...
...
Next Story

Khushboo Air Pistol: ఈ ఎయిర్ పిస్టల్ వాడండి- అమ్మాయిలకు ఖుష్బూ విజ్ఞప్తి- వాటి ధర ఎంత? ఎలా వాడాలి? ఎందుకు వాడాలంటే?

Khushboo Patani Urges Girls To Use Air Pistol: హీరోయిన్ దిశా పటానీ సోదరి, మాజీ ఆర్మీ ఆఫీసర్ ఖుష్బూ పటానీ అమ్మాయిలకు ఆసక్తికరంగా సలహా ఇస్తూ విజ్ఞప్తి చేశారు. ఆత్మరక్షణ కోసం ఎయిర్ పిస్టల్ వాడటం నేర్చుకోవాలని, కష్టకాలంలో తమను తామే కాపాడుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఖుష్బూ వివరంగా చెప్పారు.

Published on: Sep 28, 2026, 10:45:41 IST
Advertisement

Khushboo Patani Urges Girls To Use Air Pistol: దేశవ్యాప్తంగా మహిళల భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో, హాట్ బ్యూటీ దిశా పటానీ సోదరి, మాజీ భారత సైనిక అధికారిణి ఖుష్బూ పటానీ కీలక సూచన చేశారు.

'ఎయిర్ పిస్టల్' వాడటం నేర్చుకోవాలని

ఈ ఎయిర్ పిస్టల్ వాడండి- అమ్మాయిలకు ఖుష్బూ విజ్ఞప్తి- వాటి ధర ఎంత? ఎలా వాడాలి? ఎందుకు వాడాలంటే?
ఈ ఎయిర్ పిస్టల్ వాడండి- అమ్మాయిలకు ఖుష్బూ విజ్ఞప్తి- వాటి ధర ఎంత? ఎలా వాడాలి? ఎందుకు వాడాలంటే?

ఇటీవల బిహార్‌లోని జముయీ జిల్లాలో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన అమానుష వేధింపుల ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె, మహిళలు ఆత్మరక్షణ కోసం స్వయంగా రంగంలోకి దిగాలని పిలుపునిచ్చారు. స్వీయ రక్షణ కోసం ప్రతీ అమ్మాయి 'ఎయిర్ పిస్టల్' వాడటం నేర్చుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో ఎవరి సహాయం కోసం ఎదురుచూడకుండా తమను తాము కాపాడుకోవాలని సలహా ఇచ్చారు.

ఎయిర్ పిస్టల్‌తో ఆత్మరక్షణ ఎలా? ఖుష్బూ సలహాలు

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రత్యేక వీడియోను పంచుకుంటూ, CO2 ఆధారంగా పనిచేసే ఎయిర్ పిస్టల్ ఎలా పనిచేస్తుందో ఖుష్బూ ప్రత్యక్షంగా చూపెట్టారు. సాధారణ తుపాకీలా కాకుండా, ఇందులో గన్‌పౌడర్ లేదా కాట్రిడ్జ్‌లకు బదులుగా కార్బన్ డై ఆక్సైడ్ (CO2) సహాయంతో పెల్లెట్లను ప్రయోగిస్తారని ఖుష్బూ వివరించారు. రూ. 60,000 నుంచి రూ. 70,000 బడ్జెట్‌లో లభించే ఈ పిస్టళ్లను కొనుగోలు చేసి, సమీపంలోని షూటింగ్ రేంజ్‌లలో శిక్షణ తీసుకోవాలని కోరారు.

"ఎట్టి పరిస్థితుల్లోనూ ఎయిర్ పిస్టళ్లను ఆన్‌లైన్‌లో కొనకూడదు. నేరుగా స్థానిక జిల్లా డీలర్ వద్దకే వెళ్లాలి. మన చేతికి సరిపోయే బరువు, వేగంగా ఉపయోగించేందుకు వీలుగా ఉండే మోడల్‌ను ఎంచుకోవాలి. బ్యాగ్ లేదా జేబులోంచి చూపు తిప్పకుండానే క్షణాల్లో తుపాకీ బయటకు తీసేలా సాధన చేయాలి" అని ఖుష్బూ వివరించారు.

రాజ్యాంగ హక్కు.. చావుబతుకుల సమస్యే వచ్చినప్పుడు!

"మన ప్రాణాలను, హక్కులను కాపాడుకునే హక్కును భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 మనకు ప్రసాదించింది. ఇది కేవలం చావుబతుకుల సమస్య ఎదురైనప్పుడు మాత్రమే వాడాలి. ఆడపిల్లలు ఎప్పటికీ తమను తాము బలహీనులుగా భావించకూడదు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే ధైర్యం అదే వస్తుంది" అని ఆమె పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా కలకలం రేపిన జముయీ ఘటన

సెప్టెంబర్ 19న బిహార్‌లోని జముయీ ప్రాంతంలో ఒక పర్యాటక ప్రదేశానికి వెళ్లి వస్తున్న 10వ తరగతి విద్యార్థి, విద్యార్థినిలపై కొంతమంది ఆకతాయిలు దాడి చేశారు. విద్యార్థిపై భౌతిక దాడికి పాల్పడటమే కాకుండా, అమ్మాయిని తీవ్రంగా వేధించారు. ఈ దారుణ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి.

ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS), పోక్సో (POCSO) చట్టాల కింద కేసులు నమోదు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసి, వీడియో ఆధారంగా ఏడుగురు నిందితులను గుర్తించారు. వారిలో ప్రధాన నిందితుడితో సహా ఐదుగురిని ఇప్పటికే అరెస్టు చేశారు.

వేధించే హక్కు ఎవరికీ లేదు

మహిళల భద్రత, శాంతిభద్రతల వైఫల్యంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ఖుష్బూ, కేవలం స్నేహితులతో బయటకు వెళ్లినంత మాత్రాన వేధించే హక్కు ఎవరికీ లేదని, నిందితులకు కఠిన శిక్ష పడేవరకు అందరూ గొంతు విప్పాలని డిమాండ్ చేశారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks