...
...
Next Story

వాళ్లకు నా బ్యాంకు స్టేట్‌మెంట్ పంపిస్తా: టాక్సిక్ మూవీని నిజంగానే 120 కోట్లకు కొన్నారా అనే ప్రశ్నకు దిల్ రాజు సమాధానం

రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న టాక్సిక్ సినిమాను దిల్ రాజు ఏకంగా రూ.120 కోట్లకు కొన్నాడన్న వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ అని వస్తున్న విమర్శలపై తాజాగా అతడు స్పందించాడు.

Published on: Feb 12, 2026, 21:40:07 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

టాక్సిక్ మూవీపై పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు ఉన్నాయి. యశ్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఏకంగా రూ.120 కోట్లకు కొన్నాడని ఈ మధ్యే వార్తలు వచ్చాయి. ఇప్పుడు వాటిని అతడే ధృవీకరించడంతోపాటు అది నమ్మని వారికి తన బ్యాంకు స్టేట్‌మెంట్ పంపిస్తా అని కూడా అనడం విశేషం.

వాళ్లకు ఇదే నా సమాధానం

వాళ్లకు నా బ్యాంకు స్టేట్‌మెంట్ పంపిస్తా: టాక్సిక్ మూవీని నిజంగానే 120 కోట్లకు కొన్నారా అనే ప్రశ్నకు దిల్ రాజు సమాధానం
వాళ్లకు నా బ్యాంకు స్టేట్‌మెంట్ పంపిస్తా: టాక్సిక్ మూవీని నిజంగానే 120 కోట్లకు కొన్నారా అనే ప్రశ్నకు దిల్ రాజు సమాధానం

టాలీవుడ్ ప్రొడ్యూసర్ తాజాగా విక్రాంత్ లీడ్ రోల్లో నటించిన మార్కండేయ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ మిమ్మల్ని దిల్ రాజు అనాలా లేక డేర్ రాజు అనాలా అంటూ ప్రశ్న అడిగాడు. దీనికి అతడు స్పందిస్తూ.. మీ ఇష్టం.. ఎలా పిలిచినా ఓకే అని రాజు అన్నాడు.

ఆ తర్వాత టాక్సిక్ మూవీ తెలుగు రాష్ట్రాల హక్కులను దిల్ రాజు రూ.120 కోట్లకు కొన్నాడన్నది కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అని విమర్శలు వస్తున్నాయి కదా అని అడిగారు. దీనికి దిల్ రాజు స్పందిస్తూ.. “అలాంటి వాళ్లకు నేను బ్యాంకు నుంచి వాళ్లకు అమౌంట్ పంపిన తర్వాత వాళ్లకు స్టేట్‌మెంట్ చూపిస్తాను. అలా అయినా వాళ్లు నమ్ముతారేమో” అని అనడం విశేషం.

అల్లు అర్జున్ 42 రూల్స్ వివాదంపై..

ఇక సోషల్ మీడియాలో ఈమధ్య వైరల్ అయిన మరో వివాదం అల్లు అర్జున్ 42 రూల్స్. బన్నీని కలవాలంటే ఏకంగా 42 కండిషన్స్ కు ఓకే చెప్పాలంటూ కావేరి బారువా అనే ఓ బ్రాండ్ మేనేజర్ ఆరోపించడం.. దీనికి అల్లు అర్జున్ టీమ్ సీరియస్ గా స్పందిస్తూ లీగల్ చర్యలకు దిగడం తెలిసిందే.

మరోవైపు టాక్సిక్ మూవీ మార్చి 19న రిలీజ్ కానుంది. అయితే ఇప్పటి వరకూ వచ్చిన ఒక టీజర్ పైనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా క్రిస్టియన్ సంఘాలు కూడా టీజర్లో ఉన్న కొన్ని సీన్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీబీఎఫ్‌సీకి ఫిర్యాదు చేశారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks