Keerthy Suresh Dorothy: తమిళ వర్సటైల్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన లేటెస్ట్ ఇండిపెండెంట్ ఫిల్మ్ 'డోరతీ' (Dorothy) ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో LGBTQ+ కమ్యూనిటీ, గే రిలేషన్‌షిప్‌ల అంశాలను స్పృశించడంతో నెటిజన్ల నుంచి విపరీతమైన హోమోఫోబిక్ ట్రోలింగ్ ఎదురవుతోంది.

ఈ ఆన్‌లైన్ హేట్‌పై డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఘాటుగా స్పందించారు. నెగెటివిటీ ప్రచారం చేస్తున్న వారిపై తనదైన శైలిలో కామెంట్స్ చేశారు.
సినిమా చూడకుండానే సంస్కృతి పేరుతో దాడి
డోరతీ సినిమా థియేటర్లలోకి రాకముందే కొందరు సోషల్ మీడియాలో హడావుడి స్టార్ట్ చేశారని కార్తీక్ సుబ్బరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. కథ ఏంటో కనీసం తెలుసుకోకుండానే కొందరు కల్చరల్ డిస్కషన్ అంటూ హంగామా చేశారని ఆయన మండిపడ్డారు.
మెయిన్‌స్ట్రీమ్ సినిమాలో ఇలాంటి బోల్డ్ కథలు చెప్పడాన్ని సమాజంలోని కొంతమంది అసలు జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. తమ ఆధిపత్యానికి ఎక్కడ గండి పడుతుందో అనే భయంతోనే ఇలాంటి ద్వేషాన్ని ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు.
చెన్నై నుంచి మధురై వరకు.. థియేటర్లలో విజిల్స్
ఆన్‌లైన్‌లో జరుగుతున్న నెగెటివ్ ప్రచారాన్ని పక్కన పెడితే, థియేటర్లలో ఒరిజినల్ ఆడియన్స్ రెస్పాన్స్ అద్భుతంగా ఉందని కార్తీక్ తెలిపారు. సినిమా రిలీజ్ అయ్యాక తమిళనాడు వ్యాప్తంగా చెన్నై నుంచి మధురై వరకు దాదాపు 15 నుంచి 20 థియేటర్లు పర్సనల్‌గా విజిట్ చేసినట్లు చెప్పారు.
ప్రేక్షకులు సినిమాలో ఉన్న నిజమైన ఎమోషన్‌ను పర్ఫెక్ట్‌గా కనెక్ట్ చేసుకుంటున్నారని ఆయన వివరించారు. ప్రతి థియేటర్‌లోనూ సినిమా క్లైమాక్స్ పూర్తి కాగానే ఆడియన్స్ లేచి నిలబడి చప్పట్లు కొడుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు.
కీర్తి సురేష్ బోల్డ్ అటెంప్ట్.. రా అండ్ రస్టిక్ డ్రామా
'పిజ్జా', 'జిగర్తాండా', 'పేట్టా', 'జిగర్తాండా డబుల్ ఎక్స్' లాంటి విభిన్నమైన బ్లాక్బస్టర్లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ సుబ్బరాజ్.. ఈసారి 'డోరతీ' రూపంలో అత్యంత ప్రాణమున్న కథను అందించారు. గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ ఎమోషనల్ డ్రామాకు ఇసైజ్ఞాని ఇళయరాజా అందించిన సంగీతం ప్రాణం పోసింది.
{{/usCountry}}'పిజ్జా', 'జిగర్తాండా', 'పేట్టా', 'జిగర్తాండా డబుల్ ఎక్స్' లాంటి విభిన్నమైన బ్లాక్బస్టర్లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ సుబ్బరాజ్.. ఈసారి 'డోరతీ' రూపంలో అత్యంత ప్రాణమున్న కథను అందించారు. గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ ఎమోషనల్ డ్రామాకు ఇసైజ్ఞాని ఇళయరాజా అందించిన సంగీతం ప్రాణం పోసింది.
{{/usCountry}}'మహానటి', 'దసరా' లాంటి సినిమాలతో మెప్పించిన కీర్తి సురేష్.. ఈ సినిమాలో తన రెగ్యులర్ కంఫర్ట్ జోన్ దాటి అత్యంత సాహసోపేతమైన పాత్రలో కనిపిస్తున్నారు. సనంత్, రిషికాంత్ కూడా కీలక పాత్రల్లో నటనతో ఆకట్టుకున్నారు.
ఆడియన్స్ సపోర్టే నా అసలైన బలం
ఈ రోజుల్లో సోషల్ మీడియాలో నెగెటివిటీ స్ప్రెడ్ చేయడం చాలా ఈజీ అయిపోయిందని, కానీ థియేటర్‌కి వచ్చి సినిమా చూసే అసలైన ప్రేక్షకులు కంటెంట్‌ను ఆదరిస్తున్నారని కార్తీక్ సుబ్బరాజ్ అన్నారు.
సమాజంలో ఉన్న మూస ఆలోచనలను మార్చడానికి సినిమా ఒక గొప్ప సాధనమని, ఎన్ని వివాదాలు ఎదురైనా ఇలాంటి మంచి కథలు చెప్పడం ఆపేది లేదని ఈ స్టార్ డైరెక్టర్ తేల్చి చెప్పారు.