...
...
Next Story

Jiohotstar OTT: జియోహాట్‌స్టార్‌లోకి వ‌చ్చేస్తున్న 2 వేల కోట్ల సినిమా-స్పీల్‌బ‌ర్గ్ విజువ‌ల్ వండ‌ర్‌-ఏలియ‌న్ ర‌హ‌స్యాలు!

Jiohotstar OTT: పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్‌లోకి ఓ మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీ రాబోతుంది. లెజెండరీ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఏలియన్స్ సీక్రెట్స్ తో సాగే ఈ మూవీ కచ్చితంగా గూస్ బంప్స్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది.

Published on: Oct 3, 2026, 13:38:26 IST
Advertisement

Jiohotstar OTT: లెజెండరీ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్‌బర్గ్ (Steven Spielberg) మరోసారి సైన్స్ ఫిక్షన్ జోనర్‌లోకి అడుగుపెడుతూ తెరకెక్కించిన విజువల్ వండర్ మూవీ ‘డిస్‌క్లోజర్ డే’ (Disclosure Day). థియేటర్లలో భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ గ్లోబల్ ఈవెంట్ ఫిల్మ్, ఇప్పుడు డిజిటల్ స్క్రీన్స్‌పై బ్లాక్‌బస్టర్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది.

కథేంటంటే?

జియోహాట్‌స్టార్‌లోకి వ‌చ్చేస్తున్న 2 వేల కోట్ల సినిమా-స్పీల్‌బ‌ర్గ్ విజువ‌ల్ వండ‌ర్‌-ఏలియ‌న్ ర‌హ‌స్యాలు! (x/jiohotstar)
జియోహాట్‌స్టార్‌లోకి వ‌చ్చేస్తున్న 2 వేల కోట్ల సినిమా-స్పీల్‌బ‌ర్గ్ విజువ‌ల్ వండ‌ర్‌-ఏలియ‌న్ ర‌హ‌స్యాలు! (x/jiohotstar)

ఈ విశ్వంలో మనం ఒంటరిగా లేము, గ్రహాంతరవాసులు (Aliens) ఉన్నారనే నిజాన్ని ఒక పవర్‌ఫుల్ కార్పొరేట్ సంస్థ దాచిపెడితే ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్ చుట్టూ ఈ డిస్‌క్లోజర్ డే సినిమా కథ తిరుగుతుంది.

• డేనియల్ కెల్నర్ (జోష్ ఓ కానర్) ఒక రిఫార్మ్డ్ హ్యాకర్, ‘వార్డెక్స్’ అనే షాడో ఏజెన్సీలో సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్. ఈ ఏజెన్సీ చాలా ఏళ్లుగా భూమిని విజిట్ చేసిన నాన్-హ్యూమన్ ఎలియన్స్ రహస్యాలను ఒక సీక్రెట్ వాల్ట్‌లో దాచిపెడుతుంది. ఈ నిజాన్ని ప్రపంచానికి చెప్పాలని డేనియల్ ఒక విజిల్‌బ్లోయర్‌గా మారి అక్కడి నుండి డేటాతో పారిపోతాడు.

• మరోవైపు కాన్సాస్ సిటీలో ఉండే ఒక టెలివిజన్ మెటీరియాలజిస్ట్ (వాతావరణ నిపుణురాలు) మార్గరెట్ ఫెయిర్‌చైల్డ్ (ఎమిలీ బ్లంట్). ఈమెకు గ్రహాంతరవాసులకు సంబంధించిన కొన్ని వింతైన అతీత శక్తులు, సిగ్నల్స్ అందుతుంటాయి. ఈ ఇద్దరూ కలిసి ఈ గ్లోబల్ సీక్రెట్‌ను ప్రపంచానికి ఎలా బయటపెట్టారు? వార్డెక్స్ సంస్థ నుండి ఎలా తప్పించుకున్నారు? అన్నదే అసలు సినిమా కథ.

మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్‌లు

స్పీల్‌బర్గ్ మార్క్ చేజింగ్ సీన్స్‌తో పాటు డిస్‌క్లోజర్ డే సినిమాలో కొన్ని ఊహించని ఎలిమెంట్స్, ట్విస్ట్ లు ఉన్నాయి.

2. వార్డెక్స్ బాస్ ప్లాన్: విలన్‌గా కనిపించే వార్డెక్స్ హెడ్ నోవా స్కాన్లాన్ (కోలిన్ ఫిర్త్) కేవలం క్రూరత్వం వల్లో, డబ్బు వల్లో ఆ సీక్రెట్‌ను దాచడం లేదు. మానవాళి మనుగడ కోసమే ఆ నిజాన్ని తొక్కిపెట్టాడనే ఎమోషనల్ ట్విస్ట్ కథను మలుపు తిప్పుతుంది.

3. రాడికల్ హోప్‌కోర్ క్లైమాక్స్: గ్రహాంతరవాసులు దాడి చేయడానికి రాలేదు, మానవులలో ఉండే 'ఎంపతీ' (సహానుభూతి)ని మేల్కొల్పడానికే వచ్చారనే స్పీల్‌బర్గ్ మార్క్ హార్ట్-టచింగ్ ముగింపు సినిమాను రొటీన్ ఏలియన్ సినిమాలకు భిన్నంగా నిలబెడుతుంది.

ఓటీటీ రిలీజ్ ఎప్పుడు?

ఈ సైన్స్ ఫిక్షన్ చేజ్ థ్రిల్లర్ డిస్‌క్లోజర్ డే అక్టోబర్ 12, 2026 న అఫీషియల్‌గా జియోహాట్‌స్టార్ (JioHotstar)లో డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఇది ఇండియాలో ఇంగ్లీష్ తో పాటు హిందీ భాషల్లో ఓటీటీ రిలీజ్ కానుంది. మరోవైపు ప్రైమ్ వీడియో, జీ5 ఓటీటీల్లో ఈ మూవీ రెంట్ విధానంలో అందుబాటులో ఉంది.

డిస్‌క్లోజర్ డే మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.2000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఒకవేళ మీరు థియేటర్లలో ఈ స్పీల్‌బర్గ్ మ్యాజిక్‌ను మిస్ అయి ఉంటే, ఈ వీకెండ్ మీ హోమ్ థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయడానికి ఒక పర్ఫెక్ట్ ఆప్షన్.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks