Drishyam 3 Telugu OTT Stay: మలయాళంలో ఇండస్ట్రీ హిట్ సాధించిన 'దృశ్యం' ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మొదటి రెండు భాగాలు తెలుగులో వెంకటేష్ హీరోగా రీమేక్ అయి ఇక్కడ కూడా బ్లాక్‌బస్టర్స్ గా నిలిచాయి. అయితే ఈ మూడో భాగాన్ని మాత్రం తెలుగులో రీమేక్ చేయకుండా, నేరుగా మలయాళ వర్షన్ తో పాటే తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు.

జూన్ 18న (గురువారం) ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో గ్రాండ్ గా రిలీజ్ కావాల్సి ఉంది. సరిగ్గా స్ట్రీమింగ్ కు కొన్ని గంటల ముందే ఈ సినిమా తెలుగు వర్షన్ పై కోర్టు స్టే ఇవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
Sripriya's Petition in Madras High Court | కోర్టుకెక్కిన డైరెక్టర్ శ్రీప్రియ..
'దృశ్యం' మొదటి భాగాన్ని తెలుగులో వెంకటేష్, మీనా లీడ్ రోల్స్ లో డైరెక్టర్ శ్రీప్రియ (Sripriya) రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 'దృశ్యం 3' తెలుగు హక్కులు తమకే చెందుతాయంటూ శ్రీప్రియ, ఆమె నిర్మాణ సంస్థ 'రాజ్ కుమార్ థియేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్' మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ సినిమాను తెలుగు భాషలో రిలీజ్ చేయకుండా శాశ్వత నిషేధం విధించాలని కోరుతూ శ్రీప్రియ, రాజ్ కుమార్ సేతుపతి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమకు తెలియకుండా, తమ కాపీరైట్ హక్కులను ఉల్లంఘిస్తూ ఈ సినిమాను తెలుగు డబ్బింగ్ రూపంలో ఓటీటీలో రిలీజ్ చేయడం చట్టవిరుద్ధమని వారు వాదించారు.
High Court Order | కోర్టు మధ్యంతర ఉత్తర్వులు!
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ కే కుమారేష్ బాబు కీలకమైన మధ్యంతర ఆదేశాలు ఇచ్చారు. ఈ కేసులో ఉన్న ప్రతివాదులకు ముందే ప్రైవేట్ నోటీసులు జారీ చేసినప్పటికీ, వారి తరపున ఎవరూ కోర్టుకు హాజరు కాలేదని న్యాయమూర్తి నోట్ చేశారు.
{{/usCountry}}ఈ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ కే కుమారేష్ బాబు కీలకమైన మధ్యంతర ఆదేశాలు ఇచ్చారు. ఈ కేసులో ఉన్న ప్రతివాదులకు ముందే ప్రైవేట్ నోటీసులు జారీ చేసినప్పటికీ, వారి తరపున ఎవరూ కోర్టుకు హాజరు కాలేదని న్యాయమూర్తి నోట్ చేశారు.
{{/usCountry}}"ప్రతివాదులకు నోటీసులు అందినప్పటికీ వారి తరపున ఎవరూ కోర్టుకు రాలేదు, కాజ్ లిస్ట్ లో కూడా వారి పేర్లు ప్రింట్ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో పిటిషనర్ కాపీరైట్ హక్కులను రక్షించాల్సిన బాధ్యత ఉంది. అందుకే రెస్పాండెంట్స్, వారి సిబ్బంది లేదా అసైనీలు ఎవరూ కూడా 'దృశ్యం 3' సినిమాను తెలుగు వెర్షన్ లో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేయకూడదని మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నాం" అని కోర్టు స్పష్టం చేసింది.
కరోనా సమయంలో 'దృశ్యం 2' తెలుగు రీమేక్ నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అయింది, అప్పుడు ఎలాంటి లీగల్ ఇష్యూస్ రాలేదు. కానీ ఈ మూడో భాగాన్ని తెలుగులో రీమేక్ చేయకపోవడానికి అసలు కారణాలు ఏంటనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది.
తాజా కోర్టు ఆర్డర్ ప్రకారం.. రేపు (జూన్ 18న) 'దృశ్యం 3' మలయాళ ఒరిజినల్ వెర్షన్ తో పాటు ఇతర భాషల్లో రిలీజ్ అయినా, తెలుగు డబ్బింగ్ వర్షన్ మాత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ లేదు. ఈ వివాదం సద్దుమణిగాకే తెలుగు ఆడియన్స్ కు ఈ సినిమా అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.