అందాల రాక్షసి సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన హీరో రాహుల్ రవీంద్రన్ అనంతరం దర్శకుడిగా న. చిలసౌ అనే సినిమాతో డైరెక్టర్‌గా డెబ్యూ ఇచ్చిన రాహుల్ రవీంద్రన్ మంచి హిట్ అందుకున్నారు. అనంతరం నాగార్జునతో చేసిన మన్మథుడు 2 డిజాస్టర్‌గా నిలిచింది.
అల్లు అరవింద్ సమర్పణలో

ఇప్పుడు దర్శకుడిగా రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన కొత్త సినిమా ది గర్ల్‌ఫ్రెండ్. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, దీక్షిత్ శెట్టి మెయిన్ లీడ్ రోల్స్‌లో నటించారు. ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రాని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్నాయి.
రొమాంటిక్ ఇంటెన్స్ లవ్ స్టోరీ
రొమాంటిక్, ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీగా ది గర్ల్‌ఫ్రెండ్ తెరకెక్కింది. సరికొత్త ప్రేమ కథ అంటూ నవంబర్ 7న థియేటర్లలో ది గర్ల్‌ఫ్రెండ్ గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా అక్టోబర్ 25న ది గర్ల్‌ఫ్రెండ్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ది గర్ల్‌ఫ్రెండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.
13 ఏళ్లుగా
డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ.. "నేను స్టూడెంట్‌గా హాస్టల్లో ఉండే రోజుల్లో ఈ స్టోరీ ఐడియా వచ్చింది. 13 ఏళ్లుగా నా మైండ్ లో ఉంది ఇది. దాన్ని కొన్నేళ్ల క్రితం స్టోరీగా రాసుకున్నా. మీరు ఇప్పుడు ట్రైలర్‌లో ఏం చూశారో అదే సినిమా. ఇంటెన్స్ ఎమోషన్‌తో ఉంటుంది. రిలేషన్‌షిప్ ట్రై చేయాలనుకునే వారు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు" అని అన్నారు.
కథకు లైఫ్ ఇచ్చారు
"అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా చూసి ఆ ఎమోషన్‌తో బయటకు వస్తారు. మూవీ రియల్‌గా, రూటెడ్‌గా, ఇంటెన్స్‌గా, ఎమోషనల్‌గా ఉంటుంది. నా టీమ్ అందరూ ప్యాషనేట్‌గా వర్క్ చేశారు. హీరో దీక్షిత్, హీరోయిన్ రష్మిక మందన్నా తమ పర్ఫార్మెన్స్తో కథకు లైఫ్ ఇచ్చారు" అని రాహుల్ రవీంద్రన్ తెలిపారు.
ఏ దర్శకుడికైన అదృష్టం
{{/usCountry}}"అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా చూసి ఆ ఎమోషన్‌తో బయటకు వస్తారు. మూవీ రియల్‌గా, రూటెడ్‌గా, ఇంటెన్స్‌గా, ఎమోషనల్‌గా ఉంటుంది. నా టీమ్ అందరూ ప్యాషనేట్‌గా వర్క్ చేశారు. హీరో దీక్షిత్, హీరోయిన్ రష్మిక మందన్నా తమ పర్ఫార్మెన్స్తో కథకు లైఫ్ ఇచ్చారు" అని రాహుల్ రవీంద్రన్ తెలిపారు.
ఏ దర్శకుడికైన అదృష్టం
{{/usCountry}}"ఇలాంటి యాక్టర్స్ దొరకడం ఏ దర్శకుడికైనా అదృష్టమని చెప్పాలి. నేను మానిటర్ వెనకాల కూర్చుని వీళ్ల పర్‌ఫార్మెన్స్ చూస్తూ ఎంజాయ్ చేశాను. ఈ సినిమాకు నేనే ఫస్ట్ ఆడియెన్ కావడం హ్యాపీగా ఉంది. సినిమాలో నేనూ ఒక రోల్ చేశాను. ఇది రెగ్యులర్ ఫార్మాట్ లవ్ స్టోరీ కాదు. జెన్యూన్‌గా ఒక కథ చెప్పాలని మేమంతా ప్రయత్నించాం. ఇలాంటి మూవీస్‌కు మీ సపోర్ట్ కావాలి" అని రాహుల్ రవీంద్రన్ పేర్కొన్నారు.
ఎంతో ఇన్స్‌పైర్ చేసింది
ఇదే ఈవెంట్‌లో డీవోపీ కృష్ణన్ వసంత్ మాట్లాడుతూ.. "ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా టీమ్‌తో వర్క్ చేయడం ఎంతో ఇన్స్‌పైర్ చేసింది. ఒక ఇంటెన్స్, ప్యాషనేట్ కంటెంట్‌ను ఈ చిత్రంలో చూపించబోతున్నాం. మీరంతా మా మూవీని సపోర్ట్ చేస్తారని, మా సినిమా గురించి మిగతా వారికి చెబుతారని కోరుకుంటున్నా" అని తెలిపారు.