Drishyam 3 OTT: మలయాళ చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులు సృష్టించిన సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ ‘దృశ్యం’. ఇప్పుడీ సిరీస్ నుంచి వచ్చిన తాజా చిత్రం ‘దృశ్యం 3’ (Drishyam 3) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సూపర్ స్టార్ మోహన్ లాల్ ‘జార్జ్‌కుట్టి’గా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. థియేటర్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు.
దృశ్యం 3 ఓటీటీ

మోహన్ లాల్, మీనా తదితరులు నటించిన ‘దృశ్యం 3’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) దక్కించుకుంది. ఈ చిత్రానికి ప్రైమ్ వీడియో అధికారిక డిజిటల్ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.
స్ట్రీమింగ్ డేట్
దృశ్యం 3 చిత్ర బృందం ఓటీటీ విడుదల తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. సాధారణంగా థియేట్రికల్ విడుదలకు, ఓటీటీ విడుదలకు మధ్య ఉండే ఆరు నుంచి ఎనిమిది వారాల గ్యాప్ నిబంధన ఈ మూవీకి కూడా వర్తించనుంది. ఈ లెక్కన చూస్తే.. 'ది ఎకనామిక్ టైమ్స్' నివేదిక ప్రకారం దృశ్యం 3 చిత్రం జూన్ చివరి వారంలో లేదా జూలై ప్రారంభంలో ప్రైమ్ వీడియో ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.
బర్త్ డే స్పెషల్
మోహన్ లాల్ 66వ పుట్టినరోజు సందర్భంగా దృశ్యం 3 చిత్రం మే 21, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. మునుపటి రెండు భాగాలతో పోలిస్తే, ఈ మూడో భాగానికి విమర్శకులు, ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. అయినప్పటికీ, వసూళ్ల పరంగా మాత్రం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది.
జార్జ్‌కుట్టి కథలో కొత్త మలుపులు
దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ‘దృశ్యం’ మొదటి రెండు భాగాలను అద్భుతంగా తెరకెక్కించిన ఆయనే, ఈ మూడో భాగాన్ని కూడా రూపొందించడం విశేషం. ఇందులో మోహన్ లాల్ సరసన మీనా నటించగా.. అన్సిబా హసన్, ఎస్తేర్ అనిల్, కళాభవన్ షాజోన్, సిద్ధిఖ్, మురళీ గోపి, ఆశా శరత్ తదితరులు తమ పాత పాత్రల్లోనే అలరించారు.
{{/usCountry}}దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ‘దృశ్యం’ మొదటి రెండు భాగాలను అద్భుతంగా తెరకెక్కించిన ఆయనే, ఈ మూడో భాగాన్ని కూడా రూపొందించడం విశేషం. ఇందులో మోహన్ లాల్ సరసన మీనా నటించగా.. అన్సిబా హసన్, ఎస్తేర్ అనిల్, కళాభవన్ షాజోన్, సిద్ధిఖ్, మురళీ గోపి, ఆశా శరత్ తదితరులు తమ పాత పాత్రల్లోనే అలరించారు.
{{/usCountry}}ఈ ఫ్రాంచైజీ ప్రస్థానాన్ని పరిశీలిస్తే.. 2013లో వచ్చిన మొదటి భాగం ‘దృశ్యం’ సంచలన విజయం సాధించింది. కేబుల్ ఆపరేటర్ అయిన జార్జ్‌కుట్టి, అనుకోకుండా జరిగిన ఒక హత్య కేసు నుండి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎంతటి సాహసాలు చేశాడనే కథాంశంతో ఇది తెరకెక్కింది. ఆ తర్వాత వచ్చిన ‘దృశ్యం 2’ కూడా భారీ హిట్‌గా నిలిచింది.
కలెక్షన్ల సునామీ
మిశ్రమ సమీక్షలు వచ్చినప్పటికీ ఈ ఏడాది మలయాళ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా ‘దృశ్యం 3’ నిలిచింది. ప్రముఖ ట్రేడ్ విశ్లేషణ సంస్థ ‘సక్నిల్క్’ (Sacnilk) నివేదిక ప్రకారం.. మూవీ ఇప్పటివరకు భారతదేశంలో రూ.75.30 కోట్ల నెట్ కలెక్షన్లు, రూ. 87.38 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
ఇక ఓవర్సీస్ (విదేశాల్లో) విషయానికొస్తే, ఏడో రోజున రూ.5 కోట్లు రాబట్టడంతో విదేశీ గ్రాస్ కలెక్షన్లు రూ.95.70 కోట్లకు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటివరకు రూ. 183.08 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో దూసుకుపోతోంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
1. ‘దృశ్యం 3’ సినిమా ఓటీటీ హక్కులను ఏ ప్లాట్‌ఫామ్ సొంతం చేసుకుంది?
మోహన్ లాల్ నటించిన ‘దృశ్యం 3’ చిత్రం అధికారిక డిజిటల్ భాగస్వామి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video).
2. ‘దృశ్యం 3’ ఓటీటీలో ఎప్పుడు విడుదల కావచ్చు?
అధికారిక తేదీ ప్రకటించనప్పటికీ థియేటర్లలో విడుదలైన 6 నుండి 8 వారాల తర్వాత, అంటే జూన్ చివరి వారంలో లేదా జూలై 2026 మొదట్లో ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.
3. బాక్సాఫీస్ వద్ద ‘దృశ్యం 3’ మొత్తం ఎంత వసూలు చేసింది?
ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.183.08 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. భారతదేశంలో దీని నెట్ కలెక్షన్లు రూ.75.30 కోట్లుగా ఉన్నాయి.