Vijay Goat: గోట్ కల నిజమైంది- దళపతి విజయ్‌కు కారు నెంబర్ ప్లేట్ గిఫ్ట్ ఇచ్చిన డైరెక్టర్ వెంకట్ ప్రభు- ఎందుకో తెలుసా?
Venkat Prabhu Gifts TN O7 CM 2026 Number Plate To Thalapathy Vijay: తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దళపతి విజయ్‌ను గోట్ మూవీ దర్శకుడు వెంకట్ ప్రభు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ సినిమాలో విజయ్ వాడిన 'TN 07 CM 2026' నెంబర్ ప్లేట్‌ను ఫ్రేమ్ కట్టించి దళపతి విజయ్‌కు అపూర్వ కానుకగా అందించారు.
Venkat Prabhu Gifts TN O7 CM 2026 Number Plate To Thalapathy Vijay: సినిమా స్క్రిప్ట్‌ను మించిపోయేలా తమిళ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు దళపతి విజయ్. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన ఆయన ప్రస్థానం వెనుక ఎన్నో ఏళ్ల నిశ్శబ్ద కృషి ఉంది. సినిమాల్లో సామాజిక అన్యాయాలపై పోరాడే మాస్ హీరోగా కనిపించిన విజయ్, ఇప్పుడు నిజ జీవితంలోనూ ప్రజా నాయకుడిగా మారారు.

2024లో వచ్చిన 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (The GOAT) చిత్రంలో దళపతి విజయ్ సీఎం అవుతారనే విషయాన్ని దర్శకుడు వెంకట్ ప్రభు అప్పుడే ఊహించారు. తాజాగా ఈ దర్శకుడు సీఎం విజయ్‌ను కలిసి ఒక అద్భుతమైన గిఫ్ట్ అందించారు.
ఆ నెంబర్ ప్లేట్ నిజమైంది!
'గోట్' సినిమాలో విజయ్ క్యారెక్టర్ వాడిన ఒక వాహనానికి 'TN 07 CM 2026' అనే నంబర్ ప్లేట్ ఉంటుంది. సినిమా తీసేటప్పటికి ఇది కేవలం ఊహ మాత్రమే అయినా, ఇప్పుడు అది అక్షరాలా నిజమైంది. దాంతో ఆ నెంబర్ ప్లేట్‌ను ఒక ప్రత్యేకమైన ఫ్రేమ్‌గా మార్చి దళపతి విజయ్‌కు డైరెక్టర్ వెంకట్ ప్రభు గిఫ్ట్‌గా బహూకరించారు.
నలుపు, గోధుమ, రాగి రంగుల కలయికతో ఉన్న ఈ ఫ్రేమ్‌లో విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీ రంగులైన ఎరుపు, పసుపును బ్యాక్‌గ్రౌండ్‌గా వాడారు. దాని కింద విజయ్, వెంకట్ ప్రభు ఫిస్ట్ బంప్ (చేతులు కలిపిన) ఇచ్చుకున్న ఫోటో ఉంది. ఫ్రేమ్ కింది భాగంలో ఉన్న గోల్డ్ ప్లేట్ మీద "వీపీ అండ్ టీమ్ చేసిన మొదటి ప్రిడిక్షన్" అని రాసి ఉంది. ఈ కానుకను అందుకున్న ముఖ్యమంత్రి విజయ్ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.
ఇది కేవలం ఆరంభం మాత్రమే!
ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను వెంకట్ ప్రభు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. "ఒక ఆలోచన నుంచి.. ఒక విజన్ వైపు.. ఆపై ఈ క్షణం వరకు చరిత్ర సృష్టించారు. మన గౌరవనీయ సీఎం విజయ్ అన్నను కలిసి 'గోట్' సినిమా నాటి మొదటి కలను కానుకగా అందించడం సంతోషంగా ఉంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే" అని వెంకట్ ప్రభు ఎక్స్‌లో పేర్కొన్నారు.
2013లోనే ఊహించిన అసిస్టెంట్లు
విజయ్ సీఎం అవుతారని కేవలం వెంకట్ ప్రభు మాత్రమే కాదు, 13 ఏళ్ల క్రితమే ఆయన చుట్టూ ఉన్నవారు నమ్మారు. ఈ విషయాన్ని ప్రముఖ బెంగాలీ నటుడు తోటా రాయ్ చౌదరి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. 2013లో 'కత్తి' సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను ఆయన వివరించారు.
"షూటింగ్‌లో నేను ఒక మంచి షాట్ ఇచ్చిన తర్వాత విజయ్ సెక్రటరీ నన్ను ఆయన రూమ్‌కి పిలిచారు. విజయ్ ఎంతో మర్యాదగా నన్ను కూర్చోబెట్టి కాఫీ ఆఫర్ చేశారు. నా గురించి ఎంతో గౌరవంగా మాట్లాడారు. ఆయన రూమ్ నుంచి బయటకు రాగానే విజయ్ అసిస్టెంట్లు నన్ను చుట్టుముట్టారు. ఆయన మీతో కాఫీ తాగారా? అని ఆశ్చర్యపోయారు. ఎందుకు అంతలా చూస్తున్నారు అని నేను అడగ్గా.. ఆయనే మా రాష్ట్రానికి కాబోయే సీఎం అని వారు చెప్పారు. విజయ్ పార్టీ పెట్టినప్పుడు నాకు ఆ మాటలు గుర్తొచ్చాయి" అని తోటా రాయ్ చౌదరి తెలిపారు.
చివరి సినిమాపై ఉత్కంఠ
రాజకీయాల్లో పూర్తిస్థాయిలో బిజీ కావడానికి ముందు విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్'. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వాస్తవానికి జనవరిలోనే విడుదల కావాల్సింది. కానీ, సెన్సార్ బోర్డు (CBFC) నుంచి సర్టిఫికేషన్ ఆలస్యం కావడంతో వాయిదా పడింది.
ఏప్రిల్ నెలలో జన నాయగన్ సినిమా హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్ కాగా, దీనికి కారణమైన తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రం ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


