్’, ‘ఇక్కిస్’ చిత్రాలని టాప్ 3గా సెలెక్ట్ చేశాయి. ఇక వీటిలో ఫైనల్‌గా గోంధాల్ సినిమాను ఆస్కార్ బరిలో నిలిపేందుకు నిర్ణయం తీసుకుంది కమిటీ. దీంతో పెద్ది, ధురంధర్ సినిమాలు ఆస్కార్ పోటీని చేజార్చుకున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More