పెద్ది కోసం డైరెక్టర్ పడుతున్న కష్టం చూశారా? బుచ్చిబాబు బర్త్ డే స్పెషల్.. బీటీఎస్ వీడియో వైరల్
రామ్ చరణ్ హీరోగా తెరకెక్కకుతున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా మూవీ పెద్ది. దీనికి బుచ్చిబాబు సాన డైరెక్టర్. ఇవాళ బుచ్చిబాబు బర్త్ డే . ఈ సందర్భంగా పెద్ది టీమ్ బుచ్చిబాబు బిహైండ్ ది సీన్ (బీటీఎస్) వీడియోను రిలీజ్ చేసింది. సినిమా కోసం డైరెక్టర్ పడుతున్న కష్టం ఇందులో కనిపించింది.
సినీ లవర్స్, మెగా ఫ్యాన్స్ అత్యంత ఆత్రుతగా ఎదురు చూస్తున్న తెలుగు సినిమా పెద్ది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ రోజు పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు సాన బర్త్ డే సందర్భంగా మూవీ టీమ్ ఓ సర్ ప్రైజ్ ఇచ్చింది. పెద్ది షూటింగ్ లో బుచ్చిబాబు ఎలా కష్టపడుతున్నారో చూపించే బీటీఎస్ వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియో వైరల్ గా మారింది.

పెద్ది డైరెక్టర్ వీడియో
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాకు బుచ్చిబాబు సాన డైరెక్టర్. సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు సాన.. ఉప్పెన సినిమాతో డెబ్యూ చేశాడు. ఇప్పుడు తన సెకండ్ మూవీనే రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ తో తెరకెక్కిస్తున్నాడు. ఇవాళ (ఫిబ్రవరి 15) బుచ్చిబాబు బర్త్ డే. ఈ సందర్భంగా పెద్ది బీటీఎస్ వీడియో రిలీజ్ చేశారు. మూవీ సెట్స్ లో, షూటింగ్ లో బుచ్చిబాబు ఎలా కష్టపడుతున్నాడో ఇందులో కనిపించింది.
వీడియో వైరల్
పెద్ది మూవీ నుంచి బుచ్చిబాబు సాన బీటీఎస్ వీడియో తెగ వైరల్ గా మారింది. ఇందులో ఆర్టిస్ట్ లకు సీన్లు ఎక్స్ ప్లెయిన్ చేస్తూ, రామ్ చరణ్ కు సూచనలు ఇస్తూ బుచ్చిబాబు కనిపించాడు. అలాగే పెద్ది గ్లింప్స్ లో వైరల్ మారిన రామ్ చరణ్ క్రికెట్ షాట్ ను బుచ్చిబాబు కొట్టి చూపించడం వీడియోలో హైలైట్ గా నిలిచింది. ఇక ఎక్స్ పార్టీ వోడికి దూల తీర్చి, ధూపం వేసే రోజు రావాలంటే తగలెట్టాల్సిందేనంటూ వీడియో ఆఖర్లో బుచ్చిబాబు డైలాగ్ చెప్పడం అదిరిపోయింది.
రామ్ చరణ్ విషెస్
తన పెద్ది మూవీ డైరెక్టర్ బుచ్చిబాబుకు హీరో రామ్ చరణ్ స్పెషల్ బర్త్ డే విషెస్ తెలిపాడు. షూటింగ్ లో డైరెక్టర్ తో తీసుకున్న స్టిల్ ను సోషల్ మీడియాలో రామ్ చరణ్ పోస్టు చేశాడు.
‘‘మా పెద్ది కెప్టెన్ బుచ్చిబాబు సానకు హ్యాపీ బర్త్ డే. సెట్స్ లో మీ తపన, ప్రతి చిన్న విషయాన్ని డీటెయిల్ గా చెప్పే మీ స్టోరీ టెల్లింగ్ నాకు ప్రతి రోజు స్ఫూర్తి కలిగిస్తోంది. మనం కలిసి ఇంకా మరెన్నో మ్యాజికల్ స్టోరీలను క్రియేట్ చేద్దాం. ఈ ఏడాది మీ హార్డ్ వర్క్ కు నిజమైన గుర్తింపు దక్కుతుందని ఆశిస్తున్నా’’ అని రామ్ చరణ్ పోస్టులో పేర్కొన్నాడు.
పెద్ది గురించి
రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న పెద్ది మూవీ ఏప్రిల్ 30, 2026న రిలీజ్ కానుంది. దీనికి బుచ్చిబాబు సాన డైరెక్టర్. ఇందులో శివరాజ్ కుమార్, జగపతి బాబు తదితరులు కూడా నటిస్తున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


