హీరోయిన్ 5 డిఫరెంట్ రోల్స్ చేసింది, ఇప్పటివరకు మీరు చూసింది 3 శాతం కూడా కాదు.. కిల్లర్ డైరెక్టర్ పూర్వజ్ కామెంట్స్
ఏ మాస్టర్ పీస్ డైరెక్టర్ పూర్వజ్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ కిల్లర్. గుప్పెడంత మనసు సీరియల్ నటి జ్యోతి పూర్వజ్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ నుంచి రీసెంట్‌గా ఫైర్ అండ్ ఐస్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో కిల్లర్ డైరెక్టర్ పూర్వజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.
టాలీవుడ్ సూపర్ హీరో మూవీ ఏ మాస్టర్ పీస్ డైరెక్టర్ దర్శకత్వం వహించిన మరో లేటెస్ట్ మూవీ కిల్లర్. గుప్పెడంత మనసు సీరియల్ నటి జ్యోతి పూర్వజ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను సైన్స్ ఫిక్షన్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌గా మలిచారు. పూర్వజ్ దర్శకత్వంతోపాటు నటించారు.

కిల్లర్ నటీనటులు
మనీష్ గిలాడ, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి నటించిన కిల్లర్ మూవీని థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ పతాకాలపై పూర్వజ్, పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మించారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా ఉన్నారు.
ఫైర్ అండ్ ఐస్ సాంగ్ లాంచ్
త్వరలో కిల్లర్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించనున్నారు. అయితే, ఇటీవల కిల్లర్ మూవీ నుంచి ఫైర్ అండ్ ఐస్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫైర్ అండ్ ఐస్ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో కిల్లర్ మూవీ డైరెక్టర్ పూర్వజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.
టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతుంది
కిల్లర్ డైరెక్టర్ పూర్వజ్ మాట్లాడుతూ.. "తెలుగు సినిమా కొత్త దారిలో వెళ్తోంది. ఇలాంటి టైమ్‌లో మేము చేసిన కిల్లర్ సినిమా మరో సరికొత్త ప్రయత్నంగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటుంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు అది ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతుంది" అని అభిప్రాయపడ్డారు.
ఐదు భిన్నమైన పాత్రల్లో
"ఈ చిత్రంలో హీరోయిన్ జ్యోతి పూర్వజ్ ఐదు డిఫరెంట్ రోల్స్‌లో నటించింది. స్పై, వాంపైర్, సూపర్ షీ, టెర్రరిస్ట్, రక్షా రై ఇలా ఐదు భిన్నమైన పాత్రల్లో ఆమె అద్భుతంగా నటించింది. వీటిలో కొన్ని క్యారెక్టర్ లుక్స్‌ను పరిచయం చేశాం. వాటికి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది" అని పూర్వజ్ తెలిపారు.
ఏఐ ఎలిమెంట్స్ చుట్టూ
"ఈ చిత్ర కథకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలిమెంట్స్ ముడిపడి ఉంటాయి. ఈ ఐదు పాత్రలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూ ముడిపడి ఉన్న ఆ ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ స్టోరీ ఏంటనేది స్క్రీన్ మీదే చూడాలి. మీరు ఇప్పుడు చూసిన గ్లింప్స్ అయినా, సాంగ్ అయినా మా రష్‌లో 3 పర్సెంట్ కూడా ఉండవు. మిగతా కంటెంట్ సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది" అని దర్శకుడు పూర్వజ్ చెప్పారు.
అప్పుడే కిల్లర్ ఆలోచన
"నేను మాస్టర్ పీస్ అనే సినిమా చేస్తున్న టైమ్‌లో కిల్లర్ మూవీ ఆలోచన వచ్చింది. ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్రొడ్యూసర్ పద్మనాభరెడ్డి, ఇతర టీమ్ అంతా చాలా సపోర్ట్ చేశారు" అని కిల్లర్ మూవీ డైరెక్టర్ పూర్వజ్ పేర్కొన్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


