రజాకార్ మూవీ తెలుసు కదా. గతేడాది మార్చిలో రిలీజైన సినిమా ఇది. దీనిపై తాజాగా డైరెక్టర్ వేణు ఊడుగుల వివాదాస్పద కామెంట్స్ చేశాడు. ఈ మూవీని బీజేపీ తీసిందని, పూర్తిగా ఓ పొలిటికల్ ఎజెండాతో తీశారని విమర్శించాడు. గుల్టె ప్రొకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణు చేసిన కామెంట్స్ పై ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రజాకార్ చూడలేదంటూనే..

ఈ ఇంటర్వ్యూలో వేణు ఊడుగులను రజాకార్ మూవీ గురించి అడిగినప్పుడు తాను ఆ సినిమా చూడలేదంటూనే.. ఓ పొలిటికల్ ఎజెండాతో తీసిన మూవీ అని అనడం గమనార్హం.
“రజాకార్ అనే సినిమాను ఎవరు తీయించారు. బీజేపీ వాళ్లు తీసిన సినిమా. పూర్తిగా ఓ పొలిటికల్ ఎజెండాతో వచ్చింది. చరిత్ర మీద ప్రేమతోనో.. చరిత్ర మీద భాద్యతతో ఈ జనాలకు చెప్పాలనుకొని తీసిన సినిమా అది. ఓ ఫిల్మ్ మేకర్ గా ఆ డైరెక్టర్ ను, ప్రొడ్యూసర్ ను గౌరవిస్తా, అభినందిస్తా. కానీ వాళ్లు తీసిన కంటెంట్ మీద నాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి. వాస్తవానికి మూవీని తీయించింది బీజేపీయే. తెలంగాణ బీజేపీ వాళ్ల పట్ల నాకు ద్వేషమేమీ లేదు” అని వేణు ఊడుగుల అన్నాడు.
వేణు ఊడుగుల గురించి..
కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న డైరెక్టర్ వేణు ఊడుగుల విరాటపర్వం, నీది నాదీ ఒక కథ సినిమాలతో పాపులర్ అయ్యాడు. ఈ మధ్యే రాజు వెడ్స్ రాంబాయి సినిమాతో ప్రొడ్యూసర్ గా మారాడు. 2011లో వచ్చిన జైబోలో తెలంగాణ సినిమాకు మాటల రచయితగా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన అతడు.. తర్వాత డైరెక్టర్ గా రెండు సినిమాలు తీశాడు.
రజాకార్ మూవీ గురించి..
ఇక వేణు ఊడుగుల విమర్శించిన రజాకార్ మూవీ గతేడాది మార్చిలో రిలీజైంది. యాట సత్యనారాయణ డైరెక్ట్ చేశాడు. ఇందులో బాబీ సింహా, తేజ్ సప్రు, అనసూయ, మకరంద్ దేశ్పాండే లాంటి వాళ్లు నటించారు. రజాకార్ల నుంచి ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న హిందువులు ఎదుర్కొన్న అణచివేత, దారుణాల చుట్టూ తిరిగే సినిమా ఇది. ఈ మూవీకి బాక్సాఫీస్ దగ్గర పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఐఎండీబీలో 7.3 రేటింగ్ ఉంది. ప్రస్తుతం ఈ సినిమా ఆహా వీడియో ఓటీటీలో అందుబాటులో ఉంది.
{{/usCountry}}ఇక వేణు ఊడుగుల విమర్శించిన రజాకార్ మూవీ గతేడాది మార్చిలో రిలీజైంది. యాట సత్యనారాయణ డైరెక్ట్ చేశాడు. ఇందులో బాబీ సింహా, తేజ్ సప్రు, అనసూయ, మకరంద్ దేశ్పాండే లాంటి వాళ్లు నటించారు. రజాకార్ల నుంచి ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న హిందువులు ఎదుర్కొన్న అణచివేత, దారుణాల చుట్టూ తిరిగే సినిమా ఇది. ఈ మూవీకి బాక్సాఫీస్ దగ్గర పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఐఎండీబీలో 7.3 రేటింగ్ ఉంది. ప్రస్తుతం ఈ సినిమా ఆహా వీడియో ఓటీటీలో అందుబాటులో ఉంది.
{{/usCountry}}