...
...
Next Story

Drishyam 3: దృశ్యం 3 బాక్సాఫీస్ ఊచకోత..5 రోజుల్లో ఇండియాలోనే 200 కోట్లు..హీరో కంటే ముందే పంపించేవాళ్లని శ్రియా కామెంట్లు

Drishyam 3: క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ దృశ్యం 3 బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఈ హిందీ మూవీ థియేటర్లలో రికార్డుల కలెక్షన్లు కురిపిస్తోంది. కేవలం 5 రోజుల్లోనే ఈ సినిమా కేవలం ఇండియాలోనే రూ.200 కోట్ల వసూళ్లను దాటింది. ఈ మూవీ సక్సెస్ సందర్భంగా శ్రియా శరణ్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

Published on: Oct 7, 2026, 09:11:58 IST
Advertisement

Drishyam 3: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీ ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రిలీజైన మొదటి రోజు నుంచే భారీ ఓపెనింగ్స్ సాధించిన ఈ క్రైమ్ థ్రిల్లర్.. వర్కింగ్ డే అయిన సోమవారం కాస్త తగ్గినప్పటికీ బాక్సాఫీస్ రన్‌ను మాత్రం గట్టిగానే కొనసాగిస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా రూ.200 కోట్ల మార్క్‌ను దాటేసి, ఇటీవల వచ్చిన పలు హిట్ చిత్రాల రికార్డులను తిరగరాసింది.

దృశ్యం 3 కలెక్షన్లు

దృశ్యం 3 బాక్సాఫీస్ ఊచకోత..5 రోజుల్లో ఇండియాలోనే 200 కోట్లు..హీరో కంటే ముందే పంపించేవాళ్లని శ్రియా కామెంట్లు
దృశ్యం 3 బాక్సాఫీస్ ఊచకోత..5 రోజుల్లో ఇండియాలోనే 200 కోట్లు..హీరో కంటే ముందే పంపించేవాళ్లని శ్రియా కామెంట్లు

ట్రేడ్ ట్రాకర్స్ సమాచారం ప్రకారం.. ‘దృశ్యం 3’ ఇండియాలో మొదటి ఐదు రోజుల్లో దాదాపు రూ.216.50 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టింది. శుక్రవారం రూ.62 కోట్ల భారీ వసూళ్లతో అజయ్ దేవగన్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రం.. శనివారం రూ.53.50 కోట్లు, మళ్లీ ఆదివారం పుంజుకుని రూ.61 కోట్లు సాధించింది.

అయితే వీకెండ్ తర్వాత వచ్చే సోమవారం ఊహించినట్లుగానే డ్రాప్ కనిపించి రూ.21 కోట్ల కలెక్షన్లు, మంగళవారం రూ.19 కోట్లు వసూలు చేసింది. వీక్ డేస్‌లో నెమ్మదించినా, ఓవరాల్‌గా సినిమా రేంజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌కు వెళ్ళిపోయింది.

కొత్త చరిత్ర

ఈ కలెక్షన్ల స్పీడ్ చూస్తుంటే ‘దృశ్యం 3’ మూవీ.. ఈ ఫ్రాంఛైజీలో మొదటి భాగం లైఫ్‌టైమ్ కలెక్షన్ల (రూ.102.75 కోట్లు) కంటే ఇప్పటికే డబుల్ వసూలు చేసింది. అంతేకాదు, ‘దృశ్యం 2’ సాధించిన రూ.239.67 కోట్ల రికార్డును దాటడానికి ఈ సినిమాకు కేవలం మరో రూ.30 కోట్లు మాత్రమే కావాలి. ఈ వారంలో ఇదే నిలకడను కొనసాగిస్తే, ఈ ఫ్రాంచైజీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘దృశ్యం 3’ సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయం.

శ్రియా శరణ్ కామెంట్స్

ఒక్కోసారి హీరో అజయ్ దేవగన్ కంటే ముందే తనకు ప్యాకప్ చెప్పి ఇంటికి పంపించేవారని శ్రియా శరణ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇంత మంచి, దయాగుణం ఉన్న టీమ్‌తో కలిసి పనిచేయడం పట్ల శ్రియా తన కృతజ్ఞతలు చాటుకున్నారు. ఈ టీమ్ తో వర్క్ చేయడాన్ని ఎంతో ఎంజాయ్ చేశానని ఆమె చెప్పుకొచ్చారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks