Sejal Pawar: బిర్యానీ వివాదం వేళ స్టాండప్ షోలో లేడీ డాక్టర్ అగ్లీ జోకులు..శవాల ప్రైవేట్ పార్ట్స్ సైజ్ అంటూ.. చివరకు సారీ
Sejal Pawar: ప్రణీీత్ మోరే స్టాండప్ కామెడీ షో వివాదాలకు అడ్డాగా మారుతుంది. రూ.370 బిర్యానీ కాంట్రవర్సీ కారణంగా ఓ యువకుడి జాబ్ పోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే షోలో ఓ లేడీ డాక్టర్ అగ్లీ కామెంట్లు చేసింది. మగ శవాల ప్రైవేట్ పార్ట్స్ సైజ్ అంటూ చాలా నీచంగా మాట్లాడిందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
Sejal Pawar: పాపులర్ స్టాండప్ కమెడియన్ ప్రణీత్ మోరే షోలో మరో వివాదం చెలరేగింది. రూ.370 బిర్యానీ వివాదం మరవకముందే, మరో కాంట్రవర్సీ రేకెత్తింది. ఈ సారి ఓ లేడీ డాక్టర్ అగ్లీ కామెంట్లు చేయడం గమనార్హం. చనిపోయిన మగ శవాల ప్రైవేట్ పార్ట్స్ సైజ్ గురించి ఆమె మాట్లాడింది. ఇప్పుడీ కామెంట్లపై ఇంటర్నెట్ మండిపడుతోంది.

సెజల్ పవార్ కామెంట్లు
ప్రణీత్ మోరే స్టాండప్ కామెడీ షోలో తాజాగా డాక్టర్ సెజల్ పవార్ పాల్గొంది. హాస్పిటల్లో మగ శవాల పట్ల ఆమె ఎలా ప్రవర్తిస్తుందో చెప్పింది. ముందు పొట్ట కోస్తాం, ఆ తర్వాత తల పగలకొడతామంటూ సెజల్ చెప్పింది. అనంతరం ప్రైవేట్ పార్ట్స్ చూస్తామని, పురుషాంగం సైజ్ ల గురించి మాట్లాడుకుంటామని నవ్వేసింది.
వీడియో వైరల్
డాక్టర్ సెజల్ పవార్ కామెంట్లు ఇప్పుడు ఇంటర్నెట్ లో దుమారం రేపుతున్నాయి. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి ఇలాంటి కామెంట్లు చేయడం సరికాదనే విమర్శలు వస్తున్నాయి. రూ.370 బిర్యానీ జోక్ కారణంగా జాబ్ కోల్పోయిన హిమాంశు లాగే సెజల్ పైనా చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
సెజల్ ప్రస్తుతం తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ను ప్రైవేట్ చేసింది. ఆమె ప్రస్తుతం ముంబైలోని కేఇఎమ్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నట్లు ఆమె ఇన్‌స్టాగ్రామ్ బయోలో ఉంది.
రూ.370 బిర్యానీ కథ
ఇటీవల హిమాంశు జాంగ్రా ఈ ప్రణీత్ మోరే షోకు వెళ్లాడు. అప్పుడు అతను ఓ అమ్మాయితో డేట్ కు వెళ్లినట్లు చెప్పాడు. ఆమెకు రూ.370 బిర్యానీ తినిపించి, దానికి బదులుగా తనతో గడపాలని ప్రతిఫలం అడిగానని చెప్పాడు. ఓ చీకటి పార్కుకు తీసుకెళ్లానన్నాడు. రాత్రి అక్కడే తనతో గడిపానన్నాడు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర కలకలం రేగింది.
హిమాంశు వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. దీంతో అతను తన సోషల్ మీడియా అకౌంట్లను డిలీట్ చేశాడు. అంతే కాకుండా ఈ కామెంట్ల కారణంగా అతణ్ని జాబ్ నుంచి కంపెనీ తొలగించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సెజల్ పైనా ఇలాంటి చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
సారీ చెప్పిన సెజల్
ప్రణీత్ మోరె షోలో తన కామెంట్లు కాంట్రవర్సీకి దారితీయడంతో సెజల్ దిగొచ్చింది. తన కామెంట్లకు సారీ చెప్పింది. ఎవరినీ కించపరచడం తన ఉద్దేశం కాదని ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెట్టింది. తన మాటలు తప్పుగా అర్థమయ్యాయని కూడా ఆమె పేర్కొనడం గమనార్హం.
మెడికల్ ఎథిక్స్ ఏం చెబుతున్నాయి?
ఈ వివాదం కేవలం ఒక సాధారణ జోక్ లేదా కామెడీకి సంబంధించినది కాదు. దీని వెనుక వైద్య విద్యకు పునాది లాంటి మెడికల్ ఎథిక్స్ (Medical Ethics) ఉల్లంఘన స్పష్టంగా కనిపిస్తోంది.
మెడికల్ కాలేజీలలో అనాటమీ క్లాసుల కోసం వాడే శవాలను 'కడెవర్స్' (Cadavers) అంటారు. సైన్స్ అభివృద్ధి కోసం ఎందరో మహానుభావులు తమ పార్థివ దేహాలను వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం దానం చేస్తారు. నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) నిబంధనల ప్రకారం.. ఈ శవాల పట్ల అత్యంత గౌరవంగా ప్రవర్తించాలి. వాటిని కేవలం చదువు కోసమే చూడాలి తప్ప, వాటి అవయవాల పరిమాణాలపై పబ్లిక్ వేదికలపై జోకులు వేయడం చట్టపరంగా, నైతికంగా తీవ్రమైన నేరం.
వైద్య విద్యార్థులకు మొదటి ఏడాదిలోనే 'కడెవర్ ఓత్' (Cadaveric Oath) అనే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. చనిపోయిన శరీరాన్ని తమ మొదటి గురువుగా భావించి గౌరవించాలని బోధిస్తారు.
People Also Ask- తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ఈ వివాదానికి కారణమైన మహిళా డాక్టర్ ఎవరు?
ఈ వివాదానికి కారణమైన మహిళా డాక్టర్ పేరు సెజల్ పవార్.
నెటిజన్లు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు?
మెడికల్ కాలేజీ ల్యాబ్‌లోని మగ శవాల ప్రైవేట్ భాగాలపై ఆమె అసభ్యకరంగా జోకులు వేయడం, చనిపోయిన వారి పట్ల గౌరవం లేకుండా మాట్లాడటంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వివాదం ఏ షోలో జరిగింది?
ప్రముఖ స్టాండప్ కమెడియన్ ప్రణీత్ మోరే నిర్వహిస్తున్న ఒక పబ్లిక్ షోలో ఈ సంఘటన జరిగింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


