రాకింగ్ స్టార్ యష్ బాక్సాఫీస్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'కేజీఎఫ్ 2'తో తెలుగునాట అతడు సృష్టించిన ప్రభంజనం అలాంటిది. ఇప్పుడు అతని తదుపరి సినిమా 'టాక్సిక్' (Toxic) కోసం టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగాడు. అతనికి చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఏకంగా రూ.120 కోట్లకు అధికారికంగా సొంతం చేసుకుంది.
రికార్డు స్థాయి ధర..

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఒక నాన్-తెలుగు (డబ్బింగ్) సినిమాకు ఈ స్థాయిలో భారీ మొత్తం చెల్లించి హక్కులు తీసుకోవడం ఇదే తొలిసారి అని, ఇదొక రికార్డు అని తెలుస్తోంది. యష్ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని టాక్సిక్ మూవీ కోసం దిల్ రాజు ఈ సాహసం చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించాడు. తన ఎక్స్ అకౌంట్ లో ట్వీట్ చేశాడు.
టాక్సిక్ రిలీజ్ డేట్. ఫెస్టివల్ ధమాకా
'టాక్సిక్' సినిమాను మార్చి 19న (గురువారం) ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు. ఈ తేదీని చాలా పక్కాగా ప్లాన్ చేశారు. ఉగాది, గుడి పడ్వా, రంజాన్ పండగలు కలిసి వచ్చేలా ఆ వీకెండ్ ఉండటంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురవడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక ఈ సినిమా విశేషాల విషయానికి వస్తే గీతూ మోహన్‌దాస్ డైరెక్ట్ చేసింది. మూవీకి ఆమెతో కలిసి యష్ స్టోరీ అందించడం విశేషం. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాను ఇంగ్లీష్, కన్నడ భాషల్లో ఏకకాలంలో షూట్ చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళంతో పాటు పలు ఇతర భాషల్లోనూ డబ్ చేసి విడుదల చేయనున్నారు. డ్రగ్ మాఫియా నేపథ్యంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి.
{{/usCountry}}ఈ సినిమాను ఇంగ్లీష్, కన్నడ భాషల్లో ఏకకాలంలో షూట్ చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళంతో పాటు పలు ఇతర భాషల్లోనూ డబ్ చేసి విడుదల చేయనున్నారు. డ్రగ్ మాఫియా నేపథ్యంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి.
{{/usCountry}}ఆ మధ్య యష్ పోషించిన రాయ పాత్రను పరిచయం చేస్తూ తీసుకొచ్చిన టీజర్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. కారులో సెక్స్, మితిమీరిన వైలెన్స్ పై విమర్శలు వచ్చాయి. ఓ లేడీ డైరెక్టర్ ఇంత బోల్డ్ గా ఎలా తీసిందన్న ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో నెలకొంది.