Sundar C About Mahasakthi AI Shots: లేడి సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు సుందర్ సి తెరకెక్కించిన భక్తిరస ఫాంటసీ చిత్రం 'మూకుతి అమ్మన్ 2' (తెలుగులో 'అమ్మోరు తల్లి' సీక్వెల్ 'మహాశక్తి'). 2020లో విడుదలైన మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడంతో ఈ సీక్వెల్‌పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.
మహాశక్తి ట్రైలర్ విడుదలయ్యాక

అయితే, ఇటీవల విడుదలైన మహాశక్తి ట్రైలర్ చూసిన కొందరు నెటిజన్లు గ్రాఫిక్స్ నాణ్యతపై పెదవి విరిచారు. విజువల్ ఎఫెక్ట్స్ సరిగ్గా లేవని, బడ్జెట్ తగ్గించుకోవడానికి ఎక్కువ భాగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడేశారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
ఏఐ కామెంట్లపై సుందర్ సి వివరణ
తాజాగా ఈ వివాదంపై దర్శకుడు సుందర్ సి తీవ్రంగా స్పందించారు. చెన్నైలో ఘనంగా జరిగిన మూకుత్తి అమ్మన్ 2 ప్రీ-రిలీజ్ వేడుకలో సుందర్ సి విమర్శకులకు సవివరంగా సమాధానమిచ్చారు.
రాత్రింబవళ్లు కష్టపడిన టెక్నీషియన్లను తక్కువ చేయొద్దు
"నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడితే మనసుకి తీవ్రంగా బాధ అనిపిస్తుంది. దాదాపు 400 మంది సీజీఐ కళాకారులు రాత్రింబవళ్లు నిద్రాహారాలు మాని ఏడాదిన్నర పాటు ఈ సినిమా కోసం పనిచేశారు. వారందరి కష్టాన్ని ఏఐ పేరుతో కొట్టిపారేయడం సరైంది కాదు" అని సుందర్ సి ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో ఏఐ వినియోగం విస్తరించవచ్చని, కానీ ఈ చిత్రానికి మాత్రం మానవ శ్రమే ప్రధాన బలం అని తెలిపారు.
3,000 షాట్లలో కేవలం 15 మాత్రమే ఏఐ!
సినిమాలోని సాంకేతిక వివరాలను వెల్లడిస్తూ సుందర్ సి స్పష్టత ఇచ్చారు. "ఈ సినిమాలో దాదాపు 3,000 సీజీఐ (CGI) షాట్లు ఉన్నాయి. అందులో కేవలం 15 షాట్లకు మాత్రమే ఏఐ పరిజ్ఞానాన్ని ఉపయోగించాం. మిగిలిన ప్రతి ఫ్రేమ్‌ను మన తమిళనాడు సాంకేతిక నిపుణులే స్వయంగా తీర్చిదిద్దారు. విజువల్స్ బాగుంటే మెచ్చుకోండి, కానీ లేనిపోని ప్రచారాలు చేయకండి" అని విజ్ఞప్తి చేశారు.
అసలైన హీరోలు సాంకేతిక బృందమే
"ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా, రెజీనా ప్రతినాయకిగా కనిపించినప్పటికీ.. అసలైన కథానాయకులు మాత్రం వెనుక ఉండి పనిచేసిన సాంకేతిక బృందమే" అని డైరెక్టర్, ఖుష్బూ భర్త సుందర్ సి కొనియాడారు.
రెండు విభిన్న పాత్రల్లో నయనతార
{{/usCountry}}"ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా, రెజీనా ప్రతినాయకిగా కనిపించినప్పటికీ.. అసలైన కథానాయకులు మాత్రం వెనుక ఉండి పనిచేసిన సాంకేతిక బృందమే" అని డైరెక్టర్, ఖుష్బూ భర్త సుందర్ సి కొనియాడారు.
రెండు విభిన్న పాత్రల్లో నయనతార
{{/usCountry}}మహాశక్తి చిత్రంలో నయనతార దేవతగా, పోలీస్ ఆఫీసర్‌గా భిన్నమైన రూపాల్లో అలరించనున్నారు. రెజీనా కాసాండ్రాతో పాటు కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ పాత్రలు పోషించారు. సీనియర్ హీరోయిన్ ఊర్వశి, యోగి బాబు, అభినయ, గరుడ రామ్ (రామచంద్ర రాజు), మైనా నందిని కీలక పాత్రల్లో నటించారు.
నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల
ఈ భారీ చిత్రాన్ని నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. నవంబర్ 5నే కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో మూకుత్తి అమ్మన్ 2 మూవీ పెయిడ్ ప్రీమియర్లు ప్రదర్శిస్తున్నారు. ఇటీవల తమిళనాడు ఎన్నికల్లోనూ పోటీ చేసిన సుందర్ సి.. రాజకీయాలు, సినిమాలను బ్యాలెన్స్ చేస్తూనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.