నేతాజి ప్రొడక్షన్స్, జిఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ల మీద రిచర్డ్ రిషి హీరోగా తెరకెక్కిన సినిమా ద్రౌపది 2. సోల చక్రవర్తి నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మోహన్. జి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
పాపులర్ సింగర్ ఆలాపన

అయితే, ఇటీవల ఈ సినిమా నుంచి ‘ఎం కోనె..(నెలరాజె..)’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటను టాలీవుడ్ పాపులర్ సింగర్ చిన్మయి శ్రీపాద ఆలపించారు. అయితే, ఈ పాటను పాడినందుక క్షమాపణలు చెబుతూ సింగర్ చిన్మయి పోస్ట్ పెట్టారు. అందుకు కారణం డైరెక్టర్ మోహన్ అని తెలిపింది చిన్మయి.
ఎం కోనె.. పాటను ఆలపించిన సింగర్ చిన్మయి.. సాంగ్ విడుదలైన కొద్దిసేపటి తర్వాత తన సోషల్ మీడియా ద్వారా ప్రజలకు క్షమాపణ చెప్పారు. రికార్డింగ్ సమయంలో ఈ సినిమా భావజాలం, దాని నేపథ్యం గురించి తాను తెలియకపోవటం వల్ల పాల్గొన్నానని, ప్రాజెక్ట్ గురించి ముందే తెలుసుకుని ఉంటే తాను ఇందులో ఇన్‌వాల్వ్ అయ్యేదాన్ని కాదని ఆమె వెల్లడించారు.
18 ఏళ్ల పరిచయంతోనే
కేవలం సంగీత దర్శకుడు జిబ్రాన్ చెప్పడంతో ఆ పాట పాడినట్లు, అతనితో తనకున్న 18 ఏళ్ల పరిచయంతో ఆ సాంగ్ పాడినట్లు చిన్మయి పేర్కొంది. అలాగే, ఆ సినిమాకు మోహన్ జి డైరెక్టర్ అని తనకు తెలియదని, తెలిసి ఉంట పాడేదాన్ని కాదని చిన్మయి రాసుకొచ్చింది. ఈ ట్వీట్ వైరల్ కావడంతో దర్శకుడు మోహన్ జి రియాక్ట్ అయ్యారు.
ఈ పాటను పాడటానికి తాను పర్సనల్‌గా చిన్మయి అయితే బావుంటుందని ఆమెతో పాడించానని డైరెక్టర్ మోహన్ జి పేర్నొన్నారు. రికార్డింగ్ సమయంలో చిత్ర సంగీత దర్శకుడు జిబ్రాన్ అందుబాటులో లేకపోవటంతో తాను ట్రాక్‌కు సంబంధించిన విషయాలను మాత్రమే వివరించానని, సినిమా కాన్సెప్ట్ గురించి ఎలాంటి చర్చ జరగలేదని దర్శకుడు తెలియజేశారు.
ఎలాంటి వివరణ తీసుకోకుండా
{{/usCountry}}ఈ పాటను పాడటానికి తాను పర్సనల్‌గా చిన్మయి అయితే బావుంటుందని ఆమెతో పాడించానని డైరెక్టర్ మోహన్ జి పేర్నొన్నారు. రికార్డింగ్ సమయంలో చిత్ర సంగీత దర్శకుడు జిబ్రాన్ అందుబాటులో లేకపోవటంతో తాను ట్రాక్‌కు సంబంధించిన విషయాలను మాత్రమే వివరించానని, సినిమా కాన్సెప్ట్ గురించి ఎలాంటి చర్చ జరగలేదని దర్శకుడు తెలియజేశారు.
ఎలాంటి వివరణ తీసుకోకుండా
{{/usCountry}}తనతో కానీ, సంగీత దర్శకుడితో కానీ మాట్లాడకుండా, ఎలాంటి వివరణ తీసుకోకుండా ఇలాంటి కామెంట్స్ చేయటం ఆశ్చర్యాన్ని కలిగించిదని డైరెక్టర్ చెప్పారు. దీనిపై చిన్మయి వివరణ ఇవ్వాలని లేదా తన ట్వీట్‌ను తొలగించాలని మోహన్ జి కోరారు.
ఈ సందర్భంగా ఎవరైనా విమర్శలు చేయాలనుకుంటే చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులను కాకుండా తనను విమర్శించాలని.. సినిమా మేకింగ్‌లో భాగమైన ఇతరులను విమర్శించటం పిరికితనమని దర్శకుడు మోహన్.జి పేర్కొన్నారు.
ఇంటిపేరులోనే శ్రీపాద
చిన్మయి తన మెసేజ్‌లో పేర్కొన్న వ్యతిరేక భావజాలం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. "చిన్మయి ఇంటిపేరులో శ్రీపాద అని ఉంది. అది ఆమె ఆధ్యాత్మిక భావాన్ని తెలియజేస్తోంది. ఆమె ఏ భావజాల భేదాల గురించి మాట్లాడిందో నాకు స్పష్టంగా అర్థం కాలేదు" అని తెలిపారు.
ఇలా చిన్మయి, డైరెక్టర్ల రియాక్షన్స్‌తో ఎం కోనే సాంగ్ వివాదంగా మారింది. కాగా, డైరెక్టర్ మోహన్ జి ఎక్కువగా యాంటీ దళిత్ సినిమాలే తీస్తారన్న కారణంతో చిన్మయి అలా విమర్శలు చేసినట్లుగా సమాచారం.