...
...
Next Story

తమిళ సినిమా చూసి తెలుగు హీరోయిన్‌ను సెలెక్ట్ చేశాం, ఒరిజినాలిటీ కొంత పోతుంది.. బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ కామెంట్స్

Director Sai Rajesh About Chennai Love Story Movie: బేబీ సినిమాతో దర్శకుడుగా మంచి పేరు తెచ్చుకున్న సాయి రాజేష్ నిర్మాతగా మారి రూపొందించిన లేటెస్ట్ మూవీ చెన్నై లవ్ స్టోరీ. కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో మూవీ, హీరోయిన్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సాయి రాజేష్.

Published on: Mar 31, 2026, 13:08:17 IST
Advertisement

హీరో కిరణ్ అబ్బవరం, తెలుగు అందం శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ చెన్నై లవ్ స్టోరీ. ఈ చిత్రాన్ని బేబీ డైరెక్టర్ సాయి రాజేష్, నిర్మాత ఎస్‌కేఎన్ నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ కథ అందించిన ఈ సినిమాకు రవి నంబూరి దర్శకత్వం వహించారు. తాజాగా జరిగిన గుర్తుందా సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు, నిర్మాత సాయి రాజేష్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

డబ్బుల వెనుక పరుగెత్తలేదు

తమిళ సినిమా చూసి తెలుగు హీరోయిన్‌ను సెలెక్ట్ చేశాం, ఒరిజినాలిటీ కొంత పోతుంది.. బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ కామెంట్స్
తమిళ సినిమా చూసి తెలుగు హీరోయిన్‌ను సెలెక్ట్ చేశాం, ఒరిజినాలిటీ కొంత పోతుంది.. బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ కామెంట్స్

దర్శక నిర్మాత సాయి రాజేశ్ మాట్లాడుతూ.. "బేబి మూవీ విజయం తర్వాత మేము డబ్బుల వెనక పరుగు పెట్టలేదు. ఒక మంచి కథతో మళ్లీ మూవీ చేయాలని అనుకున్నాం. నా మనసుకు నచ్చిన ఒక కథను రాసుకున్నాను" అని అన్నారు.

"కథ రచయిత దగ్గర నుంచి దర్శకుడి దగ్గరకు వెళ్లి స్క్రీన్ మీదకు వచ్చేసరికి అందులోని ఒరిజినాలిటీ ఎంతో కొంత పోతుంది. కానీ, ఈ సినిమాను నేను అనుకున్నదాని కంటే బాగా తెరకెక్కించాడు రవి నంబూరి" అని సాయి రాజేష్ తెలిపారు.

"నేను బేబి మూవీని ఎంతో ప్రేమించి ఐదు గంటలు తీశాను. 3 గంటలకు ఎలా కుదించాలి అని ఆలోచిస్తున్న టైమ్‌లో రవి వచ్చి హెల్ప్ చేశాడు. పోస్ట్ ప్రొడక్షన్‌లోనూ నాతో ఉన్నాడు. కృతజ్ఞతగా రవిని ఈ సినిమా చేయమని రిక్వెస్ట్ చేశా. ఇప్పుడు కూడా ఒక గొప్ప సినిమా చేసి నాకే మంచి చేశాడు రవి. అతను ఎంత ప్రతిభావంతమైన దర్శకుడో తర్వాత మీరంతా చూస్తారు" అని దర్శకుడు సాయి రాజేష్ పేర్కొన్నారు.

కన్నీళ్లు ఆపుకోలేకపోయాను

"అనంత శ్రీరామ్‌తో వర్క్ చేస్తే లిరిక్స్ గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆయన మీద పూర్తిగా ఆధారపడతా. బేబికి ఎంతో మంచి సాంగ్స్ రాశారు. ఆయన పాట రాస్తే ఒకట్రెండు పదాలు మాత్రమే మార్చిన సందర్భాలు ఉన్నాయి. ఒక వాక్యం కూడా పూర్తిగా ఛేంజ్ చేయలేదు. ధీరజ్ మంచి ఫ్రెండ్. ఆయన ఈ మూవీని మరింత గ్రాండ్‌గా మీ ముందుకు తీసుకురాబోతున్నారు" అని నిర్మాత సాయి రాజేష్ చెప్పుకొచ్చారు.

"నేను పూర్తిగా నమ్మి టెన్షన్ లేకుండా వర్క్ చేసుకుంటున్నా అంటే కారణం ఎస్‌కేఎన్. నా లైఫ్‌లో తీసుకున్న మంచి నిర్ణయాల్లో ముఖ్యమైంది ఎస్కేఎన్‌తో జర్నీ. ఈ కథను పూర్తిగా నమ్మి మాతో ట్రావెల్ అయ్యే హీరో కావాలి. క మూవీ తర్వాత కిరణ్ గారు ఒప్పుకున్న సినిమా ఇది. కథ చెప్పిన వెంటనే మీరు ఎలా చెబితే అలా ఈ మూవీ చేద్దామని సపోర్ట్ చేశారు. ఇప్పటిదాకా అలాగే మూవీకి వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా చేస్తున్న టైమ్‌లో ఆయనపై మరింత ఇష్టం పెరిగింది" అని సాయి రాజేష్ అన్నారు.

రెండో ట్యూన్ ఏరోజు అడగలేదు

"ఈ సినిమాలో కిరణ్ గారి పర్‌ఫార్మెన్స్ గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతాను. ఈ సినిమా ఆయనకు ఒక మెమొరబుల్ మూవీ అవుతుంది. మణిశర్మ గారి బీజీఎమ్ వినేందుకే రిపీటెడ్‌గా ఎన్నో సినిమాలు చూశాను. ఆయన ఈ సినిమాకు తనదైన శైలీలో సంగీతాన్ని అందించారు. రెండో ట్యూన్ ఏ రోజూ మేము అడగలేదు. ఫస్ట్ ట్యూన్‌నే అంత బాగా ఇచ్చేవారు. నేను ప్రొడ్యూసర్‌గా ఆయనతో మూవీ చేయడం కంటే ఇంకేం కోరుకోను" అని సాయి రాజేష్ తన స్పీచ్ ముగించారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks