ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప 2' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి భారీ సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో నటించిన ఒక నటి మాత్రం తన పాత్ర విషయంలో చాలా నిరాశకు గురైంది. బిగ్‌బాస్ ఫేమ్, యంగ్ బ్యూటీ దివి వాద్యా ఈ సినిమాలో ఒక రిపోర్టర్ తరహా పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. అయితే ఫైనల్ కట్‌లో తన పాత్రను బాగా తగ్గించేయడం పట్ల ఆమె ఓపెన్‌గా తన ఆవేదనను బయటపెట్టింది. ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో దివి తాజాగా దీనిపై స్పందించింది.
దివి అసలు ఏమన్నదంటే?

పుష్ప 2 సినిమాలో తన క్యారెక్టర్ గురించి దివి మాట్లాడుతూ.. "మొదట నాకు కథ చెప్పినప్పుడు నా పాత్ర చాలా పెద్దది అని చెప్పారు. నా క్యారెక్టర్‌కు సంబంధించి ఒక స్పెషల్ టీజర్ కూడా రిలీజ్ చేశారు. అది చూసి నేను కూడా నాది నిజంగానే సినిమాలో చాలా పెద్ద రోల్ అని ఎంతో ఆశపడ్డాను. నాతోపాటు పది మంది ఫ్రెండ్స్ ను తీసుకెళ్లాను. కానీ తీరా థియేటర్‌లో సినిమా చూశాక నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. నా పాత్ర నిడివి అంత తక్కువగా ఉండటం చూసి చాలా బాధపడ్డాను. విపరీతమైన నిరాశకు గురయ్యాను" అంటూ తన మనసులోని మాటను కుండబద్దలు కొట్టింది.
20 రోజుల షూటింగ్.. 10 రోజుల డబ్బింగ్
పుష్ప 2 మూవీలో దివి తన పాత్ర కోసం ఏకంగా 20 రోజుల పాటు షూటింగ్ చేసిందట. అంతేకాదు అదనంగా మరో 10 రోజుల పాటు డబ్బింగ్ చెప్పిందట. ఈ స్థాయిలో షూటింగ్ జరిగిన తర్వాత మూవీలో చాలా ఎక్కువ నిడివి ఉన్న పాత్రే అని అనుకోవడం సహజం. కానీ దివి మాత్రం తన విషయంలో అలా జరిగేసరికి తీవ్రంగా నిరాశ చెందింది.
అందులోనూ పుష్ప 2 పాన్ ఇండియా లెవెల్లో క్రియేట్ చేసిన సెన్సేషన్ చూసిన తర్వాత అలాంటి సినిమాలో అవకాశం రావడమే గొప్ప అని భావించడం సహజం. ఆ ఛాన్స్ కొట్టేసినా దివికి మాత్రం చివరికి ఇలా జరగడం నిజంగా బాధాకరమే.
{{/usCountry}}అందులోనూ పుష్ప 2 పాన్ ఇండియా లెవెల్లో క్రియేట్ చేసిన సెన్సేషన్ చూసిన తర్వాత అలాంటి సినిమాలో అవకాశం రావడమే గొప్ప అని భావించడం సహజం. ఆ ఛాన్స్ కొట్టేసినా దివికి మాత్రం చివరికి ఇలా జరగడం నిజంగా బాధాకరమే.
{{/usCountry}}బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్ లో 49 రోజుల పాటు హౌజ్ లో ఉండి ఫేమస్ అయింది దివి. ఆమె ఈ మధ్యే తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ హనీలో నటించింది. ఈ సినిమా ప్రస్తుతం ప్రైమ్ వీడియో, సన్ నెక్ట్స్ ఓటీటీల్లో అందుబాటులో ఉంది.