...
...
Next Story

Maruthi: నా నెక్ట్స్ స్క్రిప్ట్ రెడీ.. ప్రతి జర్నీ ఓ పాఠమే: ది రాజా సాబ్ బోల్తా పడిన తర్వాత మారుతి తొలి పోస్ట్ వైరల్

Maruthi: ది రాజా సాబ్ మూవీ బోల్తా పడిన తర్వాత డైరెక్టర్ మారుతి తన తొలి పోస్ట్ చేశాడు. శ్రీరామ నవమి శుభాకాంక్షలు చెబుతూ.. తన నెక్ట్స్ స్క్రిప్ట్ దాదాపు సిద్ధంగా ఉందని అతడు చెప్పడం విశేషం. ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

Published on: Mar 27, 2026 02:51 PM IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

ప్రభాస్ భారీ ఆశలు పెట్టుకున్న 'ది రాజా సాబ్' సినిమా దారుణంగా బోల్తా పడింది. ఈ హారర్ కామెడీ సినిమా ఈ ఏడాదికి ఫస్ట్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ అవుతుందని అందరూ గట్టిగా నమ్మారు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం ఆ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ వచ్చినా కూడా, ఆ తర్వాత మౌత్ టాక్ బాగా నెగెటివ్‌గా రావడంతో బాక్సాఫీస్ దగ్గర దారుణంగా పడిపోయింది. ఈ సినిమా రిలీజైన రెండున్నర నెలల తర్వాత డైరెక్టర్ మారుతి ఫస్ట్ టైమ్ సోషల్ మీడియాలో స్పందించాడు. ఫ్యాన్స్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ తన నెక్స్ట్ సినిమాను మొదలుపెడుతున్నట్లు చెప్పాడు.

ఆడియన్స్‌కు థ్యాంక్స్ చెప్పిన మారుతి..

Maruthi: నా నెక్ట్స్ స్క్రిప్ట్ రెడీ.. ప్రతి జర్నీ ఓ పాఠమే: ది రాజా సాబ్ బోల్తా పడిన తర్వాత మారుతి తొలి పోస్ట్ వైరల్
Maruthi: నా నెక్ట్స్ స్క్రిప్ట్ రెడీ.. ప్రతి జర్నీ ఓ పాఠమే: ది రాజా సాబ్ బోల్తా పడిన తర్వాత మారుతి తొలి పోస్ట్ వైరల్

శ్రీరామనవమి పండుగ సందర్భంగా మారుతి తన ఇంట్లో దేవుడి విగ్రహాల ముందు కూర్చున్న ఒక ఫోటోను షేర్ చేశాడు. ఆ దేవుడి పటాల ముందు తన నెక్స్ట్ సినిమా స్క్రిప్ట్ పెట్టి, దానిపై బంతి పూలు ఉంచి పూజ చేశాడు.

దానికి క్యాప్షన్‌గా.. "ప్రతి ప్రయాణం మనకు ఒక కొత్త పాఠం నేర్పుతుంది. ఈ పవిత్రమైన శ్రీరామనవమి రోజున, ఆ దేవుడి ఆశీస్సులతో నా నెక్స్ట్ స్క్రిప్ట్‌కు ఫైనల్ టచెస్ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది" అని రాసుకొచ్చాడు.

"నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ, నాకు ఎంతో విలువైన ఫీడ్‌బ్యాక్ ఇచ్చిన ఆడియన్స్, శ్రేయోభిలాషులు, మీడియా వాళ్లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తాను. మీ ప్రశంసలు, సపోర్ట్ సంపాదించుకోవడానికి నేను నా బెస్ట్ ఎఫర్ట్స్ పెడతాను. మళ్లీ నిజాయితీగా కష్టపడతాను" అని చాలా ఎమోషనల్‌గా పోస్ట్ చేశాడు. అయితే తన తర్వాతి సినిమాలో హీరో ఎవరు, కథ ఏంటి లాంటి డీటెయిల్స్ మాత్రం అతడు ఇంకా బయటపెట్టలేదు.

'ది రాజా సాబ్' అంచనాలు.. బాక్సాఫీస్ నష్టాలు..

విచిత్రం ఏంటంటే ఈ సినిమా కేవలం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. కానీ ఆ తర్వాత రోజుల్లోనే కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. టోటల్‌గా చూసుకుంటే ఎలాగోలా రూ.200 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. ఈ సినిమా వల్ల బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.160 నుంచి రూ.170 కోట్ల వరకు భారీ నష్టం వచ్చిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

జనవరి 9వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ ప్రభాస్ సరసన ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ మూవీ జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe