Anil Ravipudi Released Cocoons First Look: టాలీవుడ్‌లో సరికొత్త కథాంశాలతో వచ్చే చిన్న సినిమాలకు, కొత్త నటీనటులకు ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తుంది. పెద్ద దర్శకులు, స్టార్ మేకర్ల మద్దతు లభిస్తే ఆ చిత్రాలకు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడుతుంది.
కుకూన్స్‌లో నటించేది వీళ్లే

ఈ క్రమంలోనే జగన్ జోగిరాజ్, సాగర్ కిరణ్, వికాస్ చైతన్య, సంగన డుగ్గు, సురభి దీప్తి, దీప్తి పద్మ నిమ్మనగోటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొత్త చిత్రం 'కుకూన్స్' ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
కుకూన్స్ ఫస్ట లుక్ పోస్టర్ రిలీజ్
న్యూ వేవ్ పిక్చర్స్, ఎం.ఆర్ట్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సుఖేష్ పొట్ల, మమత రెడ్డి కాసం, మహేశ్ గౌరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా విడుదల చేశారు.
కనిపిస్తున్న కొత్తదనం.. అనిల్ రావిపూడి ప్రశంసలు
ఈ వేడుకలో పోస్టర్‌ను ఆవిష్కరించిన అనంతరం దర్శకుడు అనిల్ రావిపూడి చిత్రబృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. "కుకూన్స్ సినిమా పోస్టర్ చూడగానే చాలా కొత్తగా, ఆకట్టుకునేలా అనిపించింది. దర్శకుడు మహేశ్ గౌరి ఈ చిత్రం ద్వారా ఒక సరికొత్త ఆలోచనను, వైవిధ్యాన్ని ప్రేక్షకులకు అందించబోతున్నారని ఈ పోస్టర్ చూస్తేనే అర్థమవుతోంది. టైటిల్ ఎంపిక కూడా చాలా బాగుంది" అని అనిల్ రావిపూడి కొనియాడారు.
బుల్లితెర మెంటార్ నుంచి వెండితెర నటుడిగా..
కుకూన్స్ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్న వికాస్ చైతన్యను ఉద్దేశించి అనిల్ రావిపూడి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బుల్లితెరపై విశేష ప్రజాదరణ పొందిన 'డ్రామా జూనియర్స్' షోలో వికాస్ గతంలో మెంటార్‌గా వ్యవహరించి అలరించారు.
వెండితెరపై నటుడిగా ప్రయాణం
{{/usCountry}}కుకూన్స్ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్న వికాస్ చైతన్యను ఉద్దేశించి అనిల్ రావిపూడి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బుల్లితెరపై విశేష ప్రజాదరణ పొందిన 'డ్రామా జూనియర్స్' షోలో వికాస్ గతంలో మెంటార్‌గా వ్యవహరించి అలరించారు.
వెండితెరపై నటుడిగా ప్రయాణం
{{/usCountry}}"డ్రామా జూనియర్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వికాస్ ఇప్పుడు 'కుకూన్స్' చిత్రంతో వెండితెరపై నటుడిగా ప్రయాణం ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఇందులో నటిస్తున్న జగన్, సాగర్, వికాస్‌తో పాటు మొత్తం చిత్రబృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు" అని దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు.
సాంకేతిక బలంతో రూపుదిద్దుకుంటున్న ఎంటర్‌టైనర్
యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులందరూ కలసి హాయిగా ఆస్వాదించేలా వినోదాత్మక అంశాలతో దర్శకుడు మహేశ్ గౌరి కుకూన్స్ చిత్రాన్ని మలుస్తున్నారు. వినూత్నమైన కథనంతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు.
బీఎన్ ఆదిత్య సంగీతం
కుకూన్స్ చిత్రానికి బి.ఎన్.ఆదిత్య సంగీతం అందిస్తుండగా, నిఖిల్ శ్యామ్ కెమెరామెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆదిత్య తివారి ఎడిటింగ్, శ్రీశైలం ఆర్ట్ డైరెక్షన్ బాధ్యతలను వహిస్తున్నారు. జి.ఎస్.మీడియా ద్వారా గాండ్ల శ్రీనివాస్ పి.ఆర్.ఓగా వ్యవహరిస్తున్నారు.
టీవీ షో నుంచి వెండితెరపై నటుడిగా
ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటున్న కుకూన్స్ చిత్రం త్వరలోనే ప్రేక్షకులను అలరించడానికి థియేటర్లలోకి రానుంది. మరి టీవీ షోలో డ్రామా జూనియర్స్‌కి మెంటార్‌గా ఉన్న వికాస్ వెండితెరపై నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో వేచిచూడాలి.