Buchibabu Vijay Deverakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఆయన నటించిన 'రణబాలి' (Ranabaali) ప్రీ రిలీజ్ ఈవెంట్లో ‘పెద్ది’ డైరెక్టర్ బుచ్చిబాబు సాన (Buchi Babu Sana) విజయ్ స్టార్ ఇమేజ్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రేంజ్ క్రేజ్ ఉందంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
క్లాస్రూమ్ డోర్లు లాక్ చేశారు

మంగళవారం (అక్టోబర్ 13) రాత్రి హైదరాబాద్ లో జరిగిన రణబాలి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బుచ్చిబాబు సాన ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. "గీత గోవిందం సినిమాకు పనిచేసిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్, నా ఉప్పెన సినిమాకు కూడా పనిచేశాడు. ఆయన నాకు ఒక క్రేజీ ఇన్సిడెంట్ చెప్పాడు.
హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ కాలేజీలో గీతా గోవిందం షూటింగ్ జరుగుతున్న సమయంలో.. అక్కడ ఉన్న అమ్మాయిలు విజయ్ దేవరకొండను చూసి పిచ్చెక్కిపోయారట. విజయ్ క్రేజ్ తట్టుకోలేక కాలేజ్ మేనేజ్మెంట్ ఏకంగా క్లాస్రూమ్ డోర్లకు తాళాలు వేయాల్సి వచ్చింది. అది అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయిన టైమ్" అని బుచ్చిబాబు గుర్తుచేసుకున్నారు.
పవన్ కళ్యాణ్ రేంజ్ స్టార్ ఇమేజ్
విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా ఎప్పుడూ స్టార్‌గానే ఉంటాడని బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. "హిట్లు, ప్లాపులతో సంబంధం లేదు.. స్టార్ ఎప్పుడూ స్టారే. విజయ్ దేవరకొండ ఒక పవర్ ఫుల్ స్టార్. ఆయనకు మన పవన్ కళ్యాణ్ గారి రేంజ్ స్టార్ ఇమేజ్ ఉంది" అని బుచ్చిబాబు సాన పేర్కొన్నారు.
వైరల్ కామెంట్లు
విజయ్ దేవరకొండను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పోల్చుతూ బుచ్చిబాబు సాన చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. ఆయన స్టేజ్ మీద ఈ మాటలు అనగానే.. ఒక్కసారిగా ఆడిటోరియం మొత్తం ఫ్యాన్స్ కేకలు, ఈలలతో థియేటర్‌ను తలపించింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రణబాలి గురించి
{{/usCountry}}విజయ్ దేవరకొండను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పోల్చుతూ బుచ్చిబాబు సాన చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. ఆయన స్టేజ్ మీద ఈ మాటలు అనగానే.. ఒక్కసారిగా ఆడిటోరియం మొత్తం ఫ్యాన్స్ కేకలు, ఈలలతో థియేటర్‌ను తలపించింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రణబాలి గురించి
{{/usCountry}}రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. ఈ మూవీ అక్టోబర్ 16న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ భార్య రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.