OTT: ఫుట్‌బాల్ ప్లేయర్ తుపాకీ ఎందుకు పట్టాడు? ఇవాళ ఓటీటీలోకి వచ్చిన రోషన్ బ్లాక్ బస్టర్ ఛాంపియన్-7.4 రేటింగ్
సీనియర్ నటుడు శ్రీకాంత్ మేక తనయుడు రోషన్ మేక హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఛాాంపియన్’. ఇందులో ఫుట్ బాల్ ప్లేయర్ గా నటించిన రోషన్ చివరకు తుపాకీ పట్టి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొంటాడు. మరి అలా ఎందుకు జరిగిందో ఈ రోజు ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాలో చూసేయండి.
ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా వచ్చేసింది. సీనియర్ నటుడు శ్రీకాంత్ కొడుకు రోషన్ మేక హీరోగా నటించిన ‘ఛాంపియన్’ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇవాళే (జనవరి 29) ఓటీటీీలో అడుగుపెట్టింది ఈ స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్. థియేటర్లలో ఛాంపియన్ మూవీకి మంచి రెస్పాన్స్ దక్కింది. సినిమా హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు ఐఎండీబీలో 7.4 రేటింగ్ ఉంది.

ఛాంపియన్ ఓటీటీ
రోషన్ మేక, అనస్వర రాజన్ జంటగా నటించిన సినిమా ఛాంపియన్. ప్రదీప్ అద్వైతం డైరెక్ట్ చేసిన ఈ మూవీ గురువారం డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ రోజు నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఈ మూవీ వ్యూయర్స్ కు అందుబాటులో ఉంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఛాంపియన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
సూపర్ హిట్
పెళ్లి సందD మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రోషన్ మేక. ఆ తర్వాత మళ్లీ ఛాంపియన్ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ ఛాంపియన్ సినిమా 2025 డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజైంది. రోషన్ మేక, అనస్వర రాజన్, సంతోష్ ప్రతాప్, అవంతిక, హైపర్ ఆది తదితరులు నటించిన ఛాంపియన్ చిత్రానికి థియేటర్లలో పాజిటివ్ టాక్ వచ్చింది. పెట్టిన బడ్జెట్ తిరిగి రాబట్టిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.
ఛాంపియన్ స్టోరీ
ఛాంపియన్ మూవీ అనేది ఓ పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్. పెద్ద ఫుట్ బాల్ ప్లేయర్ కావాలని, ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ క్లబ్ కు ఆడాలనే కుర్రాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆయుధం ఎందుకు పట్టాల్సి వచ్చిందనే నేపథ్యంలో ఛాంపియన్ మూవీ తెరకెక్కించారు.
ఫుట్ బాల్ ప్లేయర్
మైఖేల్ సి.విలియమ్స్ (రోషన్) కు ఫుట్ బాల్ అంటే పిచ్చి. ఈ ఆటలో మంచి పేరు తెచ్చుకుంటాడు. ఇంగ్లాండ్ లోని పాపులర్ ఫుట్ బాల్ క్లబ్ మాంచెస్టర్ కు ఆడాలని కల కంటాడు. కానీ తన తండ్రి కారణంగా ఇంగ్లాండ్ కు వెళ్లేందుకు అడ్డంకులు ఎదురవుతాయి.
మరోవైపు ఇండియాకు స్వాతంత్య్రం వచ్చినా హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం దురాగత పాలనతో, రజాకార్ల అరాచకాలతో నలిగిపోతుంటుంది.నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణలో సాయుధ రైతాంగ పోరాటం జరుగుతుంది. ఆ సమయంలో భైరాన్ పల్లి గ్రామం వెన్ను చూపని పోరాటంతో రజాకార్లను బెంబేలెత్తిస్తుంది.
తుపాకీ పట్టి
మరోవైపు ఇంగ్లాండ్ కు అడ్డదారుల్లోనైనా సరే వెళ్లాలని మైఖేల్ ప్రయత్నిస్తాడు. ఆ సమయంలోనే కొన్ని ఆయుధాలను అక్రమ రవాణా చేస్తాడు. చివరకు భైరాన్ పల్లి గ్రామం చేరుకుంటాడు. మరి ఫుట్ బాల్ ప్లేయర్ కావాలనుకున్న మైఖేల్ తుపాకీ ఎందుకు చేతబట్టాడు అనేది ఛాంపియన్ సినిమాలోనే చూడాలి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


