Drishyam 3: మలయాళ వర్షన్ కంటే 100 రెట్లు బెటర్..హిందీ దృశ్యం 3 సంచలనం..సోషల్ మీడియాలో రచ్చ..రెండు రోజుల్లోనే 177 కోట్లు

Drishyam 3: మరోసారి థియేటర్లలో దృశ్యం 3 రచ్చ మొదలైంది. కానీ ఈ సారి మలయాళం మూవీ కాదు. హిందీలో వచ్చిన దృశ్యం 3 బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. ఇదే సమయంలో మలయాళ దృశ్యం 3 కంటే హిందీ దృశ్యం 3 ఎంతో బెటర్ అనే కామెంట్లు వస్తున్నాయి. 

Published on: Oct 4, 2026, 13:00:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Drishyam 3: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'దృశ్యం 3' (Drishyam 3) బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సినిమా కేవలం హిందీ ప్రేక్షకులను మాత్రమే కాకుండా, మలయాళ ప్రేక్షకులను, కంటెంట్ క్రియేటర్లను కూడా అమితంగా ఆకట్టుకుంటోంది.

మలయాళ వర్షన్ కంటే 100 రెట్లు బెటర్..హిందీ దృశ్యం 3 సంచలనం..సోషల్ మీడియాలో రచ్చ..రెండు రోజుల్లోనే 177 కోట్లు (x)
మలయాళ వర్షన్ కంటే 100 రెట్లు బెటర్..హిందీ దృశ్యం 3 సంచలనం..సోషల్ మీడియాలో రచ్చ..రెండు రోజుల్లోనే 177 కోట్లు (x)

బాక్సాఫీస్ వద్ద 'దృశ్యం 3' ప్రభంజనం

అజయ్ దేవగన్, అభిషేక్ పాఠక్ కాంబినేషన్‌లో వచ్చిన 'దృశ్యం 3' చిత్రం శుక్రవారం (అక్టోబర్ 2) థియేటర్లలోకి వచ్చి అంచనాలను మించి సంచలనం సృష్టిస్తోంది. Sacnilk నివేదికల ఆధారంగా ఈ సినిమా మొదటి రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.66.75 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 95.10 కోట్ల గ్రాస్ సాధించి అజయ్ దేవగన్ సినీ ప్రయాణంలోనే అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది.

రెండు రోజుల్లోనే

దృశ్యం 3 హిందీ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూనే ఉంది. ఈ సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.177 కోట్ల గ్రాస్ ఖాతాలో వేసుకుంది. కేవలం రెండు రోజుల్లోనే దృశ్యం 1 లైఫ్ టైమ్ కలెక్షన్లను దృశ్యం 3 దాటేయడం విశేషం.

మలయాళ ప్రేక్షకులు ఫిదా

సాధారణంగా రీమేక్ సినిమాలను మలయాళ ప్రేక్షకులు లేదా కంటెంట్ క్రియేటర్లు పెద్దగా ఇష్టపడరు. కానీ 'దృశ్యం 3' విషయంలో సీన్ తలకిందులైంది. ఒక ప్రముఖ మలయాళ కంటెంట్ క్రియేటర్ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేస్తూ, హిందీ మేకర్స్ ముగింపు ఇచ్చిన తీరుకి తాను థియేటర్‌లో చప్పట్లు కొట్టక తప్పలేదని కొనియాడారు.

మొదటి రెండు భాగాల హిందీ వర్షన్లపై తనకు చిన్నచూపు ఉండేదని, కానీ మూడో భాగం కథనం, ఆఖరి సన్నివేశాలు అద్భుతంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు. ఈ చిత్రానికి ఒరిజినల్ డైరెక్టర్ జీతు జోసెఫ్ రైటింగ్ క్రెడిట్ కేవలం 1 శాతం కూడా లేదని, హిందీ రచయితలే సొంతంగా ఈ అద్భుతమైన ముగింపును రాసుకున్నారని ఆయన కొనియాడారు.

మలయాళం కంటే 100 రెట్లు బెటర్

ఈ వీడియో కింద నెటిజన్లు పెడుతున్న కామెంట్లు కూడా హిందీ వెర్షన్‌కే ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి. కొంతమంది మలయాళ ఆడియన్స్ స్పందిస్తూ.. మోహన్‌లాల్ 'దృశ్యం 3' మలయాళ వెర్షన్ కేవలం బిజినెస్ కోసమే తీసినట్లు అనిపించిందని, కానీ అజయ్ దేవగన్ హిందీ వెర్షన్ అంతకంటే 100 రెట్లు బాగుందని వ్యాఖ్యానించారు. హిందీ వెర్షన్ ముగింపు ఎంతో అర్థవంతంగా, పార్ట్ 2కి సరైన కొనసాగింపుగా ఉందంటూ మెచ్చుకుంటున్నారు.

అయితే, కొందరు మోహన్‌లాల్ అభిమానులు మాత్రం జార్జ్‌కుట్టి పాత్రలో మోహన్‌లాల్ పండించే భావోద్వేగాలను, యాక్టింగ్‌ను మరెవరూ మ్యాచ్ చేయలేరని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

రీమేక్ కాదు.. ఒరిజినల్ కథ

ఈ సినిమాకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, 'దృశ్యం 3' హిందీ వెర్షన్ మలయాళ సినిమాకి రీమేక్ కాదు. మొదటి రెండు భాగాలు మలయాళ సినిమాలకు నేరుగా రీమేక్‌లుగా వచ్చినప్పటికీ, మూడో భాగం కోసం దర్శకుడు అభిషేక్ పాఠక్ పూర్తి భిన్నమైన ఒరిజినల్ స్టోరీలైన్‌ను ఎంచుకున్నారు. స్వతంత్ర కథతో, నూతన స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించిన ఈ క్లైమాక్స్ కోసం నటుడు అజయ్ దేవగన్ ముందే మోహన్‌లాల్‌ను కలిసి ఆయన అనుమతి, ఆశీస్సులు తీసుకున్నట్లు గతంలోనే వెల్లడించారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More