రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ చూస్తోంది.. రిజర్వేషన్లు ఎత్తివేస్తారు : సీఎం రేవంత్ రెడ్డి

రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు బీజేపీ చూస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు.

Published on: Dec 14, 2025 5:12 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఓట్ చోర్, గద్దీ ఛోడ్ పేరుతో కాంగ్రెస్ పార్టీ మహా ధర్నా నిర్వహించింది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఎన్నికల సంఘంపై విమర్శలు చేశారు. దళితులు, ఆదివాసులు, మైనారిటీలు, పేదల ఓటు హక్కును లాగేసుకోవాలని ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు ప్రయత్నించారని రేవంత్ రెడ్డి అన్నారు. మహాత్మాగాంధీ, అంబేడ్కర్ తదితరుల పోరాటంతో వారికి ఓటు హక్కు వచ్చిందన్నారు. ఇప్పుడు అదే ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన బీజేపీ మళ్లీ ఆ ఓట్లను లాగేసుకోవాలని చూస్తోందన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

'రాజ్యాంగ రచన సమయంలో రాజ్యాంగ సభలో దళితులు, ఆదివాసులు, మైనారిటీలు, పేదలకు ఓటు హక్కు విషయంపై చర్చించే సమయంలో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఎంఎస్ గోల్వాల్కర్ తదితరులు వారికి ఓటు హక్కు వద్దని చెప్పారు. గాంధీ, అంబేడ్కర్ వారికి ఓటు హక్కు కల్పించినందుకు ఈ దేశంలో ప్రభుత్వ ఏర్పాటులో వాళ్లు కూడా భాగం అవుతున్నారు.' అని రేవంత్ రెడ్డి అన్నారు.

ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్న మోదీ, అమిత్ షా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వారి భావజాలాన్ని అమలు చేయడానికి 400 సీట్ల కావాలని కోరుతున్నారన్నారు రేవంత్ రెడ్డి. బీజేపీకి 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తారన్నారు. రిజర్వేషన్లు ఎత్తివేస్తారని రాహుల్ గాందీ జనాల్లోకి తీసుకెళ్లారన్నారు. అందుకే దేశ ప్రజలు ఆ పార్టీని 240 సీట్లకు పరిమితం చేశారన్నారు.

అలా చేసినందుకే ఈరోజు రాజ్యాంగం, రిజర్వేషన్లు ఉన్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. అందుకనే ఇప్పుడు ఎస్ఐఆర్ పేరుతో ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. అప్పుడు పేదలు, దళితులు, ఆదివాసులు, మైనారిటీల కోసం గాంధీ, అంబేడ్కర్ నిలుచుకున్నట్టుగానే.. ఇప్పుడు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నిలుస్తున్నారన్నారు. మనం వారికి అండగా ఉండాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

'ఎస్ఐఆర్ పేరుతో మెుదట ఓటరు రికార్డు తొలగిస్తారు. తర్వాత ఆధార్, రేషన్ కార్డును రద్దు చేస్తారు. ఆ తర్వాత వాళ్లకు ఉన్న హక్కులను లాక్కుంటారు. ఈ సమస్య ఎన్నికలది, కాంగ్రెస్ పార్టీది కాదు. దేశ సమస్య. ఈ సమస్యకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేసే పోరాటంలో కలిసి సాగడానికి తెలంగాణ సిద్ధంగా ఉంది. దేశ ప్రజలు కలిసి రావాలి.' అని రేవంత్ రెడ్డి అన్నారు.