Drishyam 3 Teaser: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సంచలన థ్రిల్లర్ 'దృశ్యం 3' టీజర్ విడుదలైంది. గతాన్ని వెంటాడుతున్న నీడల నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి జార్జి కుట్టి చేసే పోరాటం ఈసారి మరింత ఉత్కంఠగా ఉండబోతోందని స్పష్టమవుతోంది.
బాక్సాఫీస్ వద్ద మళ్లీ 'దృశ్యం' హంగామా

దక్షిణాది సినిమా రారాజు మోహన్ లాల్ నటించిన అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్రాంచైజీలలో 'దృశ్యం' ఒకటి. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లో మూడో భాగం దృశ్యం 3 కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసి, రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు.
మే 21న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. కేవలం మలయాళంలోనే కాకుండా, భారతీయ సినిమా రంగంలోనే ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచిన ఈ కథ, ఈసారి ఏ మలుపు తిరుగుతుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
గతాన్ని మర్చిపోని చట్టం.. జార్జికుట్టి భయం
విడుదలైన టీజర్ గమనిస్తే మొదటి రెండు భాగాల్లోని కీలక సన్నివేశాలను గుర్తు చేస్తూ ప్రారంభమవుతుంది. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఒక సామాన్యుడు చట్టంతో ఎలా ఆడుకున్నాడు.. ఎంతటి సాహసాలకు ఒడిగట్టాడనే అంశాలను క్లుప్తంగా చూపించారు. అయితే అసలు ట్విస్ట్ కథ వర్తమానంలోకి వచ్చినప్పుడు కనిపిస్తుంది.
టీజర్‌లో జార్జికుట్టి ఒక చర్చిలో యేసుక్రీస్తు ముందు ప్రార్థన చేస్తూ కనిపిస్తాడు. "పరిస్థితులు మారుతున్నాయి.. ఇప్పుడు నా చుట్టూ సెగ మొదలైంది.. నన్ను ఇంకా ఎవరు గమనిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు" అంటూ అతను చెప్పే డైలాగ్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. గతాన్ని కప్పిపెట్టే ప్రయత్నంలో జార్జి కుట్టి చేసిన పనులకు ఈసారి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందా అనే అనుమానం కలుగుతోంది.
దృశ్యం 3 విశేషాలు
దర్శకుడు జీతూ జోసెఫ్ ఈసారి కథను మరింత గ్రిప్పింగ్‌గా మలిచినట్లు కనిపిస్తోంది. టీజర్ ఎక్కడా కథను రివీల్ చేయకుండా కేవలం మూడ్‌ను మాత్రమే ఎలివేట్ చేసింది. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబావూరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్ జాన్సన్ అందించిన నేపథ్య సంగీతం ఉత్కంఠను రెట్టింపు చేస్తోంది. మోహన్ లాల్ పోషించిన జార్జికుట్టి పాత్ర భార్యగా మీనా, కూతుళ్లుగా అన్సిబా హసన్, ఎస్తేర్ అనిల్ మళ్లీ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
{{/usCountry}}దర్శకుడు జీతూ జోసెఫ్ ఈసారి కథను మరింత గ్రిప్పింగ్‌గా మలిచినట్లు కనిపిస్తోంది. టీజర్ ఎక్కడా కథను రివీల్ చేయకుండా కేవలం మూడ్‌ను మాత్రమే ఎలివేట్ చేసింది. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబావూరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్ జాన్సన్ అందించిన నేపథ్య సంగీతం ఉత్కంఠను రెట్టింపు చేస్తోంది. మోహన్ లాల్ పోషించిన జార్జికుట్టి పాత్ర భార్యగా మీనా, కూతుళ్లుగా అన్సిబా హసన్, ఎస్తేర్ అనిల్ మళ్లీ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
{{/usCountry}}మలయాళంలో వస్తున్న ఈ మూవీ తప్పకుండా తెలుగు, హిందీ భాషల్లో కూడా రీమేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే మోహన్ లాల్ ఒరిజినల్ వెర్షన్‌లో చూపించే ఆ గంభీరత, సస్పెన్స్ స్థాయి మరే ఇతర వెర్షన్‌లోనూ రాదనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం. మే 21న జార్జికుట్టి తెలివితేటలు గెలుస్తాయా లేక చట్టం పంజా విసురుతుందా అనేది తేలిపోనుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. దృశ్యం 3 సినిమా ఎప్పుడు విడుదలవుతుంది?
'దృశ్యం 3' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో 2026, మే 21న విడుదల కానుంది.
2. దృశ్యం 3 సినిమాలో ప్రధాన తారాగణం ఎవరు?
మలయాళ వెర్షన్‌లో మోహన్ లాల్, మీనా, అన్సిబా హసన్, ఎస్తేర్ అనిల్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు.
3. దృశ్యం 3 కథ దేని గురించి ఉండబోతోంది?
మొదటి రెండు భాగాల్లోని హత్య కేసు తాలూకు విచారణ మళ్లీ తెరపైకి రావడం, జార్జికుట్టి కుటుంబాన్ని పోలీసులు ఏ విధంగా ఇరికించబోతున్నారనే అంశంపై ఈ చిత్రం ఉండనుంది.