Anil Ravipudi: హీరోహీరోయిన్లపై విలన్ గ్యాంగ్ ఫైరింగ్.. వేవేల‌ ఊహ‌లే చూపినా సాంగ్ రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి

Anil Ravipudi Released Vevela Oohale Chupina Song: అనిల్‌ రావిపూడి చేతుల మీదుగా క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్‌’ నుంచి సెకండ్ సాంగ్ ‘వేవేల‌ ఊహ‌లే చూపినా..’ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటను రెట్రో స్టైల్‌లో చిత్రీకరించడం, హీరో హీరోయిన్లపై విలన్ గ్యాంగ్ రివర్స్ ఫైరింగ్ చేసే నేపథ్యంతో తెరకెక్కించారు.

Published on: Sep 17, 2026, 15:32:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Anil Ravipudi Released Vevela Oohale Chupina Song: అన్ని వర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’. దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోనేపూడి నిర్మిస్తున్న ఈ మూవీకి గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు.

హీరోహీరోయిన్లపై విలన్ గ్యాంగ్ ఫైరింగ్.. వేవేల‌ ఊహ‌లే చూపినా సాంగ్ రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి
హీరోహీరోయిన్లపై విలన్ గ్యాంగ్ ఫైరింగ్.. వేవేల‌ ఊహ‌లే చూపినా సాంగ్ రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి

అక్టోబర్ 9న బా బా బ్లాక్ షీప్

అక్టోబ‌ర్ 9న బా బా బ్లాక్ షీప్ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో టిను ఆనంద్, ఉపేంద్ర లిమాయే, జార్జ్ మరియన్, అక్షయ్ , విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళ్వీ మల్హోత్రా, క‌శ్య‌ప్‌, రాజారవీంద్ర‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

మేఘాల‌య రాష్ట్రంలో పూర్తిగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకున్న తొలి ద‌క్షిణాది సినిమా ఇదే కావ‌టం విశేషం. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ బా బా బ్లాక్ షీప్ సినిమా టీజ‌ర్, రీసెంట్‌గా రిలీజైన ‘ఆజా మేరీ జాని’ సాంగ్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది.

డైరెక్టర్ అనిల్ రావిపూడితో సాంగ్ రిలీజ్

ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ బా బా బ్లాక్ షీప్ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ‘వేవేల‌ ఊహ‌లే చూపినా..’ను రిలీజ్ చేశారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి ఈ పాట‌ను విడుద‌ల చేసి చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు.

‘వేవేల‌ ఊహ‌లే చూపినా..’ సాంగ్ నేప‌థ్యం విష‌యానికి వ‌స్తే.. త‌మ‌కు కావాల్సిన ఓ అరుదైన బాక్స్ కోసం విల‌న్ గ్యాంగ్ వెతుకుతుంటుంది. అది హీరో, హీరోయిన్ ద‌గ్గ‌ర ఉంద‌ని వారు భావిస్తుంటారు. అదే స‌మ‌యంలో వాళ్లు విల‌న్స్ కంట‌ప‌డ‌తారు.

హీరోహీరోయిన్లపై విలన్ గ్యాంగ్ రివర్స్ ఫైరింగ్

మ‌రోవైపు హీరో చేతిలో గ‌న్ ఉంటుంది. అది ఊహించ‌ని రీతిలో పేలుతుంది. దీంతో హీరోహీరోయిన్‌ల‌పై విలన్ గ్యాంగ్ రివ‌ర్స్ ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు. ఈ నేప‌థ్యంలో రేట్రో స్టైల్లో ‘వే వేల‌ ఊహ‌లే చూపినా..’ సాంగ్ ప్లే అవుతుంటుంది. ఈ సాంగ్‌ను కిట్టు విస్సాప్ర‌గ‌డ రాయ‌గా.. శ్రీ సాగ‌ర్ పాడారు. పాట‌ను మ‌ళ్లీ మ‌ళ్లీ వినాల‌నిపించేలా డిఫ‌రెంట్ బ్యాక్ డ్రాప్‌, మ్యూజిక్‌తో ఆసాంతం ఆక‌ట్టుకుంటోంది.

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత వేణు దోనేపూడి మాట్లాడుతూ.. "ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజైన మా బా బా బ్లాక్ షీప్ మూవీ టీజ‌ర్‌, అజా మేరీ జాని సాంగ్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు ‘వే వేల‌ ఊహ‌లే చూపినా..’ అనే సాంగ్‌ను మీ ముందుకు తీసుకొస్తున్నాం. డిఫ‌రెంట్ స్టైల్లో సాగే పాట ఇది" అని అన్నారు.

చిరపుంజి వంటి అద్భుతమైన లొకేషన్స్‌లో షూటింగ్

"ఈ సాంగ్‌ను రిలీజ్ చేసిన మా అనిల్ రావిపూడి గారికి థాంక్స్‌. మా సినిమాను అక్టోబ‌ర్ 9న రిలీజ్ చేస్తున్నాం. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ ఫైన‌ల్ స్టేజ్‌లో ఉన్నాయి. మేఘాల‌యలోనే పూర్తి సినిమాను కంప్లీట్ చేశాం. అక్క‌డే మొత్తం సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకున్న తొలి సౌత్ మూవీ ఇదే" అని ప్రొడ్యూసర్ వేణు దోనేపూడి తెలిపారు.

"ముఖ్యంగా చిరపుంజి వంటి అద్భుత‌మైన లొకేష‌న్స్‌లోనూ చిత్రీక‌రించాం. ప‌క్కా ప్లానింగ్‌తో సినిమాను కంప్లీట్ చేశాం. మా డైరెక్ట‌ర్ గుణి, న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు స‌హా ఎంటైర్ టీమ్‌ స‌హకారంతో ఇది సాధ్య‌మైంది" అని చెప్పుకొచ్చారు నిర్మాత వేణు దోనేపూడి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More