Dil Raju: చాలా మంది భయపడతారు కానీ నేను ధైర్యంగా చెబుతున్నా.. చాలా బ్యాడ్ షేప్‌లో ఉన్నాం.. మీరే కాపాడాలి: దిల్ రాజు
Dil Raju: తెలుగు చిత్ర పరిశ్రమ ప్రస్తుత పరిస్థితిపై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీ ఇప్పుడు చాలా బ్యాడ్ షేప్‌లో ఉందంటూ ఆయన ఓపెన్‌గా మాట్లాడిన మాటలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
Dil Raju: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా దిల్ రాజుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సినిమా జయాపజయాలను, మార్కెట్ ట్రెండ్స్‌ను ఆయన ముందే అంచనా వేయగలరని ఇండస్ట్రీలో అందరూ నమ్ముతారు. అలాంటి సీనియర్ ప్రొడ్యూసర్ టాలీవుడ్ ప్రస్తుత పరిస్థితిపై అత్యంత కీలకమైన, ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సవాళ్లను ఆయన ఎలాంటి ముసుగు లేకుండా కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

నిజం ఒప్పుకోవాల్సిందే.. ఇండస్ట్రీ పరిస్థితి బాలేదు
టాలీవుడ్ లో వస్తున్న మరో చిన్న సినిమా సమ్మర్ హాలిడేస్ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీ పరిస్థితిపై ఆయన స్పందించిన తీరు ఆసక్తికరంగా మారింది.
"చాలా మంది భయపడతారు కానీ.. నిజం చెప్పాలంటే ఇండస్ట్రీ ఇప్పుడు చాలా బ్యాడ్ షేప్‌లో ఉంది. ఈ విషయాన్ని నేను చాలా ధైర్యంగా చెప్తున్నాను.." అని ఆయన వ్యాఖ్యానించారు. పెద్ద సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడం, ఓటీటీల ప్రభావం, థియేటర్లకు ప్రేక్షకులు వచ్చే సంఖ్య తగ్గడం వంటివన్నీ ఇండస్ట్రీని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
చిన్న సినిమాలే ఇండస్ట్రీకి ప్రాణాధారం
ఇదే సమయంలో పరిశ్రమ మనుగడకు, ఆరోగ్యకరమైన వాతావరణానికి ఏది అవసరమో కూడా దిల్ రాజు స్పష్టం చేశారు. కేవలం స్టార్ హీరోల చిత్రాల మీదే ఇండస్ట్రీ ఆధారపడి బతకలేదని ఆయన గుర్తుచేశారు.
"చిన్న సినిమాలు ఎంత సక్సెస్ అయితే.. ఇండస్ట్రీ అంత హెల్తీగా ఉంటుంది" అని ఆయన చెప్పుకొచ్చారు. కొత్త డైరెక్టర్లు చాలా మందే ఇండస్ట్రీలోకి వచ్చారంటూ సాయి రాజేష్ లాంటి వాళ్ల పేర్లను చెప్పారు. ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడం చాలా కష్టంగా మారిందని, ఆ పని చిన్న సినిమాలతో మీరు చేయాలని ఆయన కోరారు.
పెద్ద సినిమాల నిర్మాణ వ్యయం, వాటి బిజినెస్ రిస్క్‌తో కూడుకున్నవని, అదే చిన్న సినిమాలు తక్కువ బడ్జెట్‌తో వచ్చి మంచి విజయాలు సాధిస్తే పరిశ్రమకు కొత్త ఊపిరి వస్తుందని దిల్ రాజు అభిప్రాయపడ్డారు. చిన్న చిత్రాల వల్ల థియేటర్ల వ్యవస్థ బతుకుతుందని, ఎంతోమంది కొత్త టాలెంట్‌కు అవకాశాలు వస్తాయని ఆయన బలంగా నమ్ముతున్నారు.
ఈ సమ్మర్ సీజన్‌లో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాకపోవడం, చాలా సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతోనే దిల్ రాజు ఇంతటి ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఒక టాప్ ప్రొడ్యూసర్ అయి ఉండి ఇండస్ట్రీలోని లోపాలను, చేదు నిజాలను ఇంత ఓపెన్‌గా ఒప్పుకోవడం ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీసింది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిస్థితిపై దిల్ రాజు ఏమన్నారు?
సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం చాలా బ్యాడ్ షేప్‌లో ఉందంటూ దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నిజాన్ని తాను ఎంతో ధైర్యంగా చెబుతున్నానని ఆయన అన్నారు.
ఇండస్ట్రీ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం జరగాలని దిల్ రాజు చెప్పారు?
చిన్న సినిమాలు ఎంత ఎక్కువగా సక్సెస్ అయితే ఇండస్ట్రీ అంత ఆరోగ్యంగా, నిలకడగా ఉంటుందని దిల్ రాజు అభిప్రాయపడ్డారు.
దిల్ రాజు ఈ వ్యాఖ్యలు ఏ సందర్భంలో చేశారు?
సమ్మర్ హాలిడేస్ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చిన దిల్ రాజు.. తెలుగు సినిమా ఇండస్ట్రీపై ఘాటు కామెంట్స్ చేశారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


