Drishyam The Conclusion Trailer: అజయ్ దేవగన్ ఐకానిక్ క్యారెక్టర్ విజయ్ సల్గాంకర్‌ను ఈసారి చట్టం బోనులో నిలబెట్టడానికి పోలీస్ డిపార్ట్‌మెంట్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. భారీ అంచనాల మధ్య రిలీజైన 'దృశ్యం: ది కన్‌క్లూజన్' (Drishyam: The Conclusion) ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

గతంలో పోలీసుల కళ్లు కప్పి, సమర్థవంతంగా సాక్ష్యాలను మాయం చేసిన విజయ్ సల్గాంకర్‌కు ఈసారి అసలైన కాళరాత్రి ఎదురైనట్లు కనిపిస్తోంది. లోకల్ పోలీస్ స్టేషన్ పునాదుల్లో దాచిపెట్టిన సమీర్ దేశ్‌ముఖ్ శవం గుట్టు రట్టు చేసేందుకు క్రైమ్ బ్రాంచ్ రౌండ్ వేసింది.
జైదీప్ అహ్లావత్ ఎంట్రీ.. నరాలు తెగే ఉత్కంఠ
మలయాళం బ్లాక్‌బస్టర్ దృశ్యం ఫ్రాంఛైజీ ఆధారంగా హిందీలో తెరకెక్కిన సిరీస్ ఇది. ఇప్పటికే రెండు సినిమాలు రాగా.. ఇప్పుడు దృశ్యం: ది కన్‌క్లూజన్ పేరుతో మూడో మూవీని తీసుకొస్తున్నారు.
ఈ మూడో భాగంలో అసలైన ట్విస్ట్ ఏంటంటే.. ఎస్పీ క్రైమ్ బ్రాంచ్ రాజ్‌వీర్ సింగ్ తోమర్ పాత్రలో జైదీప్ అహ్లావత్ ఎంట్రీ ఇవ్వడమే. జైదీప్ అహ్లావత్ తన పవర్‌ఫుల్ యాక్టింగ్‌తో విలన్ పాత్ర స్థాయిని వేరే లెవెల్‌కు తీసుకెళ్లారు.
ట్రైలర్‌లో విజయ్ సల్గాంకర్‌ను జైదీప్ ప్రశ్నించే సీన్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఎస్పీ గుండె మీద చేయి వేసి పల్స్ చెక్ చేస్తూ విజయ్ సమాధానం చెప్పడం, వెంటనే ఎస్పీ రివర్స్‌లో శవం ఎక్కడుందో నిలదీయడం చూస్తే ప్రేక్షకులకు నరాలు తెగే ఉత్కంఠ కలుగుతోంది.
ప్రతీకారం కోసం టబు, ప్రకాష్ రాజ్
తన కొడుకు చావుకు ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని మీరా దేశ్‌ముఖ్ (టబు) రగిలిపోతోంది. ఆమెకు తోడుగా రచయిత మురాద్ అలీ (సౌరభ్ శుక్లా), అలాగే అగ్ర నటుడు ప్రకాష్ రాజ్ లాయర్ పాత్రలో విజయ్ను చట్టానికి పట్టిచ్చేందుకు పక్కా ప్లాన్ వేశారు.
{{/usCountry}}తన కొడుకు చావుకు ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని మీరా దేశ్‌ముఖ్ (టబు) రగిలిపోతోంది. ఆమెకు తోడుగా రచయిత మురాద్ అలీ (సౌరభ్ శుక్లా), అలాగే అగ్ర నటుడు ప్రకాష్ రాజ్ లాయర్ పాత్రలో విజయ్ను చట్టానికి పట్టిచ్చేందుకు పక్కా ప్లాన్ వేశారు.
{{/usCountry}}సినిమాలు, క్రైమ్ నవలలు చూసి ఐడియాలు కాపీ కొట్టే విజయ్ ఈసారి ఎలాంటి ఎత్తుగడలు వేస్తాడోనని మీరా దేశ్‌ముఖ్ ఆందోళన చెందుతుంటే.. లాయర్‌గా ప్రకాష్ రాజ్ వేసే ప్రశ్నలు విజయ్ జీవితాన్ని తలకిందులు చేసేలా ఉన్నాయి. విజయ్ ముఖంలో భయం, ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అక్టోబర్ 2న థియేటర్లలోకి బిగ్గెస్ట్ థ్రిల్లర్
డైరెక్టర్ అభిషేక్ పాఠక్ ఈసారి సరికొత్త కథనం, స్క్రీన్‌ప్లేతో ఈ ఫ్రాంచైజీకి ఓ సరికొత్త ముగింపు ఇవ్వబోతున్నారు. విజయ్ కేవలం తన తెలివితోనే కాకుండా ఈసారి అదృష్టం, కాలంతో కూడా పోరాడాల్సి వస్తోంది.
భారతీయ సినిమాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మైండ్ గేమ్ థ్రిల్లర్‌గా నిలిచిన 'దృశ్యం' సిరీస్‌కు ఇది చివరి ఘట్టం. 'దృశ్యం 3' అక్టోబర్ 2న థియేటర్లలో వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
మలయాళంలో నాలుగో భాగం రానుందని ఇప్పటికే అనౌన్స్ చేసినా.. హిందీలో మాత్రం మూడుతోనే ముగింపు పలకబోతున్నారు. ఇక తెలుగులో దృశ్యం 3 వచ్చే అవకాశం లేనట్లే. ఇప్పటికే మలయాళం ఒరిజినల్ తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఓటీటీలోనూ అందుబాటులో ఉంది.