Peddi: థియేటర్లో పెద్దిగా రామ్ చరణ్ విధ్వంసానికి ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే రెండు సార్లు విడుదల వాయిదా పడ్డ ఈ మూవీ తాజా రిలీజ్ డేట్ పై బిగ్ అప్ డేట్ వచ్చేసింది. పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు సాన ఈ కొత్త డేట్ ను ప్రకటించారు. ధనుష్ సినిమా ‘కర’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బుచ్చిబాబు ఈ ప్రకటన చేశాడు.
పెద్ది రిలీజ్ డేట్

రామ్ చరణ్ హీరోగా వస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఈ మూవీ కొత్త విడుదల తేదీని బుచ్చిబాబు సాన ప్రకటించాడు. ‘కర’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అటెండ్ అయిన డైరెక్టర్ బుచ్చిబాబు సాన.. యాంకర్ సుమ అడగ్గానే పెద్ది రిలీజ్ డేట్ చెప్పేశాడు. జూన్ 25న ఈ సినిమా థియేటర్లకు వస్తుందన్నాడు.
పెద్ది షూటింగ్ నుంచే
‘కర’ సినిమా ఈవెంట్ కు అటెండ్ అయిన బుచ్చిబాబు మాట్లాడుతూ పెద్ది షూటింగ్ అప్ డేట్ పంచుకున్నాడు. ‘‘పెద్ది షూటింగ్ నుంచే వచ్చా. ఐటెం సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ధనుష్ కు నేను పెద్ద ఫ్యాన్. మిమ్మల్ని చూడటానికి వచ్చా. ఉప్పెన టైమ్ లో వైష్ణవ్, నేను మీ సినిమాలు చూసేవాళ్లం. ‘రాంఝానా’, ‘ఆడు కాలం’ సినిమాలంటే చాలా ఇష్టం. మీ కోసం పరుగెత్తుకుని వచ్చా సార్. మీ డెడికేషన్ గురించి రెహమాన్ సార్ చాలా సార్లు చెప్పారు’’ అని బుచ్చిబాబు పేర్కొన్నాడు.
ఎప్పుడంటే?
కర తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన బుచ్చిబాబు పెద్ది మూవీ జూన్ లో వస్తుందని అనడంతో అందరూ కేకలు పెట్టారు. డేట్ కూడా చెప్పండని సుమ అడగ్గానే.. జూన్ 25 అని బుచ్చిబాబు రివీల్ చేశాడు. ముందు నుంచి వస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ పెద్ది జూన్ 25న రావడం ఖాయమైందని బుచ్చిబాబు ప్రకటనతో స్పష్టమైంది.
{{/usCountry}}కర తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన బుచ్చిబాబు పెద్ది మూవీ జూన్ లో వస్తుందని అనడంతో అందరూ కేకలు పెట్టారు. డేట్ కూడా చెప్పండని సుమ అడగ్గానే.. జూన్ 25 అని బుచ్చిబాబు రివీల్ చేశాడు. ముందు నుంచి వస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ పెద్ది జూన్ 25న రావడం ఖాయమైందని బుచ్చిబాబు ప్రకటనతో స్పష్టమైంది.
{{/usCountry}}ఐటెం సాంగ్
పెద్ది సినిమా షూటింగ్ ఎండింగ్ కు చేరుకుంది. ఇప్పుడు ఐటెం సాంగ్ షూట్ చేస్తున్నారు. దీంతో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఈ స్పెషల్ సాంగ్ లో రామ్ చరణ్ తో శ్రుతి హాసన్ ఆడిపాడుతుందని తెలిసింది. ఈ పాట సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.
రెండు సార్లు
పెద్ది మూవీ రిలీజ్ రెండు సార్లు వాయిదా పడింది. మార్చి 27న విడుదల కావాల్సిన ఈ సినిమాను ఏప్రిల్ 30కు పోస్ట్ పోన్ చేశారు. ఆ తర్వాత జూన్ కు మార్చారు. ఇప్పుడు జూన్ 25న పెద్ది రాబోతుందని బుచ్చిబాబు చెప్పేశాడు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్.