...
...
Next Story

PEDDI: క్రికెట్‌, కుస్తీతో పాటు మ‌రో ఆట కూడా..పెద్ది కోసం బుచ్చిబాబు బ్లాక్‌బ‌స్ట‌ర్ ప్లాన్‌..రామ్ చ‌ర‌ణ్‌కు హిట్ ఖాయం!

PEDDI: క్రికెటర్ అనుకుంటే కుస్తీ యోధుడు కూడా అంటూ పెద్ది టీమ్ పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చేసింది. ఈ సినిమాలో రామ్ చరణ్ క్రికెటర్ గానే కాకుండా మల్ల యోధుడిగా కూడా నటిస్తున్నాడని గ్లింప్స్ తో చెప్పేసింది. ఇవే కాకుండా ఇందులో మరో ఆట కూడ ఉంటుందనే టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Published on: Mar 28, 2026, 09:33:10 IST
Advertisement

మోస్ట్ అవైటెడ్ ఇండియన్ సినిమాల్లో రామ్ చరణ్ ‘పెద్ది’ కూడా ఒకటి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన ‘పెద్ది పహిల్వాన్ గ్లింప్స్’తో పెద్ది సినిమాపై హైప్ మరింత పెరిగిపోయింది. అయితే క్రికెట్, కుస్తీ కాకుండా పెద్ది మూవీలో మరో ఆట కూడా ఉంటుందనే టాక్ వైరల్ గా మారింది.

క్రికెటర్ అని

పెద్దిలో రామ్ చరణ్ (x/Peddi)
పెద్దిలో రామ్ చరణ్ (x/Peddi)

పెద్ది సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి మొన్నటి వరకు కూడా ఈ మూవీలో రామ్ చరణ్ రూరల్ క్రికెటర్ గా కనిపిస్తాడనే అంతా అనుకున్నారు. మూవీ టీమ్ కూడా అదే చెప్తూ వచ్చింది. పెద్ది ఫస్ట్ గ్లింప్స్, చికిరి, రై రై రారా సాంగ్స్ లోనూ క్రికెట్ బ్యాట్ తోనే రామ్ చరణ్ సందడి చేశాడు. ఐకానిక్ స్టెప్పులతో క్రికెట్ షాట్లు కొట్టాడు.

పెద్ది గ్లింప్స్ తో

అయితే రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న పెద్ది టీమ్ పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చింది. మల్లయోధుడిగా రామ్ చరణ్ ను పరిచయం చేస్తూ ‘పెద్ది పహిల్వాన్ గ్లింప్స్’ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో కుస్తీ పోటీల కోసం రామ్ చరణ్ శిక్షణ తీసుకుంటున్న విజువల్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇక కండలు తిరిగిన అతని దేహం సినిమా కోసం రామ్ చరణ్ పడ్డ కష్టాన్ని చాటుతోంది.

మరో ఆట కూడా

పెద్ది సినిమాలో రామ్ చరణ్ క్రికెట్ మాత్రమే కాకుండా కుస్తీలోనూ తలపడతాడని క్లారిటీ వచ్చేసింది. అయితే క్రికెట్, కుస్తీ కాకుండా ఈ సినిమాలో రామ్ చరణ్ మరో ఆట కూడా ఆటతాడనే లేటెస్ట్ బజ్ వైరల్ గా మారింది. అదే ఈ సినిమాలో అసలు ట్విస్ట్ అనే టాక్ వినిపిస్తోంది.

బుచ్చిబాబు ప్లాన్

స్పోర్ట్స్ డ్రామా మూవీస్ కు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. ఇక రామ్ చరణ్ రా అండ్ రస్టిక్ గెటప్ లో అదరగొట్టాడు. అంతే కాకుండా క్రికెట్ కు కుస్తీ కూడా యాడ్ చేశారు. మరో ఆట కూడా ఉందని అంటున్నారు. ఇవన్నీ కలిపి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కోసం బుచ్చిబాబు ప్లాన్ చేశాడని అంటున్నారు.

మరోవైపు గేమ్ ఛేంజర్ ఫ్లాప్ తో ఉన్న రామ్ చరణ్ కు పెద్ది సినిమాతో సక్సెస్ దక్కుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ మూవీ కోసం చరణ్ ఎంతో కష్టపడ్డాడు. తన బాడీని మార్చుకున్నాడు. దీంతో పెద్దితో చెర్రీకి హిట్ ఖాయమనే కామెంట్లు వస్తున్నాయి.

ఆయన స్ఫూర్తితోనేనా?

పెద్ది సినిమాలో మల్లయోధుడిగా రామ్ చరణ్ క్యారెక్టర్ కు ‘కోడి రామ్మూర్తి నాయుడు’ స్ఫూర్తి అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఛాతిపై ఏనుగును నిలబెట్టుకున్న గొప్ప మల్లయోధుడు కోడి రామ్మూర్తి నాయుడు. ఆయన స్ఫూర్తితోనే కుస్తీ వీరుడిగా చరణ్ క్యారెక్టర్ ను డిజైన్ చేశారనే కామెంట్లు వస్తున్నాయి. పెద్ది మూవీ ఏప్రిల్ 30, 2026న రిలీజ్ కానుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks