...
...
Next Story

బట్టలు విప్పుకొని తిరగమనండి.. అనసూయ అతిగా మాట్లాడుతోంది: దివ్వెల మాధురి సంచలన వ్యాఖ్యలు

శివాజీ వివాదాస్పద కామెంట్ల కాంట్రవర్సీ కొనసాగుతూనే ఉంది. శివాజీ చేసిన అనుచిత వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతూనే ఉంది. ఇందులో అనసూయ కామెంట్లు వైరల్ కాగా.. కొంతమంది శివాజీకి మద్దతుగా నిలుస్తున్నారు. బిగ్ బాస్ ఫేమ్ దివ్వెల మాధురి రియాక్టవుతూ అనసూయపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

Published on: Dec 26, 2025, 12:22:12 IST
Advertisement

అనసూయపై బిగ్ బాస్ ఫేమ్ దివ్వెల మాధురి విరుచుకుపడింది. శివాజీ వివాదాస్పద కామెంట్లపై రియాక్టయిన మాధురి సంచలన వ్యాఖ్యలు చేసింది. శివాజీ మాట్లాడిన విధానం, ఉపయోగించిన పదాలు తప్పు కానీ ఆయన ఉద్దేశం తప్పు కాదని మాధురి చెప్పింది. ఆమె భర్త దువ్వాడ శ్రీనివాస్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

కొన్ని తప్పుడు మాటలు

దివ్వెల మాధురి (x)
దివ్వెల మాధురి (x)

శివాజీ కామెంట్లు వైరల్ గా మారాయి. హీరోయిన్ల డ్రెస్ తీరుపై శివాజీ ఓ మూవీ ఈవెంట్లో మాట్లాడుతూ ‘సామాన్లు’, ‘దొంగము**’ అనే పదాలు వాడాడు. దీనిపై అనసూయ, చిన్మయి లాంటి వాళ్లు ఫైర్ అయ్యారు. వీటిపై ఓ టీవీ డిబేట్లో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి రియాక్టయ్యారు.

శివాజీ తప్పు లేదు

‘‘శివాజీ చెప్పిన దాంట్లో తప్పు లేదు. కానీ కొన్ని మాటలు తప్పుగా మాట్లాడారు. ఇప్పటికే సారీ కూడా చెప్పారు కాబట్టి క్లియర్. కొంతమంది హీరోయిన్లు అసభ్యకరంగానే బట్టలు వేసుకుంటున్నారు. స్త్రీ నిండుగా కట్టుకుంటే అందంగా ఉంటుంది. మితిమీరిన బట్టలు వేసుకుంటున్నారు. ప్రతి ఇంట్లోనూ ఒక మహిళ ఉంటుంది. మహిళను కించపరిచేలా శివాజీ అలాంటి పదాలు వాడి మాట్లాడకూడదు’’ అని మాధురి చెప్పింది.

బట్టలు విప్పుకొని

‘‘స్త్రీకి ఎప్పుడూ చీర అందం. డైరెక్టర్ కు చెప్పండి. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు చెప్పినట్లే కదా హీరోయిన్లు బట్టలు వేసుకుంటారు. అందుకే వాళ్లకు ముందే చెప్పాలి’’ అని మాధురి తెలిపింది. ఏంటి నిండుగా బట్టలు వేసుకోకపోతే పోయేకాలం మగాళ్లకు అని అనసూయ, చిన్మయి లాంటి వాళ్లు అంటున్నారని యాంకర్ ప్రశ్నిస్తాడు.

‘‘శివాజీ చెప్పిన మాటల్లో తప్పు ఉంది. కానీ ఆయన ఉద్దేశంలో తప్పు లేదు. కానీ ఆయన వాడిన కొన్ని పదాలు ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆ విషయంలో ఆయన సారీ కూడా చెప్పారు. అంతటితో విషయం ముగిసిపోవాలి. కానీ అనసూయ అనవసరంగా అతిగా మాట్లాడుతోంది’’ అని మాధురి ఘాటు వ్యాఖ్యలు చేసింది.

శివాజీ ఏమన్నారంటే?

దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ మాట్లాడుతూ హీరోయిన్లు పద్ధతిగా బట్టలు వేసుకోవాలని సూచించాడు. ‘సామాన్లు’ కనపడేలా కాదమ్మా, ‘దొంగము**’ అంటారు అనే పదాలు వాడారు. ఇవి వివాదానాకి దారితీశాయి. దీనిపై చిన్మయి, అనసూయ ఫైర్ అయ్యారు. కొంతమంది ఏమో శివాజీ చెప్పిన దాంట్లో తప్పు లేదు కానీ ఆయన మాటలే పద్ధతిగా లేవని అంటున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks