Satluj Movie OTT: మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి.. రెండు రోజులకే స్ట్రీమింగ్ నుంచి అవుట్.. కాంట్రవర్సీ మూవీ సట్లజ్ కు షాక్
Satluj Movie ZEE5: ఎన్నో వివాదాలు, సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఓటీటీలోకి వచ్చిన ‘సట్లజ్’ మూవీకి బిగ్ షాక్. ఊహించని పరిణామాల మధ్య రిలీజైన రెండు రోజులకే ఈ సినిమాను ఇండియాలో ఓటీటీ ప్లాట్ ఫామ్ నుంచి తొలగించారు. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఓటీటీ నుంచి మూవీని ఎందుకు తీసేశారో ఇక్కడ తెలుసుకోండి.
Satluj Movie ZEE5: వర్సటైల్ యాక్టర్ దిల్జీత్ దోసాంజ్ నటించిన మోస్ట్ కాంట్రవర్షియల్ ఫిల్మ్ 'సట్లజ్' డిజిటల్ రిలీజ్ విషయంలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. జూలై 3న ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో సైలెంట్‌గా విడుదలైన ఈ చిత్రం, కేవలం రెండు రోజులు తిరక్కుండానే స్ట్రీమింగ్ నుంచి తప్పుకుంది. ఇండియాలో వీక్షకులకు ఈ సినిమా ఇకపై అందుబాటులో ఉండదని స్పష్టం చేస్తూ జీ5 సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

జీ5 ఏం చెప్పిందంటే?
సట్లజ్ సినిమాను ఓటీటీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించిన జీ5, ప్రేక్షకులు చూపించిన ఆదరణకు కృతజ్ఞతలు తెలిపింది.
"సట్లజ్ విడుదలైనప్పటి నుంచి వచ్చిన రెస్పాన్స్ నిజంగా అద్భుతం. ఈ సినిమాను సబ్‌స్క్రైబ్ చేసుకుని, ఆదరించిన ప్రతి ఒక్కరికీ మేము రుణపడి ఉంటాం. అయితే ప్రస్తుత పరిణామాల దృష్ట్యా, తదుపరి నోటీసు ఇచ్చే వరకు 'సట్లజ్' చిత్రం భారతదేశంలో అందుబాటులో ఉండదు.
చట్టపరమైన నిబంధనల ప్రకారం ఈ సినిమాను వీలైనంత త్వరగా మళ్లీ మన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి అవసరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాం. క్రియేటర్స్ నమ్మకానికి, వారి కళాత్మక స్వేచ్ఛకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది" అని జీ5 పేర్కొంది.
మూడేళ్ల నిరీక్షణ.. 127 కట్స్ వివాదం!
సట్లజ్ సినిమా ప్రయాణం మొదటి నుంచి తీవ్ర వివాదాలతోనే సాగింది. 2022లోనే 'పంజాబ్ 95' పేరుతో ఈ సినిమా సెన్సార్ బోర్డు (CBFC) సర్టిఫికేషన్ కోసం వెళ్ళింది. అయితే పంజాబ్‌లోని కొన్ని సున్నితమైన చారిత్రక అంశాల నేపథ్యంలో సాగే కథ కావడంతో సెన్సార్ బోర్డు దీనికి దాదాపు 3 సంవత్సరాల పాటు క్లియరెన్స్ ఇవ్వలేదు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఏకంగా 127 కట్స్ సూచించిందని గతంలో మేకర్స్ ఆరోపించారు.
చివరకు 2023లో ప్రసిద్ధ ‘టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్’ లో ఈ సినిమాను ప్రదర్శించాల్సి ఉండగా, భారత ప్రభుత్వం నుంచి వచ్చిన కొన్ని అభ్యంతరాల కారణంగా ఆ స్క్రీనింగ్ కూడా రద్దయింది. చివరకు పేరు మార్చుకుని 'సట్లజ్'గా ఓటీటీ రూట్ ఎంచుకున్నా, ఈ సినిమాను వివాదాలు మాత్రం వీడటం లేదు. హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ జస్వంత్ సింగ్ ఖల్రా నిజ జీవిత కథ ఆధారంగా మూవీ తెరకెక్కింది.
అసలు ఎందుకు తీసేశారు?
- చట్టపరమైన చిక్కులు: జీ5 అధికారికంగా కారణాలు వెల్లడించకపోయినప్పటికీ, సెన్సార్ బోర్డు నిబంధనల ఉల్లంఘన లేదా లీగల్ నోటీసుల వల్లే ఈ సినిమాను అత్యవసరంగా తొలగించినట్లు ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
- ఓటీటీలో అరుదైన ఘటన: ఒక పెద్ద సినిమా డిజిటల్ ప్రీమియర్ అయిన 48 గంటల్లోనే ఇలా ప్లాట్‌ఫామ్ నుంచి మాయమవడం ఓటీటీ చరిత్రలోనే అత్యంత అరుదైన విషయంగా ట్రేడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


