Drishyam 3: మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా భారతీయ సినీ రంగంలోనే ఒక క్లాసిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీగా గుర్తింపు తెచ్చుకున్న మూవీ 'దృశ్యం'. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్‌లాల్, మీనా ప్రధాన పాత్రల్లో వచ్చిన 'దృశ్యం' (2013), 'దృశ్యం 2' (2021) చిత్రాలు సంచలన విజయాలు సాధించాయి.

ఇప్పుడు అదే సిరీస్‌లో భాగంగా వచ్చిన 'దృశ్యం 3' గురువారం (మే 21) థియేటర్లలోకి వచ్చింది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. అయితే కొందరు సినిమాలోని సస్పెన్స్ ఎలిమెంట్స్‌ను సోషల్ మీడియాలో పెట్టేస్తుండటంతో చిత్ర యూనిట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
“చిన్న హింట్ ఇచ్చినా ఎక్స్‌పీరియన్స్ పాడవుతుంది”
సినిమా విడుదలైన కాసేపటికే నటి మీనా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ప్రేక్షకులకు, మోహన్ లాల్ అభిమానులకు ఒక సున్నితమైన విన్నపం చేశారు.
"ప్రియమైన సినీ ప్రేమికులకు, అభిమానులకు నాదొక చిన్న రిక్వెస్ట్. దయచేసి దృశ్యం 3కి సంబంధించిన స్పాయిలర్లను (ట్విస్టులను) ఎక్కడా పోస్ట్ చేయకండి. ఒక చిన్న హింట్ లేదా క్లూ ఇచ్చినా సరే.. సినిమా చూసే ప్రేక్షకుల ఎక్స్‌పీరియన్స్ మొత్తం పాడైపోతుంది. అందరూ అదే ఉత్కంఠతో, థ్రిల్‌తో థియేటర్లలో ఈ సినిమాను చూడనివ్వండి. కొన్ని అనుభవాలను థియేటర్లలో నేరుగా చూస్తేనే ఆ మజా వస్తుంది" అని మీనా రాసుకొచ్చారు.
ఈ రోజు ఉదయం మోహన్‌లాల్, 'దృశ్యం 3' చిత్ర బృందంతో కలిసి మీనా థియేటర్‌కు వెళ్లి అభిమానుల మధ్య కూర్చొని సినిమా వీక్షించారు.
అభిమానుల ప్రేమకు మోహన్‌లాల్ కృతజ్ఞతలు
తమ ప్రియతమ నటుడు 'జార్జ్‌కుట్టి'గా మళ్లీ స్క్రీన్‌పై అదరగొట్టడం, పైగా ఆయన పుట్టినరోజే సినిమా రిలీజ్ కావడంతో మోహన్‌లాల్ అభిమానులు థియేటర్ల వద్ద పండగ చేసుకుంటున్నారు. ఈ భారీ రెస్పాన్స్‌పై మోహన్‌లాల్ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రత్యేక పోస్టర్‌ను పంచుకుంటూ భావోద్వేగ నోట్ రాశారు.
{{/usCountry}}తమ ప్రియతమ నటుడు 'జార్జ్‌కుట్టి'గా మళ్లీ స్క్రీన్‌పై అదరగొట్టడం, పైగా ఆయన పుట్టినరోజే సినిమా రిలీజ్ కావడంతో మోహన్‌లాల్ అభిమానులు థియేటర్ల వద్ద పండగ చేసుకుంటున్నారు. ఈ భారీ రెస్పాన్స్‌పై మోహన్‌లాల్ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రత్యేక పోస్టర్‌ను పంచుకుంటూ భావోద్వేగ నోట్ రాశారు.
{{/usCountry}}" 'దృశ్యం 3' చిత్రాన్ని ఎంతో ప్రేమతో, ప్యాషన్‌తో, కృతజ్ఞతాభావంతో నిర్మించాం. దానికి మీ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే నా మనసు నిండిపోయింది" అని అన్నారు.
"మీరు ఇస్తున్న రివ్యూలు, మీ మాటలు, మీ ఎమోషన్స్ నాకు ఏ బాక్సాఫీస్ నంబర్ల కంటే కూడా చాలా చాలా ఎక్కువ. జార్జ్‌కుట్టి, అతని కుటుంబాన్ని మీ సొంత కుటుంబంలా ఆదరిస్తున్నందుకు, ప్రతి క్షణాన్ని ఫీల్ అవుతున్నందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు" అని మోహన్‌లాల్ పేర్కొన్నారు.
'దృశ్యం 3' కథేంటి?
ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబావూర్ నిర్మించిన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి మిక్స్‌డ్ రివ్యూలు వస్తున్నాయి. కథ పరంగా చూస్తే.. గత రెండు భాగాల్లో జరిగిన సంఘటనల నుండి జార్జ్‌కుట్టి కుటుంబం బయటపడి, జీవితంలో ముందుకు సాగాలని చూస్తుంది.
ఇంట్లో ఒక శుభకార్యం (పెద్ద కూతురు పెళ్లి) జరగబోయే సమయం అది. కానీ జార్జ్‌కుట్టి మైండ్ మాత్రం నిరంతరం భయంతో, అనుమానంతోనే ఉంటుంది. ఆయన భయపడినట్లే.. గతంలో తాము చేసిన తప్పులకు ప్రతికారం తీర్చుకోవడానికి పాత శత్రువులు మళ్లీ వీరి జీవితాల్లోకి వస్తారు. మరి ఈసారి జార్జ్‌కుట్టి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? అనేదే 'దృశ్యం 3' కథ.
ఈ సినిమా ముగింపు చూసిన ప్రేక్షకులు.. కథ ఇక్కడితో అవ్వలేదని, 'దృశ్యం 4' కి దర్శకుడు జీతూ జోసెఫ్ గట్టి పునాది వేశారని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. మోహన్‌లాల్ కూడా గతంలో మాట్లాడుతూ.. ఈ సినిమా ఆడే దాన్ని బట్టి పార్ట్ 4, పార్ట్ 5 కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని హింట్ ఇచ్చారు.