ఫామ్‌హౌస్ మందు పార్టీలో బిగ్ బాస్ దివ్వెల మాధురి-పోలీసుల రైడ్-అరెస్ట్ చేశారనే ప్రచారం-ఆమె ఏం చెప్పారంటే?
బిగ్ బాస్ ఫేమ్ దివ్వెల మాధురిపై పోలీస్ కేసు నమోదైంది.. అరెస్టు చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ దీనిపై స్పందించిన మాధురి ఆ వదంతులను కొట్టిపారేశారు. అసలు ఫామ్ హౌస్ లో ఏం జరిగింది? అన్నది ఇక్కడ చూసేయండి.
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో పార్టిసిపేట్ చేసిన దివ్వెల మాధురి ఓ వివాదం చిక్కుకుంది. అనుమతి లేకుండా నిర్వహించిన ఫామ్ హౌజ్ పార్టీలో దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి ఆమె పాల్గొందని, వీళ్లను పోలీసులు అరెస్టు చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దివ్వెల మాధురి మరోసారి చర్చనీయాంశంగా మారింది. మరి అసలు ఏం జరిగిందో చూద్దాం.

మొయినాబాద్ లోని ఫామ్ హౌజ్
గురువారం (డిసెంబర్ 11) రాత్రి మొయినాబాద్ లో ని పెండెంట్ ఫామ్ హౌస్ లో పార్టీ జరిగింది. దీనికి పోలీసుల అనుమతి లేదు. పోలీసులు రైడ్ చేస్తే విదేశీ మద్యం బాటిళ్లు, హుక్క పాట్స్ దొరికాయని చెబుతున్నారు. అయితే ఇందులో దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. ఈ రోజు (డిసెంబర్ 12) మాధురి బర్త్ డే కాబట్టి నిన్న శ్రీనివాస్ ఈ పార్టీ అరెంజ్ చేశారనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
శ్రీనివాస్ ఏం చెప్పారంటే?
ఫామ్ హౌజ్ మందు పార్టీ, పోలీసుల రైడ్ గురించి దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ ఓ న్యూస్ ఛానల్ తో మాట్లాడారు. ‘‘పార్థసారథి రియల్ ఎస్టేట్ కు సంబంధించిన బిజినెస్ మీట్ పెట్టాడు. మేం ఇద్దరం కలిసి వెళ్లాం. బిజినెస్ డీల్ మాట్లాడిన తర్వాత పోలీసులు వచ్చారు. సెర్చ్ చేశారు. లైసెన్స్ లేకుండా పార్టీ పెట్టారని పోలీసులు చెప్పారు. లైసెన్స్ లేదా అని పార్థును అడిగితే లేదన్నా 10, 15 మందే కదా పెండెంట్ ఫామ్ హౌస్ ఓనర్ చూసుకుంటా అన్నాడని చెప్పాడు. మాధురి బర్త్ డే 12 నాడు. పార్టీ 11 నాడు జరిగింది. మాధురి బర్త్ డే కేక్ ఈ రోజు కట్ చేస్తాం. ఫేక్ వార్తలు ప్రచారం చేయకండి’’ అని శ్రీనివాస్ చెప్పారు.
మాధురి రియాక్షన్
‘‘పార్థు బంధువు కాదు. జస్ట్ ఫ్రెండ్. ఈ రోజు నా బర్త్ డే. రాత్రి పార్టీ చేస్తే రూల్స్ ప్రకారమే చేస్తాం. నిన్న పార్టీలో చాలా మంది ఫ్యామిలీ ఫ్రెండ్స్, తెలిసిన వాళ్లు ఉన్నారు. పొద్దున లేచేసరికి మాధురి అరెస్ట్ అని అంటున్నారు. కానీ టీఆర్పీ రేటింగ్ కోసం అలా బిహేవ్ చేయకండి. అరెస్ట్ అయిన రోజు అరెస్ట్ అయినట్లు రాయండి’’ అని మాధురి ఫైర్ అయింది.
‘‘హుక్కా అంటే నాకు తెలియదు. నేను వెళ్లిన దగ్గర హుక్కా లాంటిది చూడలేదు. బాటిల్స్ ఉన్నాయి. పోలీసులు మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. మాకు సంబంధం లేదు. పార్టీ నిర్వహించిన వాళ్లకు నోటీసులు ఇచ్చారని పొద్దున తెలిసింది. సార్ (శ్రీనివాస్)ను చూసి సర్ ప్రైజింగ్ ఇక్కడున్నారా? అని పోలీసులు అడిగారు అంతే’’ అని మాధురి స్పష్టం చేసింది. బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో అందరినీ హడలెత్తించింది మాధురి.














