బీజేపీకి కొత్త వర్కింగ్​ ప్రెసిడెంట్​- ఎవరు ఈ 45ఏళ్ల నితిన్​ నబిన్​?

కొత్త వర్కింగ్​ ప్రెసిడెంట్​ని బీజేపీ ప్రకటించింది. ఆ పదవిలో నితిన్​ నబిన్​ని నియమిస్తున్నట్టు వెల్లడించింది. 45ఏళ్ల నితిన్​ నబిన్​ బీహార్​లోని నితీశ్​ కుమార్​ ప్రభుత్వంలో ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు.

Published on: Dec 15, 2025, 06:45:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లోని అత్యున్నత నాయకత్వంలో కీలకమైన సంస్థాగత మార్పు చోటుచేసుకుంది. పార్టీ తదుపరి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్​గా (కార్యనిర్వాహక అధ్యక్షుడు) బీహార్​కి చెందిన నితిన్ నబిన్‌ను నియమించారు.

బీజేపీ వర్కింగ్​ ప్రెసిడెంట్​గా నితిన్​ నబిన్​.. (PTI)
బీజేపీ వర్కింగ్​ ప్రెసిడెంట్​గా నితిన్​ నబిన్​.. (PTI)

ప్రస్తుత జాతీయ అధ్యక్షుడిగా, కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రిగా ఉన్న జేపీ నడ్డా స్థానంలో నితిన్ నబిన్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఈ సందర్భంగా, కొత్తగా నియమితులైన నితిన్ నబిన్ ప్రస్తానం గురించి ఇక్కడ తెలుసుకోండి..

బీజేపీ వర్కింగ్​ ప్రెసిడెంట్​- ఎవరీ నితిన్ నబిన్?

నితిన్ నబిన్ 1980లో బిహార్​లోని పట్నాలో జన్మించారు. ఆయన తన రాజకీయ ప్రయాణాన్ని బీజేపీ విద్యార్థి విభాగమైన అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ద్వారా ప్రారంభించారు.

2000 సంవత్సరంలో తొలిసారిగా బీహార్ అసెంబ్లీకి ఎన్నికైన నబిన్, ప్రస్తుతం పట్నాలోని బంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నియోజకవర్గం రాష్ట్రంలో బీజేపీకి అత్యంత బలమైన అర్బన్​ సీట్లలో ఒకటి.

ఇటీవలే ముగిసిన 2025 బీహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో నితిన్​ నబిన్​ ఘన విజయం సాధించారు! ఆ ఎన్నికల్లో ఆయన రాష్ట్రీయ జనతాదళ్‌కు చెందిన రేఖా కుమారిపై 51,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయం సాధించిన ఒక నెల తర్వాత ఈ కీలకమైన జాతీయ వర్కింగ్ అధ్యక్ష పదవికి నబిన్ నియమితులయ్యారు. ఈ ఎన్నికల్లో జేడీ(యూ)తో కలిసి కూటమి మరోసారి అధికారాన్ని చేపట్టిన విషయం తెలిసిందే.

ఎన్నికల సంఘం (ఈసీఐ) డేటా ప్రకారం, బీహార్​ ఎన్నికల్లో బీజేపీ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. జేడీ(యూ) 85 సీట్లతో తర్వాతి స్థానంలో ఉంది.

ప్రధానమంత్రి అభినందనలు..

నబిన్ ప్రస్తుతం బీహార్‌లో నితీష్ కుమార్ ప్రభుత్వంలో రోడ్డు నిర్మాణం శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం నితిన్ నబిన్​కి దక్కిన పదోన్నతిపై అభినందనలు తెలిపారు.

"నితిన్ నబిన్ యువకుడు, కష్టపడే నాయకుడు. సంస్థాగత వ్యవహారాల్లో ఆయనకు గణనీయమైన అనుభవం ఉంది. బీహార్‌లో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆయన చేసిన కృషి చాలా ప్రభావవంతంగా ఉంది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఆయన పూర్తి అంకితభావంతో పనిచేశారు. గర్వం లేని స్వభావం, క్షేత్రస్థాయిలో పనిచేసే విధానం ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి," అని ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ఎక్స్​' (గతంలో ట్విట్టర్)లో పేర్కొన్నారు.

బీజేపీలో అత్యంత పిన్న వయస్కుడు..

45 సంవత్సరాల వయసున్న నితిన్ నబిన్, బీజేపీ జాతీయ వర్కింగ్ అధ్యక్ష పదవిని చేపట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలవనున్నారు!

బీజేపీ అధ్యక్ష పదవిలో సరైన వ్యక్తిని నియమించేందుకు బీజేపీ గత కొంతకాలంగా అన్వేషిస్తోంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న నడ్డా పదవీ కాలం ముగిసినప్పటికీ, కొత్త నియామకంలో జాప్యం కారణంగా ఆయన టెన్యూర్​ని కొనసాగిస్తూ వచ్చింది. ఇప్పుడు చివరికి కొత్త వర్కింగ్​ ప్రెసిడెంట్​గా నితిన్​ నబిన్​ని ప్రకటించింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More