Disco Shanthi: 'రియల్ స్టార్' శ్రీహరి సతీమణి, ఒకప్పటి సౌత్ ఇండియా స్టార్ డాన్సర్ డిస్కో శాంతి ఆసుపత్రిలో చేరడం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. హాస్పిటల్ బెడ్‌పై ముక్కుకు ఆక్సిజన్ పెట్టుకొని ఉన్న పిక్‌ను ఆమే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో శ్రీహరి అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

61 ఏళ్ల డిస్కో శాంతి గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు తెలుస్తోంది. తాజాగా "ఇంటికి తిరిగొచ్చాను" అంటూ నవ్వుతున్న ఎమోజీలతో ఒక ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అయితే తను ఎందుకు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది.. అసలు ఏం జరిగిందనే విషయాలను మాత్రం ఆమె బయటపెట్టలేదు.
కొడుకుల సైలెన్స్.. కన్నీళ్లు పెట్టుకుంటున్న ఫ్యాన్స్
డిస్కో శాంతి పెద్ద కుమారుడు మేఘాంశ్ శ్రీహరి రీసెంట్‌గా తన 26వ బర్త్‌డే జరుపుకున్నాడు. సోషల్ మీడియాలో తనకు వచ్చిన విష్‌లను రీపోస్ట్ చేశాడు తప్ప, తల్లి హాస్పిటలైజేషన్ గురించి ఎలాంటి హెల్త్ అప్‌డేట్ ఇవ్వలేదు. చిన్న కుమారుడు శశాంక్ శ్రీహరి కూడా దీనిపై స్పందించలేదు.
దీంతో శ్రీహరి ఫ్యాన్స్, నెటిజన్లు ఆమె పోస్ట్ కింద ఎమోషనల్ కామెంట్లు పెడుతున్నారు. "మీ కొడుకులకు మీరు తప్ప వేరే అమ్మ లేదు ఆంటీ. వాళ్ల కోసం మీరు చాలా స్ట్రాంగ్‌గా తిరిగి రావాలి. ఎలాంటి స్ట్రెస్ తీసుకోకండి.. దేవుడు మీకు తోడుంటాడు" అంటూ ఫ్యాన్స్ ధైర్యం చెబుతున్నారు.
1980, 90లలో బిగ్గెస్ట్ మాస్ డాన్స్ ఐకాన్
1980, 90ల కాలంలో సౌత్ ఇండస్ట్రీని తన మాస్ డాన్సులతో ఊపేసిన నటి డిస్కో శాంతి. తమిళ నటుడు సి.ఎల్. ఆనందన్ కుమార్తె అయిన శాంతి.. 1983లో 'వసంతమే వరుగ' సినిమాతో వెండితెరకు పరిచయమైంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఒడియా భాషల్లో వందలాది సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో మెరిసింది.
{{/usCountry}}1980, 90ల కాలంలో సౌత్ ఇండస్ట్రీని తన మాస్ డాన్సులతో ఊపేసిన నటి డిస్కో శాంతి. తమిళ నటుడు సి.ఎల్. ఆనందన్ కుమార్తె అయిన శాంతి.. 1983లో 'వసంతమే వరుగ' సినిమాతో వెండితెరకు పరిచయమైంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఒడియా భాషల్లో వందలాది సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో మెరిసింది.
{{/usCountry}}ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి 'ఘరానా మొగుడు'లోని ఐకానిక్ సాంగ్ "బంగారు కోడి పెట్ట", సూపర్‌స్టార్ రజినీకాంత్ 'ధర్మాతిన్ తలైవన్'లోని "ఒత్తడి ఒత్తడి" పాటలు డిస్కో శాంతికి విపరీతమైన పాపులారిటీ తీసుకొచ్చాయి. హిందీలో పరేష్ రావల్ నటించిన 'ఆద్మీ' లోని "డింగోరా డింగోరా" పాటతో నార్త్ ఆడియన్స్‌ను కూడా అలరించింది.
కుటుంబంలో వరుస విషాదాలు.. శ్రీహరి మరణం తర్వాత..
1996లో టాలీవుడ్ యాక్షన్ హీరో శ్రీహరిని వివాహం చేసుకున్న తర్వాత డిస్కో శాంతి సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. వీరికిద్దరు కుమారులు మేఘాంశ్, శశాంక్ కాగా.. అక్షర అనే కుమార్తె కూడా ఉండేది. అయితే కేవలం నాలుగు నెలల పసివయసులోనే అక్షర చనిపోవడంతో ఆ తీవ్ర విషాదం నుంచి కోలుకోవడానికి ఆ కుటుంబానికి చాలా సమయం పట్టింది. కుమార్తె జ్ఞాపకార్థం ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి నిరుపేద పిల్లల చదువుకు సాయం చేస్తున్నారు.
2013లో షాహిద్ కపూర్ 'ఆర్. రాజ్‌కుమార్' సినిమా షూటింగ్ సమయంలో తీవ్రమైన లివర్ సమస్యతో శ్రీహరి హఠాన్మరణం చెందడం ఆ కుటుంబాన్ని పూర్తిగా కుంగదీసింది. భర్త లేని లోటును భరిస్తూనే పిల్లల బాధ్యతను తన భుజాలపై వేసుకుంది.
ప్రస్తుతం పెద్ద కొడుకు మేఘాంశ్ శ్రీహరి 'రాజ్‌దూత్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, ప్రస్తుతం 'ఆస్మాన్' అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. మరోవైపు డిస్కో శాంతి కూడా రాఘవ లారెన్స్ నటిస్తున్న 'బుల్లెట్' సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేసుకుంటోంది. ఈ క్రమంలో ఆమె అనారోగ్యానికి గురవడం అభిమానులను కలవరపెడుతోంది.