...
...
Next Story

Chiranjeevi 158: అన్నీ ఫ్లాప్‌లే.. ఇప్పుడు మెగాస్టార్ సినిమాలో విల‌న్‌గా హీరోయిన్‌.. చిరు మూవీతో బ్యూటీ ల‌క్ మారుతుందా?

Chiranjeevi 158: మెగాస్టార్ చిరంజీవి జోరు మీదున్నారు. ఈ ఏడాది మన శంకర వర ప్రసాద్ గారుతో బ్లాక్ బస్టర్ అందుకున్న చిరు.. ఇప్పుడు బాబీ కొల్లి డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నారు. ఇందులో ఓ హాట్ బ్యూటీ విలన్ క్యారెక్టర్ ప్లే చేయబోతుందనే బజ్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Published on: Apr 23, 2026, 08:21:25 IST
Advertisement

Chiranjeevi 158: మెగాస్టార్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. 2026 సంక్రాంతికి మన శంకర వర ప్రసాద్ గారు మూవీతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను చిరంజీవి అందుకున్నారు. ఈ మూవీ సక్సెస్ జోష్ తో ఇప్పుడు వరుసగా క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెట్టారు. ఇందులో ఒకటి బాబీ కొల్లి డైరెక్షన్ లో చేస్తున్నారు.

విలన్ గా డింపుల్ హయాతి

మెగాస్టార్ సినిమాలో విలన్ గా హీరోయిన్ (x/Chiranjeevi 158:)
మెగాస్టార్ సినిమాలో విలన్ గా హీరోయిన్ (x/Chiranjeevi 158:)

చిరంజీవి- బాబీ కొల్లి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో టాలీవుడ్ హాట్ బ్యూటీ డింపుల్ హయాతి విలన్ రోల్ చేయబోతుందనే క్రేజీ బజ్ వైరల్ గా మారింది. ఇన్ని రోజులూ గ్లామరస్ పాత్రలు చేసుకుంటూ వచ్చిన డింపుల్.. ఇప్పుడు నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లోకి షిఫ్ట్ అవుతుందనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

చిరుతో ఢీ

చిరంజీవి కొత్త సినిమాలో డింపుల్ హయాతి లేడీ విలన్ గా పవర్ ఫుల్ క్యారెక్టర్ చేయబోతుందనేది ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ లో హీరో చిరంజీవిని డింపుల్ ఢీ కొడుతుందని అంటున్నారు. ఈ మూవీలో డింపుల్ తన రోల్ తో కచ్చితంగా సర్ ప్రైజ్ చేస్తుందనే టాక్ వినిపిస్తోంది.

లక్ మారేనా?

తెలుగమ్మాయి డింపుల్ హయాతికి వరుసగా అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. 2017లో ‘గల్ఫ్’ మూవీతో డెబ్యూ చేసిన ఈ బ్యూటీకి ఇప్పటివరకూ ఒక్క సాలిడ్ హిట్ కూడా దక్కలేదు. ‘ఖిలాడీ’, ‘రామబాణం’, ‘భర్త మహాశయులకు విజ్ఞ‌ప్తి లాంటి మూవీస్ చేసినా లక్ కలిసి రాలేదు. మరి ఇప్పుడు చిరు మూవీతోనైనా ఆమె లక్ మారుతుందేమో చూడాలి.

బాబీ కొల్లి దర్శకత్వంతో మెగాస్టార్ చిరంజీవి మూవీ ఇప్పటికే పట్టాలెక్కింది. చిరు కెరీర్ లో ఇది 158వ సినిమా. ఏప్రిల్ 11నే లాంఛ్ అయిన ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. చిరంజీవి- బాబీ కొల్లి కాంబినేషన్లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సూపర్ హిట్ కావడంతో మరోసారి ఈ కాంబోపై హైప్ నెలకొంది. ఈ చిత్రంలో ప్రియమణి హీరోయిన్. దీనికి ‘కాకాజీ’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks