Director Cheating: హీరోని చేస్తానని చెప్పి రూ.3.5 కోట్ల మోసం.. పిల్ల జమీందార్, భాగమతి సినిమాల డైరెక్టర్‌పై చీటింగ్ కేసు
Director Cheating: టాలీవుడ్ లో ఓ ప్రముఖ డైరెక్టర్ పై చీటింగ్ కేసు కలకలం రేపింది. పిల్ల జమీందార్, భాగమతి లాంటి సినిమాలు తీసిన డైరెక్టర్ ఓ యువకుడికి హీరో ఛాన్స్ పేరుతో మోసం చేశాడన్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.
Director Cheating: స్టార్ హీరోలతో హిట్స్ కొట్టిన ఓ టాలీవుడ్ బడా డైరెక్టర్ పై ఏకంగా రూ.3.5 కోట్ల చీటింగ్ కేసు నమోదు కావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 'పిల్ల జమీందార్', 'భాగమతి' లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్ జి. అశోక్ బాబు (G. Ashok Babu) ఇప్పుడు సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (EOW) పోలీసుల విచారణలో ఉన్నాడు. ఒక కుర్రాడిని హీరోగా లాంచ్ చేస్తానని చెప్పి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఈ డైరెక్టర్ పై ఆరోపణలు వస్తున్నాయి.

డైరెక్టర్ ట్రాక్ రికార్డ్ చూసి బుక్కయిన ఫ్యామిలీ
గతంలో నానితో చేసిన 'పిల్ల జమీందార్', అనుష్కతో తీసిన 'భాగమతి' సినిమాలు అశోక్ బాబుకు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఆ ట్రాక్ రికార్డ్ చూసే హనుమంతరావు అనే వ్యక్తి తన కొడుకుని హీరోగా పరిచయం చేయాలని ఈ డైరెక్టర్ ను అప్రోచ్ అయ్యాడు. దీన్ని ఆసరాగా చేసుకున్న అశోక్ బాబు.. వాళ్ల అబ్బాయిని లీడ్ రోల్ లో పెట్టి ఓ గ్రాండ్ ప్రాజెక్ట్ తీస్తానని నమ్మబలికాడు.
కొత్త హీరోకి సరైన బజ్ రావాలంటే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా ఉండాలని అశోక్ బాబు వాళ్లకు అందమైన కలలు చూపించాడు. సినిమా ప్రొడక్షన్ ఖర్చుల పేరుతో విడతల వారీగా ఏకంగా రూ.3.5 కోట్లు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇన్ని కోట్లు తీసుకున్న తర్వాత కూడా కనీసం సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేయకపోవడంతో ఆ ఫ్యామిలీకి డౌట్ వచ్చింది.
పదే పదే అడిగినా డైరెక్టర్ నుంచి సరైన రెస్పాన్స్ రాకపోవడం, తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో హనుమంతరావు ఫ్యామిలీ పోలీసులను ఆశ్రయించింది. టాలీవుడ్ లో కొత్త వాళ్లను ఎంకరేజ్ చేసే ముసుగులో ఇలాంటి మోసాలు జరగడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. రియల్ ఎస్టేట్, బిజినెస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న చాలామంది పేరెంట్స్ తమ పిల్లలను వెండితెర మీద చూసుకోవాలనే క్రేజ్ తో ఈజీగా ఇలాంటి బుట్టలో పడిపోతున్నారు.
సైబరాబాద్ పోలీసుల ఎంట్రీ..
హనుమంతరావు ఇచ్చిన ఫిర్యాదుతో సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు గత నెలలోనే డైరెక్టర్ పై అఫీషియల్ గా చీటింగ్ కేసు ఫైల్ చేశారు. శుక్రవారం (జులై 10) నాడు విచారణకు హాజరు కావాలని అశోక్ బాబుకు నోటీసులు పంపడంతో ఈ మోసం గురించి బయటకు తెలిసింది. విచారణలో భాగంగా ఈ ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగాయి.. ఆ రూ.3.5 కోట్లు ఎక్కడికి దారి మళ్లించారనే విషయాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
ప్రస్తుతం పోలీసుల విచారణ కొనసాగుతోంది. గత కొన్నేళ్లుగా అశోక్ బాబు నుంచి చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్స్ ఏమీ రాలేదు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉండటం వల్లే అతను ఈ ఈజీ మనీ రూట్ ఎంచుకున్నాడా అనే యాంగిల్ లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అవసరమైతే మరోసారి కూడా ఈ డైరెక్టర్ ను విచారణకు పిలిచే ఛాన్స్ ఉందని పోలీసులు స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


